...
...
Next Story

థియేటర్లలోకి మోస్ట్ అవైటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్-దృశ్యం 3 రిలీజ్ డేట్ ఇదే-హిందీ కంటే ముందే మోహన్ లాల్ మలయాళం మూవీ

ఇది కదా సస్పెన్స్ థ్రిల్లర్ అనిపించే సినిమా దృశ్యం. ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఫ్రాంఛైజీలో దృశ్యం 2 కూడా వచ్చి అదరగొట్టింది. ఇప్పుడు దృశ్యం 3 రాబోతుంది. మోహన్ లాల్ హీరోగా నటిస్తున్న ఈ మలయాళ మూవీ రిలీజ్ డేట్ ను ఇవాళ అనౌన్స్ చేశారు. హిందీలో అజయ్ దేవగణ్ దృశ్యం 3 కంటే ముందు మలయాళ మూవీ రిలీజ్ కానుంది.

Published on: Jan 14, 2026, 20:21:31 IST
Advertisement

జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్ నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ 'దృశ్యం 3' విడుదల తేదీని అధికారికంగా బుధవారం (జనవరి 14) ప్రకటించారు. టీవీ కేబుల్ ఆపరేటర్ జార్జ్‌కుట్టి పాత్రలో మోహన్ లాల్ నటించిన ఈ హిట్ ఫ్రాంచైజీలో మూడో సినిమా వస్తున్నట్లు ఈ స్టార్ హీరో ఒక వీడియోను పోస్ట్ చేశారు. హిందీ వెర్షన్ కంటే కొన్ని నెలల ముందే మలయాల వర్షన్ థియేటర్లలోకి రానుంది.

దృశ్యం 3 రిలీజ్ డేట్

మోహన్ లాల్
మోహన్ లాల్

మోహన్ లాల్ 'దృశ్యం 3' విడుదల తేదీని ప్రకటిస్తూ.. ‘‘సంవత్సరాలు గడిచాయి. గతం మారలేదు. దృశ్యం 3 ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 2, 2026న రిలీజ్ అవుతుంది’’ అని రాసుకొచ్చారు. ఆయన పోస్ట్ చేసిన వీడియోలో పాతకాలపు టీవీ సెట్, పార, మునిగిపోయిన కారు, సెల్ ఫోన్, పసుపు రంగు బ్యాగ్, సీసీటీవీ కెమెరా, స్క్రిప్ట్ లాంటివి ఉన్నాయి. ఇవన్నీ మొదటి రెండు సినిమాల్లోని కీలక అంశాలుగా కనిపిస్తున్నాయి.

రహస్యం తిరిగి

‘‘ప్రతి రహస్యానికి ఒక తిరిగి వచ్చే తేదీ ఉంటుంది. ఏప్రిల్ 2, 2026 - అప్పుడు నిజం బయటపడుతుంది’’ అని సినిమా అధికారిక సోషల్ మీడియా పేజీ పోస్టర్‌ను విడుదల చేస్తూ రాసింది.

దృశ్యం 3 గురించి

దృశ్యం 3కి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. ఆశీర్వాద్ సినిమాస్ నుండి ఆంటోనీ పెరుంబావూర్ నిర్మించారు. పెన్ స్టూడియోస్, పనోరమా స్టూడియోస్ నుండి జయంతిలాల్ గడ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. పోలీసుల నుండి ఒక చీకటి రహస్యాన్ని దాచడానికి జార్జ్‌కుట్టి పడే కష్టాలను చూపించే హిట్ ఫ్రాంచైజీలో ఇది మూడవ భాగం.

హిందీ వర్షన్

గత ఏడాది డిసెంబర్‌లో 'దృశ్యం 3' హిందీ వెర్షన్ అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలవుతుందని ప్రకటించారు. అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అజయ్ దేవగణ్, శ్రియా సరన్, టబు తదితరులు నటిస్తున్నారు. హిందీ వెర్షన్ కోసం విడుదల చేసిన ప్రకటన వీడియోలో మొదటి చిత్రంలోని సంఘటనలు జరిగి ఏడేళ్లు గడిచిందని సూచించారు. ఇప్పుడు హిందీ వర్షన్ కంటే ముందే మలయాళ దృశ్యం 3 రిలీజ్ అవుతుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks