...
...
Next Story

Mohanlal: సినీ చరిత్రలో అద్భుతం.. దర్శకుడి తొలి, 100వ సినిమాలో ఒకే హీరో.. మోహన్ లాల్-ప్రియదర్శన్ అరుదైన రికార్డ్!

Mohanlal-Priyadarshan: సినీ చరిత్రలోనే ఇదో అద్భుతం అని చెప్పొచ్చు. ఆ డైరెక్టర్ తొలి సినిమాలో హీరోగా చేసిన సూపర్ స్టార్ మళ్లీ వందో సినిమాలో కూడా యాక్ట్ చేయబోతున్నాడు. మలయాళ సినీ దిగ్గజాలు మోహన్ లాల్, దర్శకుడు ప్రియదర్శన్ ఈ అరుదైన రికార్డు నెలకొల్పనున్నారు.

Published on: Mar 22, 2026, 17:43:46 IST
Advertisement

భారతీయ సినీ చరిత్రలో ఒక అరుదైన క్షణం ఆవిష్కృతం కాబోతోంది. మలయాళ సినీ దిగ్గజం మోహన్ లాల్, ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కలిసి హిస్టరీ క్రియేట్ చేయబోతున్నారు. డైరెక్టర్ గా ప్రియదర్శన్ 100వ సినిమలో మోహన్ లాల్ హీరో. దశాబ్దాల కాలంగా వీరిద్దరి కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తూనే ఉంది.

100వ సినిమా

ప్రియదర్శన్, మోహన్ లాల్ (instagram)
ప్రియదర్శన్, మోహన్ లాల్ (instagram)

సాధారణంగా ఒక దర్శకుడి మొదటి సినిమాలో నటించిన హీరోనే, అతని 100వ సినిమాలో కూడా నటించడం అనేది భారతీయ సినిమాలో చాలా అరుదు. ప్రియదర్శన్ దర్శకుడిగా పరిచయమైన మొదటి చిత్రంలో మోహన్ లాల్ కథానాయకుడు. ఇప్పుడు అదే కాంబినేషన్ 100వ మైలురాయిని చేరుకోవడం ఒక రికార్డుగా నిలిచిపోనుంది.

1984లో డైరెక్టర్ గా ప్రియదర్శన్ ఫస్ట్ మూవీ రిలీజ్ అయింది. దీని పేరు ‘పూచక్కోరు ముక్కూతి’. ఇందులో మోహన్ లాల్ హీరో.

మ్యూజికల్ మ్యాజిక్!

ప్రియదర్శన్, మోహన్ లాల్ అనగానే మనకు వెంటనే వారి అద్భుతమైన కామెడీ టైమింగ్ గుర్తుకు వస్తుంది. అయితే ఈ 100వ చిత్రం కామెడీ కాదని, ఒక ప్యూర్ మ్యూజికల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుందని సమాచారం. ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోనీ పెరుంబవూర్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మోహన్ లాల్ పోస్ట్ వైరల్

ఈ అరుదైన మైలురాయిపై మోహన్ లాల్ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. "వంద సినిమాలు అనేది కేవలం ఒక సంఖ్య కాదు, ఇది అంకితభావంతో కూడిన ఒక జీవితకాల ప్రయాణం" అని పేర్కొన్నారు. తన ప్రియ మిత్రుడు ప్రియదర్శన్ ప్రయాణంలో తాను భాగమైనందుకు గర్వంగా ఉందని రాశారు.

కొత్త అనుభూతి

గత కొన్ని దశాబ్దాలుగా మోహన్ లాల్- ప్రియదర్శన్ ద్వయం 'బోయింగ్ బోయింగ్', 'కాలా పాని', 'ఒప్పం' వంటి ఎన్నో ఆల్‌టైమ్ క్లాసిక్ సినిమాలను అందించింది. కేవలం మలయాళంలోనే కాకుండా సౌత్ ఇండియా మొత్తం వీరి సినిమాలకు పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు ఈ ప్రియదర్శన్ 100వ సినిమా క్రేజీ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks