ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్టాత్మక మూవీ ‘వారణాసి’పై అంచనాలు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో.. రాజమౌళి ఈ సినిమా టైటిల్ టీజర్ ను విడుదల చేశాడు. ఇందులో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా సౌండ్‌ట్రాక్ గురించి కీరవాణి మాట్లాడుతూ.. అభిమానులు ఈ సినిమాలో గొప్ప మ్యూజిక్ ఆశించవచ్చని అన్నాడు.
కీరవాణి ఏమన్నాడంటే?

ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)కు హాజరైన కీరవాణి.. పీటీఐతో మాట్లాడాడు. "అభిమానులు అద్భుతమైన గొప్పదనాన్ని ఆశించవచ్చు. అంతకు మించి నేను ఏమీ చెప్పకూడదు. వారణాసి సినిమాలో ఆరు పాటలు ఉంటాయి" అని కీరవాణి తెలిపాడు.
కీరవాణి ఈ సినిమా సంగీతం గురించి మాట్లాడుతూ.. తనపై ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పాడు. "మీరు చేసే ఏ పనిలోనైనా అది సినిమా ప్రాజెక్ట్ కావచ్చు లేక ఇంకేదైనా కావచ్చు.. స్పష్టత, నమ్మకం ఉన్నప్పుడు ఎలాంటి ఒత్తిడి ఉండదు. గందరగోళం ఉన్నప్పుడే ఒత్తిడి వస్తుంది. నా విషయంలో ఎలాంటి గందరగోళం లేదు" అని కీరవాణి స్పష్టం చేశాడు.
కీరవాణి.. రాజమౌళితో కలిసి గతంలో స్టూడెంట్ నం. 1, మగధీర, ఈగ, బాహుబలి వంటి విజయవంతమైన సినిమాలకు పని చేశాడు. అంతేకాదు 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాలోని నాటు నాటు పాటకు కీరవాణి ఆస్కార్ అవార్డును గెలుచుకున్నాడు.
'వారణాసి' మూవీ గురించి..
రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న వారణాసి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో రాజమౌళి పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ రేంజ్ కు వెళ్లే ప్లాన్ చేస్తున్నాడు.
ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియోలో ఒక ఉల్క భూమిపై పడుతున్నట్లు చూపించారు. ఆ శిథిలాలు వారణాసి, అంటార్కిటికా, ఆఫ్రికా ఇంకా ఇతర ప్రాంతాల్లో పడతాయి. ఈ సినిమా కొన్ని శతాబ్దాల టైమ్ ట్రావెల్ కుతోడు రామాయణంతోనూ లింకు ఉన్నట్లు చూపిస్తోంది. ఇక ఈ వీడియో చివర్లో మహేష్ బాబు ఎంట్రీ, చేతిలో త్రిశూలంతో, రక్తం నిండిన ముఖంతో, ఓ ఎద్దుపై స్వారీ చేస్తూ రావడం హైలైట్ గా నిలిచింది.
{{/usCountry}}ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియోలో ఒక ఉల్క భూమిపై పడుతున్నట్లు చూపించారు. ఆ శిథిలాలు వారణాసి, అంటార్కిటికా, ఆఫ్రికా ఇంకా ఇతర ప్రాంతాల్లో పడతాయి. ఈ సినిమా కొన్ని శతాబ్దాల టైమ్ ట్రావెల్ కుతోడు రామాయణంతోనూ లింకు ఉన్నట్లు చూపిస్తోంది. ఇక ఈ వీడియో చివర్లో మహేష్ బాబు ఎంట్రీ, చేతిలో త్రిశూలంతో, రక్తం నిండిన ముఖంతో, ఓ ఎద్దుపై స్వారీ చేస్తూ రావడం హైలైట్ గా నిలిచింది.
{{/usCountry}}మహేష్ బాబు ఈ సినిమాలో రుద్ర పాత్రను పోషిస్తున్నాడు. ఇక ప్రియాంక చోప్రా మందాకినిగా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ కుంభ పాత్రలో నటిస్తున్నారు. అనౌన్స్‌మెంట్ వీడియో సోషల్ మీడియాలో భారీ చర్చకు దారి తీయడంతో, రాజమౌళి ఎక్స్ లో అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. అయితే ఈ మూవీ టైటిల్ విషయంలో సమస్యలతోపాటు ఈవెంట్ లో దేవుడి విషయంలో తాను చేసిన కామెంట్స్ విషయంలోనూ రాజమౌళి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అయితే ఈ రెండు వివాదాలపై ఇప్పటి వరకూ అతడు స్పందించలేదు.