Modha Rathiri OTT: 'ధురంధర్' విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న వర్సటైల్ యాక్టర్ ఆర్ మాధవన్ (R Madhavan) రీసెంట్‌గా చూసిన ఒక చిన్న తమిళ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. రాజా కరుప్పసామి దర్శకత్వంలో తెరకెక్కిన 'మొద రాతిరి' (Modha Rathiri) మూవీ తనను ఎంతగానో ఆకట్టుకుందని, చాలా కాలం తర్వాత ఒక తమిళ సినిమా చూసి క్లాప్స్ కొడుతూ ఎంజాయ్ చేశానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
మాధవన్ పోస్ట్, మూవీ టీమ్ రియాక్షన్

ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మాధవన్ ఈ సినిమాపై ప్రత్యేక రివ్యూ పోస్ట్ చేశారు. "వాట్ ఏ బ్రిలియంట్ ఫిల్మ్.. చాలా రోజుల తర్వాత ఒక కోలీవుడ్ సినిమాను మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేశా. స్క్రీన్‌ప్లే, విజువల్ స్టోరీ టెల్లింగ్, నటీనటుల పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉన్నాయి" అని రాసుకొచ్చారు.
అంతేకాకుండా సినిమా చూస్తున్నంత సేపు గట్టిగా నవ్వుకున్నానని, పర్సనల్‌గా టీమ్ అందరికీ స్టాండింగ్ ఒవేషన్ ఇస్తున్నానని చెప్పారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది అని క్యాప్షన్ ఇచ్చారు. మాధవన్ నుంచి వచ్చిన ఈ ఊహించని కాంప్లిమెంట్‌కి చిత్ర దర్శకుడు రాజా, హీరోయిన్ అనిష్మ అనిల్‌కుమార్ థ్యాంక్స్ చెబుతూ కామెంట్స్ చేశారు.
అసలు కథేంటి? నెట్‌ఫ్లిక్స్‌లో రెస్పాన్స్ ఎలా ఉందంటే?
ఈ ఏడాది ఆగస్టు 21న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది. రిషికాంత్, అనిష్మ అనిల్‌కుమార్ లీడ్ రోల్స్ చేసిన ఈ మూవీలో షెల్లీ కిషోర్, చేతన్, భగవతి పెరుమాళ్ కీలక పాత్రల్లో నటించారు.
విచిత్రమైన పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్న ఒక జంట, తమ శోభనం రాత్రి అనూహ్యంగా మిస్ అవుతారు. దాంతో రెండు కుటుంబాల మధ్య మొదలైన గొడవలు, బయటపడే రహస్యాలు, ఆ గందరగోళం మధ్యలోనే ఆ జంట ఒకరినొకరు అర్థం చేసుకునే విధానం చాలా ఫన్నీగా, ఎమోషనల్‌గా సాగుతుంది. థియేటర్లలో మంచి రివ్యూస్ తెచ్చుకుని రూ. 8.73 కోట్ల గ్రాస్ సాధించిన ఈ చిన్న సినిమా, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో మంచి వ్యూయర్‌షిప్‌తో ట్రెండ్ అవుతోంది.
రూ. 3000 కోట్ల కలెక్షన్లు.. మాధవన్ నెక్స్ట్
ఆర్ మాధవన్ రీసెంట్‌గా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన 'ధురంధర్', 'ధురంధర్: ది రివేంజ్' సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర హిస్టరీ క్రియేట్ చేశారు. ఈ రెండు భాగాలు కలిసి ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 3000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించాయి. ఇందులో ఐబీ చీఫ్ అజయ్ సన్యాల్ పాత్రలో మాధవన్ నటనకు నార్త్, సౌత్ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు.
{{/usCountry}}ఆర్ మాధవన్ రీసెంట్‌గా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన 'ధురంధర్', 'ధురంధర్: ది రివేంజ్' సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర హిస్టరీ క్రియేట్ చేశారు. ఈ రెండు భాగాలు కలిసి ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 3000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించాయి. ఇందులో ఐబీ చీఫ్ అజయ్ సన్యాల్ పాత్రలో మాధవన్ నటనకు నార్త్, సౌత్ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు.
{{/usCountry}}అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త జీడీ నాయుడు బయోపిక్ 'జీడీఎన్' (GDN) చిత్రంలో నటించి, నిర్మాతగా కూడా వ్యవహరించారు. ప్రస్తుతం తమిళంలో 'అదృష్టశాలి', బైలింగువల్ మూవీ 'సర్కిల్' సినిమాల్లో నటిస్తున్నారు. వీటితో పాటు దుబాయ్‌లో ప్రసారమయ్యే 'గేమ్ చేంజర్స్' షోతో పాటు ZEE5 లో 'జీనా ఇసీ కా నామ్ హై 2.0' షోకి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.