Mohan Babu: టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు స్టేజ్ ఎక్కారంటే అక్కడ పంచ్‌లు, సెటైర్లు గ్యారెంటీ. తాజాగా జరిగిన 'డైరెక్టర్స్ డే' వేడుకల్లో ఆయన మరోసారి తనదైన వాక్చాతుర్యంతో అందరినీ నవ్వించారు. సీనియర్ నటీమణులు జయసుధ, జయప్రదలతో తనకున్న సుదీర్ఘ అనుబంధం గురించి చెబుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.
జయప్రద అలా కాదు

ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని చిత్ర పరిశ్రమ ప్రతి ఏటా డైరెక్టర్స్ డే నిర్వహిస్తోంది. ఈ వేడుకకు హాజరైన మోహన్ బాబు.. జయసుధ, జయప్రద పక్కపక్కనే కూర్చుని ఉండటం చూసి స్టేజ్ మీద నుంచే సరదాగా స్పందించారు.
"జయసుధ నాకు ఎప్పుడూ ఒక సహోదరి లాంటిది. ఆమెతో నాకు అద్భుతమైన అనుబంధం ఉంది. కానీ జయప్రద విషయంలో మాత్రం నేను అలా చెప్పలేను. ఆమె నాకు సోదరి కాదు" అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు. దీంతో జయప్రద కూడా ఏయ్ అంటూ ఏదో అనబోయారు.
ఆ రాత్రి ఈ అమ్మాయిని లాక్కెళ్లిపోవాలి..
ఈ సందర్భంగా జయప్రదతో ఓ సినిమా షూటింగ్ సందర్భంగా జరిగిన ఘటనను గుర్త చేసుకున్నారు. “ఆ రోజు రాత్రి షూటింగ్.. 4 గంటలు అవుతోంది.. ఉదయం 7 గంటలకు మొదలుపెట్టారు. అప్పుడు ఈ అమ్మాయిని నేను లాక్కెళ్లిపోవాలి. కృష్ణంరాజు గారు హీరో. అల్లు రామలింగయ్య గారు నా దగ్గరికి వచ్చి ఈ అమ్మాయిని ఎలా లాక్కెళ్తారు అని అడిగారు. దానికి దారి గురించి దాసరిగారు రాసిన డైలాగ్ ఇప్పటికీ నాకు గుర్తుంది” అంటూ మోహన్ బాబు ఆ డైలాగు చెప్పారు.
మోహన్ బాబు ఈ మాట అనగానే పక్కనే ఉన్న జయప్రద, జయసుధతో పాటు హాల్లోని వారంతా ఒక్కసారిగా నవ్వు ఆపుకోలేకపోయారు. గతంలో మోహన్ బాబు, జయప్రద కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా వీరిద్దరి కెమిస్ట్రీ వెండితెరపై బాగా పండేది. ఆ చనువుతోనే ఆయన ఇలాంటి ఫన్నీ కామెంట్స్ చేశారని అందరికీ అర్థమైంది.
ఇది సెల్ఫ్ డబ్బా కాదు..
{{/usCountry}}మోహన్ బాబు ఈ మాట అనగానే పక్కనే ఉన్న జయప్రద, జయసుధతో పాటు హాల్లోని వారంతా ఒక్కసారిగా నవ్వు ఆపుకోలేకపోయారు. గతంలో మోహన్ బాబు, జయప్రద కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా వీరిద్దరి కెమిస్ట్రీ వెండితెరపై బాగా పండేది. ఆ చనువుతోనే ఆయన ఇలాంటి ఫన్నీ కామెంట్స్ చేశారని అందరికీ అర్థమైంది.
ఇది సెల్ఫ్ డబ్బా కాదు..
{{/usCountry}}ఇక దాసరి గురించి చెబుతూ.. ఆ కాలంలోనే తాము 550 మంది కూర్చొనేందుకు వీలుగా ఓ ఆడిటోరియం కట్టామని, ఇది సెల్ఫ్ డబ్బా కాదు అని మోహన్ బాబు అన్నారు.
"మా గురువుగారు దాసరి నారాయణరావు గారు మమ్మల్ని ఎంతో క్రమశిక్షణతో పెంచారు. షూటింగ్ సమయంలో ఆయన ముందు మేమంతా చాలా పద్ధతిగా ఉండేవాళ్లం. ఇవాళ ఇక్కడ ఇంతమంది దర్శకులను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది" అని మోహన్ బాబు పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. కేవలం కామెడీ మాత్రమే కాకుండా, చిత్ర పరిశ్రమలో దర్శకుడి ప్రాధాన్యత గురించి కూడా ఆయన మాట్లాడారు.
ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. మోహన్ బాబు టైమింగ్ అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఒకప్పుడు వెండితెరను ఏలిన ఈ అగ్ర తారలంతా ఒకే వేదికపై కనిపించడం అటు అభిమానులకు, ఇటు పరిశ్రమ వర్గాలకు కనువిందుగా నిలిచింది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న: మోహన్ బాబు జయప్రదపై వ్యాఖ్యలు ఎక్కడ చేశారు?
జవాబు: హైదరాబాద్‌లో జరిగిన డైరెక్టర్స్ డే వేడుకల్లో మోహన్ బాబు ఈ సరదా వ్యాఖ్యలు చేశారు.
ప్రశ్న: మోహన్ బాబు ఎవరి గురించి మాట్లాడారు?
జవాబు: సీనియర్ నటీమణులు జయసుధ, జయప్రద గురించి ఆయన మాట్లాడారు.
ప్రశ్న: డైరెక్టర్స్ డే ఎప్పుడు నిర్వహిస్తారు?
జవాబు: దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా మే 4వ తేదీన డైరెక్టర్స్ డే నిర్వహిస్తారు.