ఓటీటీలో గత వారం అంటే డిసెంబర్ 15 నుంచి 21 మధ్య ఎక్కువ వ్యూస్ సంపాదించిన టాప్ 5 సినిమాలు, టాప్ 5 వెబ్ సిరీస్ జాబితాను ఆర్మాక్స్ మీడియా సోమవారం (డిసెంబర్ 22) రిలీజ్ చేసింది. ఇందులో రష్మిక మందన్న నటించిన సినిమాలే టాప్ లో ఉండటం విశేషం.
ఓటీటీలో టాప్ 5 మూవీస్ ఇవే

ఓటీటీలో ప్రస్తుతం రష్మిక మందన్న నటించిన రెండు సినిమాలు దుమ్ము రేపుతున్నాయి. వాటిలో ఒకటి హారర్ కామెడీ మూవీ థామా కాగా.. మరొకటి ది గర్ల్‌ఫ్రెండ్. ఆర్మాక్స్ మీడియా ఈ జాబితాను రిలీజ్ చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న థామా (Thamma) మూవీ 3.1 మిలియన్ వ్యూస్ సాధించడం విశేషం.
ఇక రెండో స్థానంలోనూ రష్మిక సినిమానే ఉంది. నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ 2.3 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇక మూడో స్థానంలో దుల్కర్ సల్మాన్ నటించిన కాంత ఉంది. ఈ సినిమా కూడా నెట్‌ఫ్లిక్స్ లోనే ఉండగా.. దీనికి 1.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
నాలుగో స్థానంలో హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్ ఉంది. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు గత వారం 1.3 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఐదో స్థానంలో నెట్‌ఫ్లిక్స్ లోకి తాజాగా వచ్చిన రాత్ అకేలీ హై: ది బన్సల్ మర్డర్స్ ఉంది. ఈ సినిమాకు 1.2 మిలియన్ వ్యూస్ రావడం విశేషం.
ఓటీటీలో టాప్ 5 వెబ్ సిరీస్ ఇవే
ఇక ఓటీటీలో డిసెంబర్ 15 నుంచి 21 మధ్య ఎక్కువ వ్యూస్ సాధించిన టాప్ 5 వెబ్ సిరీస్ లిస్టు కూడా వచ్చింది. ఇందులో మాధురి దీక్షిత్ నటించిన మిసెస్ దేశ్‌పాండే టాప్ లో ఉంది. జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ కు 3.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
{{/usCountry}}ఇక ఓటీటీలో డిసెంబర్ 15 నుంచి 21 మధ్య ఎక్కువ వ్యూస్ సాధించిన టాప్ 5 వెబ్ సిరీస్ లిస్టు కూడా వచ్చింది. ఇందులో మాధురి దీక్షిత్ నటించిన మిసెస్ దేశ్‌పాండే టాప్ లో ఉంది. జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ కు 3.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
{{/usCountry}}నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 రెండో స్థానంలో ఉంది. ఇది 2.2 మిలియన్ వ్యూస్ సాధించింది. ప్రైమ్ వీడియోలో ఉన్న క్రైమ్ థ్రిల్లర్ ది ఫ్యామిలి మ్యాన్ సీజన్ 3 మూడో స్థానంలో ఉండగా.. దీనికి 2.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
నెట్‌ఫ్లిక్స్ లోని కామెడీ డ్రామా సిరీస్ సింగిల్ పాపా కూడా మంచి రెస్పాన్స్ సంపాదిస్తోంది. దీనికి 1.5 మిలియన్ వ్యూస్ రాగా.. నాలుగో స్థానంలో ఉంది. ఇక అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ లోని భయ్: ది గౌరవ్ తివారీ మిస్టరీ వెబ్ సిరీస్ 1.4 మిలియన్ వ్యూస్ తో ఐదో స్థానంలో ఉంది.