Operation Ganga: టాలెంటెడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ఫామ్ అందుకుంది. లెనిన్ మూవీతో సక్సెస్ బాట పట్టిన ఈ భామ.. ఇప్పుడు మలయాళంలో అడుగుపెట్టింది. స్టార్ హీరో మోహన్ లాల్ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తోంది భాగ్యశ్రీ. ఇవాళ (సెప్టెంబర్ 5) ఆ మూవీ టైటిల్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు.
ఆపరేషన్ గంగా

మలయాళ సీనియర్ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ (Mohanlal) హీరోగా మరో కొత్త మూవీతో థియేటర్లకు రాబోతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత, ‘మెప్పాడియాన్’ ఫేమ్ దర్శకుడు విష్ణు మోహన్ తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ల్యాండ్‌మార్క్ సినిమా టైటిల్ ను శనివారం అనౌన్స్ చేశారు. ఈ భారీ పాన్ ఇండియా మూవీకి ‘ఆపరేషన్ గంగా’ (Operation Ganga) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పెట్టారు.
ఆ యుద్ధం నేపథ్యంలో
మోహన్‌లాల్ కొత్త మూవీ టైటిల్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆపరేషన్ గంగా అనే పేరుకు 'A Nation's Promise' అనేది ట్యాగ్‌లైన్. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల కోసం నిర్వహించిన ఆపరేషన్ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది.
2022లో రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైనప్పుడు, బాంబుల వర్షం మధ్య ఉక్రెయిన్ సరిహద్దుల్లో వేలాదిమంది భారతీయ విద్యార్థులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని చిక్కుకుపోయారు. వాళ్లను తిరిగి ఇండియాకు తీసుకురావడానికి భారత్ చేపట్టిన మిషనే ‘ఆపరేషన్ గంగా’.
పవర్ ఫుల్ గా
'A Nation's Promise' అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం, అంతర్జాతీయ సరిహద్దుల్లో ఎదురైన దౌత్యపరమైన, సైనిక, మానవ సవాళ్లను విజువల్ వండర్‌గా ఆవిష్కరించనుంది. మోహన్‌లాల్ ఈ మిషన్‌ను ముందుండి నడిపించే ఒక పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనున్నారు.
భాగ్యశ్రీ బోర్సే మాలీవుడ్ ఎంట్రీ!
మోహన్‌లాల్ తో పాటు ఈ ఆపరేషన్ గంగా సినిమాలో బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ అర్జున్ రాంపాల్, సీనియర్ నటుడు పార్థిబన్, వర్సటైల్ యాక్టర్ ఆదిల్ హుస్సేన్ అత్యంత కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
{{/usCountry}}మోహన్‌లాల్ తో పాటు ఈ ఆపరేషన్ గంగా సినిమాలో బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ అర్జున్ రాంపాల్, సీనియర్ నటుడు పార్థిబన్, వర్సటైల్ యాక్టర్ ఆదిల్ హుస్సేన్ అత్యంత కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
{{/usCountry}}ఇటీవల ‘లెనిన్’ తో హిట్ అందుకున్న హాట్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) ఈ చిత్రంతో మలయాళ చిత్ర పరిశ్రమలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తోంది. మోహన్‌లాల్ వంటి దిగ్గజ నటుడి పక్కన భాగ్యశ్రీకి అవకాశం దక్కడం ఆమె కెరీర్‌లో మైలురాయిగా మారనుంది.
భారీ ఓపెనింగ్స్
మలయాళ సినిమాలు నేచురల్ గా ఉంటాయనేది టాక్. ఈ 'ఆపరేషన్ గంగా' ద్వారా శ్రీ గోకులం మూవీస్ బిగ్ బడ్జెట్ విజువల్ క్యాన్వాస్‌ను ఆవిష్కరిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ వార్ అంశం వరల్డ్ వైడ్ గా పాపులర్. ఈ నేపథ్యంలో మలయాళంలోనే కాకుండా హిందీ, తెలుగు, తమిళ భాషలలో ఆపరేషన్ గంగా భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉంది.