MM Keeravani: బాలీవుడ్ విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్ శుక్రవారం (నవంబర్ 13) తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ప్రత్యేకమైన ఫోటోలను పంచుకున్నారు. మొదటి స్లైడ్‌లో ఎంఎం కీరవాణి బరువు తగ్గక ముందు, తగ్గిన తర్వాత ఉన్న ఫోటోలను పోస్ట్ చేయగా.. మిగిలిన ఫోటోలలో కీరవాణితో కలిసి ఎంతో ఉత్సాహంగా పోజులిస్తూ కనిపించారు.
అనుపమ్ ఖేర్ ఏమన్నారంటే?

ఎంఎం కీరవాణి శారీరక మార్పును చూసి గర్వపడుతూ అనుపమ్ ఖేర్ తన పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. "మిస్టర్ కీరవాణి - బిఫోర్ అండ్ ఆఫ్టర్! నా అత్యంత ప్రియమైన మిత్రుడు, ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి గారు ఏకంగా 22 కిలోల బరువు తగ్గారు. ఆయన పట్టుదల నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకం. నా హైదరాబాద్ పర్యటనలో ఆయన్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన ఎంతో ఫ్రెష్‌గా, పూర్తి ఉత్సాహంతో ప్రపంచాన్ని జయించడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించారు. ఆయన నడకలో ఒక కొత్త ఉత్సాహం కనిపించింది. ఆయన్ని ఇంత ఆనందంగా, ఆత్మవిశ్వాసంతో చూడటం నాకు ఎంతో గర్వంగా ఉంది. కీరవాణి సర్, మీరు సంగీతంలో ఒక మేధావి. ఇప్పుడు ఏకాగ్రత, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించారు. మీ ఈ కొత్త అధ్యాయానికి శుభాకాంక్షలు మిత్రమా. జై హో" అని అనుపమ్ ఖేర్ అన్నారు.
ఈ ఫోటోలు బయటకు రావడంతో అభిమానులు, సినీ ప్రముఖులు కీరవాణి డెడికేషన్‌కు ఫిదా అవుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
సంగీత ప్రపంచంలో అజేయుడు.. ఇప్పుడు ఫిట్‌నెస్‌లోనూ స్ఫూర్తి
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సోదరుడైన ఎంఎం కీరవాణి, 1987లో ప్రముఖ సంగీత దర్శకుడు కె. చక్రవర్తి వద్ద సహాయకుడిగా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1990లో 'కల్కి' చిత్రంతో స్వతంత్ర సంగీత దర్శకుడిగా అవకాశం దక్కించుకున్నప్పటికీ, ఆ సినిమా విడుదల కాలేదు.
{{/usCountry}}దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సోదరుడైన ఎంఎం కీరవాణి, 1987లో ప్రముఖ సంగీత దర్శకుడు కె. చక్రవర్తి వద్ద సహాయకుడిగా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1990లో 'కల్కి' చిత్రంతో స్వతంత్ర సంగీత దర్శకుడిగా అవకాశం దక్కించుకున్నప్పటికీ, ఆ సినిమా విడుదల కాలేదు.
{{/usCountry}}ఆ తర్వాత మౌళి దర్శకత్వంలో వచ్చిన 'మనసు మమత' (1990) ఆయన తొలి విడుదలైన చిత్రంగా నిలిచింది. అయితే 1991లో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘క్షణక్షణం’ కీరవాణికి తిరుగులేని గుర్తింపును తెచ్చిపెట్టింది.
దశాబ్దాల కెరీర్‌లో 'అన్నమయ్య', 'క్రిమినల్', 'మగధీర', 'బాహుబలి' వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలకు ఆయన ప్రాణం పోశారు. రాజమౌళి తెరకెక్కించిన గ్లోబల్ హిట్ 'ఆర్ఆర్ఆర్' (RRR)లోని 'నాటు నాటు' పాటకు గానూ 2023లో ప్రతిష్టాత్మక అకాడమీ అవార్డు (Oscar), గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలను గెలుచుకుని భారతీయ సంగీత కీర్తిని విశ్వవ్యాప్తం చేశారు.
ప్రస్తుతం కీరవాణి, ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో 2027లో విడుదల కానున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి' (Varanasi)కి సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ పనుల కోసమే ఆయన మరింత ఫిట్‌గా, ఎనర్జిటిక్‌గా మారినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
‘రామాయణం’ రూ.1000 కోట్ల జోరులో అనుపమ్ ఖేర్..
మరోవైపు నటుడు అనుపమ్ ఖేర్ కూడా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొంది, బాక్సాఫీస్ వద్ద కేవలం 8 రోజుల్లోనే రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరి సంచలనం సృష్టిస్తున్న 'రామాయణం: పార్ట్ 1' (Ramayana: Part 1) చిత్రంలో అనుపమ్ ఖేర్ 'జటాయువు' పాత్రకు తన గంభీరమైన వాయిస్ అందించారు.
అలాగే ఆయన కీలక పాత్రలో నటించిన రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా 'యే ప్రేమ్ మోహ్ లియా' (Yeh Prem Moh Liya) విడుదలకు సిద్ధమైంది. సూరజ్ బర్జాత్యా దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానా, శర్వరీ జంటగా నటించిన ఈ చిత్రంలో సుప్రియా పాఠక్, సీమా పహ్వా, సౌమ్యా టాండన్, షాద్ రంధవా, స్వానంద్ కిర్కిరే ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా నవంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది.
వయసు కేవలం ఒక నంబర్ మాత్రమేనని నిరూపిస్తూ, తన కొత్త లుక్‌తో ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఎంఎం కీరవాణి.. తన కొత్త ఉత్సాహంతో 'వారణాసి' చిత్రానికి ఇంకెంత అద్భుతమైన సంగీతాన్ని అందిస్తారోనని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.