ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో 'రుద్రాక్ష మాల' అమ్ముతూ ఓవర్‌నైట్ సెలబ్రిటీగా మారిన మోనాలిసా భోంస్లే (మొని) పెళ్లి వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. తన కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించిన ఆమె.. బుధవారం (మార్చి 11) సాయంత్రం కేరళలోని పూవార్ సమీపంలో ఉన్న అరుమనూర్ నయనార్ ఆలయంలో తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ను వివాహం చేసుకుంది. గురువారం మీడియాతో మాట్లాడింది.
ఇదేమీ లవ్ జిహాద్ కాదు

ఈ జంట మతాలు వేరు కావడంతో 'లవ్ జిహాద్' అంటూ వస్తున్న విమర్శలపై మోనాలిసా స్పష్టతనిచ్చింది. "నేను అన్ని మతాలను గౌరవిస్తాను. మాది లవ్ జిహాద్ కాదు. హిందూ సంప్రదాయాల ప్రకారమే మేము వివాహం చేసుకున్నాం. నన్ను ఇస్లాం మతంలోకి మారమని ఫర్మాన్ ఎప్పుడూ అడగలేదు" అని ఆమె స్పష్టం చేసింది.
తమ వయసు గురించి వస్తున్న సందేహాలకు చెక్ పెడుతూ.. 2008లో పుట్టినట్లు ఉన్న తన బర్త్ సర్టిఫికేట్‌ను ప్రెస్ మీట్‌లో చూపించింది. తద్వారా తాను మేజర్ అని, తన నిర్ణయాలు తాను తీసుకునే హక్కు ఉందని నిరూపించుకుంది.
ఎవరీ ఫర్మాన్ ఖాన్?
ఫర్మాన్ ఖాన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాగ్‌పత్ జిల్లాకు చెందిన వ్యక్తి. అతడు వృత్తిరీత్యా నటుడు, మోడల్. మోనాలిసాతో కలిసి ఒక మూవీలో నటిస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.
వీరిద్దరూ తొలుత సోషల్ మీడియా ద్వారా స్నేహితులయ్యారు. ఆ తర్వాత ఒక సినిమా షూటింగ్ సెట్‌లో నేరుగా కలుసుకున్నారు. తమ బంధం గురించి ఫర్మాన్ మాట్లాడుతూ.. "మేము ఆరు నెలలుగా డేటింగ్‌లో ఉన్నాం. కానీ ఆ ఆరు నెలలు మాకు అరవై ఏళ్ల ప్రేమలా అనిపించింది. అందుకే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం" అని తెలిపాడు.
ప్రపోజ్ చేసింది మోనాలిసానేనట. ఈ విషయాన్ని మోనాలిసానే వెల్లడించింది. "నేను ప్రపోజ్ చేసినప్పుడు ఫర్మాన్ మొదట నిరాకరించాడు. కానీ నా ప్రేమతో అతడిని ఒప్పించాను" అని ఆమె సరదాగా చెప్పుకొచ్చింది.
కేరళలో ఆశ్రయం.. పెళ్లి
{{/usCountry}}ప్రపోజ్ చేసింది మోనాలిసానేనట. ఈ విషయాన్ని మోనాలిసానే వెల్లడించింది. "నేను ప్రపోజ్ చేసినప్పుడు ఫర్మాన్ మొదట నిరాకరించాడు. కానీ నా ప్రేమతో అతడిని ఒప్పించాను" అని ఆమె సరదాగా చెప్పుకొచ్చింది.
కేరళలో ఆశ్రయం.. పెళ్లి
{{/usCountry}}తన తండ్రి జైసింగ్ భోంస్లే తనను బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని మోనాలిసా పోలీసులను ఆశ్రయించింది. తన మేనత్త కుమారుడితో పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కేరళ ప్రభుత్వం, పోలీసులు మద్దతు ఇవ్వడంతో వీరి వివాహం సజావుగా సాగింది.
ఈ వివాహ వేడుకకు కేరళ విద్యాశాఖ మంత్రి వి. శివన్‌కుట్టి, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. కేరళ రాష్ట్రం కులమతాలకు అతీతంగా మనుషులను ఆదరిస్తుందని, భవిష్యత్తులో దక్షిణాది సినిమాల్లో నటిస్తూ ఇక్కడే స్థిరపడాలని ఉందని మోనాలిసా తన మనసులోని మాటను బయటపెట్టింది.