ఓటీటీలోకి వచ్చీ రాగానే మలయాళం సూపర్ హీరో మూవీ, కన్నడ యాక్షన్ డ్రామా చెలరేగిపోతున్నాయి. మూడు రోజుల్లోనే టాప్ 5 సినిమాల జాబితాలో తొలి రెండు స్థానాల్లో నిలవడం విశేషం. వీటిని నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో చూడొచ్చు. మరి టాప్ 5లో ఉన్న సినిమాలేంటో చూడండి.
లోకా ఛాప్టర్ 1 చంద్ర టాప్‌లోకి..

మలయాళం ఫిమేల్ సూపర్ హీరో మూవీ లోకా ఛాప్టర్ 1 చంద్ర అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. గత శుక్రవారం (అక్టోబర్ 31) జియోహాట్‌స్టార్ లోకి వచ్చిన ఈ సినిమా మూడు రోజుల్లోనే 3.8 మిలియన్ల వ్యూస్ తో తొలి స్థానంలో నిలిచింది. ఏడు భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. కల్యాణి ప్రియదర్శన్, నస్లేన్ లీడ్ రోల్స్ లో నటించారు.
కాంతార ఛాప్టర్ 1 - ప్రైమ్ వీడియో
ఇక గత శుక్రవారమే ఓటీటీలోకి వచ్చిన కన్నడ యాక్షన్ డ్రామా మూవీ కాంతార ఛాప్టర్ 1 రెండో స్థానంలో ఉంది. ప్రైమ్ వీడియోలో కన్నడతోపాటు తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు 3.5 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఒకే రోజు ఓటీటీలోకి వచ్చిన ఈ రెండు బ్లాక్‌బస్టర్ సినిమాలు వ్యూస్ విషయంలో పోటాపోటీగా సాగుతున్నాయి.
ఓజీ - నెట్‌ఫ్లిక్స్
పవన్ కల్యాణ్ నటించిన ఓజీ మూవీ కూడా ఇంకా దూసుకెళ్తూనే ఉంది. ఈ సినిమాకు గత వారం 3 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. టాప్ 5లో మూడో స్థానంలో ఉంది. ఒకవారం టాప్ లోకి దూసుకెళ్లినా.. ఇప్పుడు మూడోస్థానంతో సరిపెట్టుకుంది.
పరమ్ సుందరి - ప్రైమ్ వీడియో
జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన పరమ్ సుందరి సినిమా నాలుగో స్థానంలో ఉంది. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు గత వారం 2.8 మిలియన్ వ్యూస్ వచ్చాయి. బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడినా ఓటీటీలో మాత్రం మంచి వ్యూసే వస్తున్నాయి.
ఇడ్లీ కొట్టు - నెట్‌ఫ్లిక్స్
{{/usCountry}}జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన పరమ్ సుందరి సినిమా నాలుగో స్థానంలో ఉంది. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు గత వారం 2.8 మిలియన్ వ్యూస్ వచ్చాయి. బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడినా ఓటీటీలో మాత్రం మంచి వ్యూసే వస్తున్నాయి.
ఇడ్లీ కొట్టు - నెట్‌ఫ్లిక్స్
{{/usCountry}}తమిళ స్టార్ హీరో ధనుష్ లీడ్ రోల్లో నటించిన ఇడ్లీ కొట్టు మూవీ ఐదో స్థానంలో ఉంది. నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు 2 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. తమిళంలో ఇడ్లీ కడాయ్ పేరుతో ఈ మూవీ వచ్చిన విషయం తెలిసిందే. థియేటర్లలో దీనికి పెద్దగా రెస్పాన్స్ రాలేదు.