భారీ ఆశలతో, ఎంతో హైప్ తో థియేటర్లకు వచ్చిన ‘ది రాజాసాబ్’ మూవీ ఫుల్ డిసప్పాయింట్ చేసిన సంగతి తెలిసిందే. సంక్రాంతి 2026 సందర్భంగా థియేటర్లలో రిలీజైన ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. కానీ ఓటీటీలో మాత్రం ఈ ప్రభాస్ సినిమా దుమ్మురేపుతోంది. మార్చి 9 నుంచి మార్చి 15 వరకు ఓటీటీలో అత్యధిక మంది చూసిన టాప్-10 లిస్ట్ లో రాజా సాబ్ నిలిచింది.
ది రాజాసాబ్ ఓటీటీ

ప్రభాస్ హీరోగా నటించిన హారర్ ఫాంటసీ థ్రిల్లర్ ‘ది రాజాసాబ్’. ప్రభాస్ ఇలాంటి జోనర్ లో చేసిన ఫస్ట్ మూవీ ఇది. దీనికి మారుతి డైరెక్టర్. ఈ సినిమా ఓటీటీలో సత్తాచాటుతోంది. మార్చి 9 నుంచి మార్చి 15 వరకు ఇండియాలో ఓటీటీలో అత్యధిక మంది చూసిన టాప్-10 స్ట్రీమింగ్ లిస్ట్ ను ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేసింది.
తొమ్మిదో ప్లేస్ లో
మార్చి 9 నుంచి మార్చి 15 వరకు ఇండియాలో ఓటీటీలో అత్యధిక మంది చూసిన వాటిల్లో ది రాజాసాబ్ 9వ ప్లేస్ లో నిలిచింది. జియోహాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ మార్చి 9 నుంచి 15 వరకు 2.9 మిలియన్ వ్యూస్ సాధించింది. జనవరి 9న థియేటర్లలో రిలీజైన రాజాసాబ్.. ఫిబ్రవరి 6 నుంచి ఓటీటీలో అందుబాటులో ఉంది.
డిజాస్టర్
ది రాజాసాబ్ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. రూ.400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ.200 కోట్ల కలెక్షన్లు మాత్రమే రాబట్టగలిగింది. ఫిబ్రవరి 6న ఓటీటీలోకి వచ్చిన ది రాజాసాబ్ మార్చి 6 నుంచి హిందీలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కారణంతోనే ఇప్పుడు టాప్ 10 లో నిలిచిందని అనలిస్ట్ లు అంటున్నారు.
టీ20 ప్రపంచకప్
మార్చి 7 నుంచి 15 వరకు ఇండియాలో ఓటీటీలో అత్యధిక మంది చూసింది టీ20 ప్రపంచకప్ నే. ఇది 21.9 మిలియన్ వ్యూస్ తో టాప్ ప్లేస్ లో నిలిచింది. ఈ టోర్నీలో ఇండియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
టాప్-10 లిస్ట్
{{/usCountry}}మార్చి 7 నుంచి 15 వరకు ఇండియాలో ఓటీటీలో అత్యధిక మంది చూసింది టీ20 ప్రపంచకప్ నే. ఇది 21.9 మిలియన్ వ్యూస్ తో టాప్ ప్లేస్ లో నిలిచింది. ఈ టోర్నీలో ఇండియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
టాప్-10 లిస్ట్
{{/usCountry}}టాప్-10లో వరుసగా టీ20 ప్రపంచకప్ (21.6 మిలియన్ వ్యూస్), ది 50 (7.2 మిలియన్), నాగిన్ సీజన్ 7 (4.2 మిలియన్), తారక్ మెహతా కా ఉల్టా చష్మా (3.8 మిలియన్), సుబేదార్ (3.6 మిలియన్), అనుపమ (3.3 మిలియన్), లాఫ్టర్ చెఫ్స్ సీజన్ 3 (3.2 మిలియన్), సంకల్ప్ (3 మిలియన్), ది రాజాసాబ్ (2.9 మిలియన్), స్ల్పిట్స్ విల్లా ఎక్స్6 (2.8 మిలియన్) ఉన్నాయి.
ఈ ఓటీటీల్లో
ఇందులో టీ20 ప్రపంచకప్, ది 50 (రియాలిటీ షో), నాగిన్ సీజన్ 7, అనుపమ (సీరియల్స్), లాఫ్టర్ చెఫ్స్ (షో), ది రాజాసాబ్ (సినిమా), స్ల్పిట్స్ విల్లా (షో) జియోహాట్ స్టార్ ఓటీటీకి చెందినవి. తారక్ మెహతా కా ఉల్టా చష్మా (సీరియల్) ఏమో సోనీ లివ్, సంకల్ప్ సిరీస్ ఏమో అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ లో, సుబేదార్ మూవీ ఏమో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.