ఈ ఏడాది ఎక్కువ మంది సెర్చ్ చేసిన సినిమాలు ఇవే.. లిస్టులో ఓ డిజాస్టర్ తెలుగు మూవీ

ఈ ఏడాది ఎక్కువ మంది సెర్చ్ చేసిన సినిమాల జాబితాను గూగుల్ రిలీజ్ చేసింది. ఇందులో హిందీ మూవీ సయ్యారా తొలి స్థానంలో ఉండగా.. తెలుగు డిజాస్టర్ సినిమా గేమ్ ఛేంజర్ కూడా 8వ స్థానంలో ఉండటం విశేషం.

Published on: Dec 4, 2025, 21:59:21 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గూగుల్ 'ఇయర్ ఇన్ సెర్చ్ 2025' రిపోర్టు వచ్చేసింది. ఇది కేవలం సినిమాల జాబితా మాత్రమే కాదు మారుతున్న ఇండియన్ ఆడియెన్స్ అభిరుచులకు అద్దం పడుతోంది. వీటిలో హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సినిమాలు చోటు దక్కించుకున్నాయి. టాప్ 10లో ఉన్న మూవీస్ ఏవో చూడండి.

ఈ ఏడాది ఎక్కువ మంది సెర్చ్ చేసిన సినిమాలు ఇవే.. లిస్టులో ఓ డిజాస్టర్ తెలుగు మూవీ
ఈ ఏడాది ఎక్కువ మంది సెర్చ్ చేసిన సినిమాలు ఇవే.. లిస్టులో ఓ డిజాస్టర్ తెలుగు మూవీ

1. సయ్యారా

యాక్షన్ థ్రిల్లర్ల హోరులో బాలీవుడ్ రొమాన్స్ కొన్నాళ్లుగా మరుగున పడింది. ప్రేక్షకులు కోరుకుంటున్న ఆ లోటును 'సయ్యారా' తీర్చింది. అందుకే ఇది చార్టుల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఇందులోని 'సయ్యారా' పాట, అద్భుతమైన సౌండ్‌ట్రాక్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాయి. ఈ లిరిక్స్, వీడియోల కోసం జనం గూగుల్‌లో విపరీతంగా వెతికారు. కొత్త జంట అనీత్ పడ్డా, అహాన్ పాండేలను సినిమా రిలీజ్ వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉంచడం అనే యష్ రాజ్ ఫిల్మ్స్ వినూత్న వ్యూహం ఫలించింది. వారి గురించి తెలుసుకోవాలనే కుతూహలమే సెర్చ్ వాల్యూమ్‌ను పెంచింది.

2. కాంతార: ఎ లెజెండ్ చాప్టర్ 1

2022లో సంచలనం సృష్టించిన 'కాంతార'కు ప్రీక్వెల్ కావడంతో దీనిపై అంచనాలు ఆకాశన్నంటాయి. క్రీ.శ. 300 నాటి దైవ ఆరాధన సంప్రదాయం, లోతైన జానపద కథలను ఇందులో చూపించనుండటం పాన్-ఇండియా ప్రేక్షకులను కట్టిపడేసింది. తొలి సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో సహజంగానే ఈ ప్రీక్వెల్ గురించి ప్రేక్షకుల బాగా సెర్చ్ చేశారు. దీంతో ఇది రెండో స్థానంలో నిలిచింది.

3. కూలీ

ఈ సినిమా విజయం పూర్తిగా దర్శకుడు, సూపర్ స్టార్ కాంబినేషన్ క్రేజ్ పైనే ఆధారపడింది. లెజెండరీ స్టార్ రజనీకాంత్, మోడ్రన్ యాక్షన్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కలయికే ఒక సంచలనం. దీంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ బాగా వెతికారు. నిజానికి మూవీ అంతగా ఆకట్టుకోకపోయినా.. సెర్చ్ లో మాత్రం బాగా దూసుకెళ్లి మూడో స్థానంలో నిలిచింది.

