Modern Missamma Title Song: లాస్య అండ్ మిధున క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మోడ్రన్ మిస్సమ్మ’ ఫస్ట్ సింగిల్ ప్రసాద్ ల్యాబ్స్‌లో గ్రాండ్‌గా లాంచ్ అయింది. హర్ష నర్రా, తన్మయి ఖుషి జంటగా నటిస్తున్న ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ స్వరాలు సమకూర్చారు. ‘బెటర్ బీ ఏ మిస్సమ్మ’ అంటూ సాగే ఈ పాట విడుదలైన క్షణం నుంచే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.
‘బెటర్ బీ ఏ మిస్సమ్మ’.. అమ్మాయిలకు కనెక్ట్ అయ్యే హుక్ స్టెప్

హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన మోడ్రన్ మిస్సమ్మ ఫస్ట్ సింగిల్ రిలీజ్ వేడుకలో మూవీ టీమ్ ఈ సాంగ్ విడుదల చేసింది. కిట్టు విస్సాప్రగడ రాసిన ఈ పాటలో హీరో సంప్రదాయ పంచెకట్టులో కనిపిస్తే, హీరోయిన్ తన్మయి ట్రెడిషనల్ లుక్‌లో ఆకట్టుకుంది.
‘మన్మథుడు’ సినిమాలో నాగార్జున ‘వద్దురా సోదరా’ పాట మగవాళ్లకు ఎంతలా కనెక్ట్ అయిందో, ఈ పాట అమ్మాయిలకు అంతలా రీచ్ అవుతుందని హీరోయిన్ తన్మయి ధీమా వ్యక్తం చేసింది. పెళ్లి వద్దంటూ సరదాగా సాగే ఈ సాంగ్ లోకల్ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది.
ప్రొడ్యూసర్ కిశోర్ నాయుడు బిగ్ కాంప్లిమెంట్
ఈ ఈవెంట్‌కు గెస్ట్‌గా హాజరైన ‘వదలా’ చిత్ర నిర్మాత కిశోర్ నాయుడు మాట్లాడుతూ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఈ సినిమా ప్రీమియర్ షో నేను ఇప్పటికే చూశాను. సాధారణంగా నేను సినిమాలో పొరపాట్లు మాత్రమే వెతుకుతాను. కానీ ఇందులో చిన్న లోపం కూడా కనిపెట్టలేకపోయాను. డాక్టర్ భద్రమ్ క్యారెక్టర్ థియేటర్లలో నవ్వుల పూయించడం ఖాయం" అని కాంప్లిమెంట్ ఇచ్చారు.
"కష్టపడి కాదు.. ఇష్టపడి చేశాం": హీరో హర్ష నర్రా
గతంలో ‘మిస్సింగ్’, ‘రోటి కపడా రొమాన్స్’ సినిమాలతో ఆకట్టుకున్న హీరో హర్ష నర్రా ఈ ప్రాజెక్ట్‌పై ఎంతో నమ్మకంతో ఉన్నారు. "ఆ రెండు సినిమాలు కమర్షియల్‌గా ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా నా ప్రయత్నం మాత్రం ఆగదు. ఈ ప్రాజెక్ట్ మేమంతా ఫ్రెండ్స్‌లా చాలా ఇష్టపడి చేశాం. గోపీ సుందర్ గారు ఇచ్చిన మ్యూజిక్, కిట్టు గారి లిరిక్స్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి" అని చెప్పుకొచ్చారు.
‘మిస్సమ్మ’ టైటిల్ పెట్టడానికి ఎంతో ధైర్యం కావాలి: డైరెక్టర్
{{/usCountry}}గతంలో ‘మిస్సింగ్’, ‘రోటి కపడా రొమాన్స్’ సినిమాలతో ఆకట్టుకున్న హీరో హర్ష నర్రా ఈ ప్రాజెక్ట్‌పై ఎంతో నమ్మకంతో ఉన్నారు. "ఆ రెండు సినిమాలు కమర్షియల్‌గా ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా నా ప్రయత్నం మాత్రం ఆగదు. ఈ ప్రాజెక్ట్ మేమంతా ఫ్రెండ్స్‌లా చాలా ఇష్టపడి చేశాం. గోపీ సుందర్ గారు ఇచ్చిన మ్యూజిక్, కిట్టు గారి లిరిక్స్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి" అని చెప్పుకొచ్చారు.
‘మిస్సమ్మ’ టైటిల్ పెట్టడానికి ఎంతో ధైర్యం కావాలి: డైరెక్టర్
{{/usCountry}}డైరెక్టర్ సాయిబాబా మాట్లాడుతూ.. "ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు కదా.. దానికి 'సినిమా తీసి చూడు' అని కూడా యాడ్ చేయాలి, అంత కష్టం ఉంటుంది. గతంలో ఎన్టీఆర్ గారి 'మిస్సమ్మ', ఆ తర్వాత భూమిక గారి 'మిస్సమ్మ' క్లాసిక్స్‌గా నిలిచాయి. అంతటి ఐకానిక్ టైటిల్ వాడాలంటే ఎంతో ధైర్యం కావాలి. మా ఆర్టిస్టుల పర్‌ఫార్మెన్స్ చూశాకే ఈ టైటిల్ పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయ్యాం. మేము పెళ్లి వద్దని చెప్పడం లేదు, పెళ్లి చేసుకోవాలంటే ఏం కావాలో ఈ సినిమాలో చూపిస్తున్నాం" అని క్లారిటీ ఇచ్చారు.
'కాలింగ్ సహస్ర' తర్వాత సేఫ్ హ్యాండ్స్‌లో ప్రాజెక్ట్
లాస్య అండ్ మిధున క్రియేషన్స్ బ్యానర్‌లో చిరంజీవి పమిడి, శివ పమిడి, కిరణ్ కుమార్ నల్లూరి, స్రవంతి నంబూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'కాలింగ్ సహస్ర' తర్వాత అనుకున్న టైమ్‌కి, పక్కా బడ్జెట్‌తో ఔట్‌పుట్ తెప్పించడమే తమ మొదటి విజయమని ప్రొడ్యూసర్ చిరంజీవి పమిడి తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ప్రెజెంట్ ట్రెండ్‌కు తగ్గట్టుగా వచ్చి ప్రతి ఒక్కరినీ అలరిస్తుందని టీమ్ ధీమాగా ఉంది.