4. వార్ 2

వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా వచ్చిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ ఐకాన్ జూనియర్ ఎన్టీఆర్ తలపడటంతో దీనిపై ఎక్కడ లేని ఆసక్తి నెలకొంది. ఇదే మూవీ సెర్చ్ వాల్యూమ్‌ పెరగడానికి ప్రధాన కారణం. ఇద్దరు సూపర్ స్టార్ల మెగా క్లాష్ కావడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ నడిచాయి. కథ ఎలా ఉండబోతోంది? ట్రైలర్ ఎప్పుడు? బాక్సాఫీస్ రికార్డులు ఏంటి? అనే అంశాలపై అంతులేని చర్చ జరిగింది.

5. సనమ్ తేరీ కసమ్

2016 నాటి ఈ సినిమా ఈ జాబితాలో ఉండటం అనూహ్యం. జెన్-జీ ఆడియన్స్ ఈ విషాద ప్రేమకథకు, ఇందులోని పాటలకు కల్ట్ ఫ్యాన్స్‌గా మారడంతో రీ-రిలీజ్ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. వాలెంటైన్స్ వీక్‌లో రీ-రిలీజ్ అయినప్పుడు, ఇది తన ఒరిజినల్ కలెక్షన్స్ కంటే ఎక్కువ వసూలు చేసి ఆశ్చర్యపరిచింది. ప్రేక్షకుల కనెక్షన్ ఎంత బలంగా ఉంటుందో ఇది నిరూపించింది.

6. మార్కో

మలయాళ సినిమా నుంచి వచ్చిన ఈ డార్క్, స్టైలిష్ నియో-నాయిర్ యాక్షన్ థ్రిల్లర్ దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఉన్ని ముకుందన్ యాంటీ-హీరోగా నటించిన ఈ మూవీ.. రొటీన్ హిందీ సినిమాలకు భిన్నమైన అనుభూతిని పంచింది. ఆ స్టైల్, క్రిమినల్ అండర్ వరల్డ్ కథనం గురించి తెలుసుకోవడానికి సినీ ప్రియులు ఆసక్తి చూపారు.

7. హౌస్‌ఫుల్ 5

ఈ కామెడీ ఫ్రాంచైజీకి ఉన్న బ్రాండ్ ఇమేజ్ దీనికి ప్లస్ అయ్యింది. అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్ వంటి భారీ తారాగణం తిరిగి వస్తుండటంతో ప్రేక్షకులు దీని గురించి వెతికారు. కేవలం నవ్వుకునే, వినోదభరితమైన కమర్షియల్ సినిమాల కోసం జనం ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని ఇది నిరూపించింది.

8. గేమ్ ఛేంజర్

విజువల్ వండర్స్ సృష్టించే దర్శకుడు శంకర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ కావడంతో దీనిపై భారీ హైప్ క్రియేట్ అయింది. శంకర్ నేరుగా తెలుగులో చేస్తున్న సినిమా కావడంతో మేకింగ్ స్కేల్, లీకైన ఫుటేజ్, కథ, శంకర్ టేకింగ్ గురించి తెలుసుకోవడానికి అభిమానులు గూగుల్‌ను ఆశ్రయించారు.

9. మిసెస్

మలయాళ హిట్ ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’కు హిందీ రీమేక్ ఇది. గృహిణుల కష్టాలు, గుర్తింపు లేని వారి పని, ఐడెంటిటీ క్రైసిస్ వంటి సామాజిక అంశాలను చర్చించడంతో ఆన్‌లైన్‌లో దీనిపై పెద్ద చర్చ జరిగింది. సాన్యా మల్హోత్రా నటన, బలమైన మహిళా ప్రధాన ఇతివృత్తం కావడంతో నెటిజన్లు దీని గురించి ఆరా తీశారు.

10. మహావతార్ నరసింహ

ఇండియాలో మంచి యానిమేషన్ సినిమాలు రావనే అపోహను ఈ సినిమా చెరిపేసింది. అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ యానిమేటెడ్ చిత్రంగా రికార్డు సృష్టించింది. దశావతారాల చుట్టూ తిరిగే పురాణ గాథ, అద్భుతమైన విజువల్స్ ప్రేక్షకులను మెప్పించాయి. కొత్తగా ప్రకటించిన 'మహావతార్ సినిమాటిక్ యూనివర్స్' సీక్వెల్స్ గురించి తెలుసుకోవడానికి జనం ఆసక్తి చూపారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More