Jiohotstar Web Series: ఆఫీసులో అపరిచితులు.. ఇంట్లోనేమో భార్యాభర్తలు.. ఇవాళ జియోహాట్‌స్టార్‌లోకి కొత్త తమిళ వెబ్ సిరీస్
Jiohotstar Web Series: హాట్ స్టార్ స్పెషల్ వెబ్ సిరీస్ లతో దూసుకెళ్తున్న జియోహాట్‌స్టార్ ఓటీటీ మరో కొత్త వెబ్ సిరీస్ ను తీసుకొచ్చింది. డిఫరెంట్ స్టోరీ లైన్ తో తెరకెక్కిన మిస్టర్ అండ్ మిసెస్ ఆఫీస్ సిరీస్ ఇవాళ నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూసేయండి.
Jiohotstar Web Series: ఓటీటీ ప్రియుల కోసం జియోహాట్‌స్టార్ (JioHotstar) మరో సరికొత్త ఎంటర్‌టైనర్‌ను తీసుకొచ్చింది. ఇటీవల కాలంలో డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్.. ఇప్పుడు వర్క్‌ప్లేస్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ కామెడీ సిరీస్‌ను మన ముందుకు తెచ్చింది.

మిస్టర్ అండ్ మిసెస్ ఆఫీస్ ఓటీటీ
హాట్‌స్టార్ స్పెషల్స్‌లో భాగంగా 'మిస్టర్ అండ్ మిసెస్ ఆఫీస్' (Mr & Mrs Office) అనే వెబ్ సిరీస్ ఇవాళ (నవంబర్ 18) నుంచి జియోహాట్‌స్టార్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. నేటి యువత ఎదుర్కొంటున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల కష్టాలు, ఆఫీస్ రాజకీయాలు, దానికి తోడు కెరీర్-లైఫ్ బ్యాలెన్స్.. ఇలా అన్నింటినీ కలిపి ఒక అద్భుతమైన ఓటీటీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా డైరెక్టర్ అబ్దుల్ కబీజ్ ఈ సిరీస్‌ను రూపొందించారు.
అసలు కథ ఏంటంటే?
అరివు, ఐశ్వర్య జంటకు పెళ్లి అవుతుంది. అరివు పని చేసే సాఫ్ట్ వేర్ కంపెనీలోనే అరివు జాయిన్ అవుతుంది. అయితే ఆ కంపెనీ రూల్స్ ప్రకారం భార్యాభర్తలు లేదా ఒకే కుటుంబానికి చెందిన వారు ఒకే ఆఫీసులో కలిసి పనిచేయకూడదు. దీంతో తమ ఉద్యోగాలను కాపాడుకోవడానికి అరివు, ఐశ్వర్య ఆఫీస్‌లో ఒకరికొకరు పరిచయమే లేని అపరిచితులుగా నటిస్తారు.
ఇంట్లో ఎంతో అన్యోన్యంగా ఉండే అరివు, ఐశ్వర్య.. ఆఫీస్ లో మాత్రం స్ట్రేంజర్స్ లాగా వ్యవహరిస్తూ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు? కఠినమైన బాస్ నుంచి వీరు పడ్డ ఇబ్బందులు ఏంటి? తమ పెళ్లి విషయాన్ని ఎవరికీ తెలియకుండా ఎలా దాచిపెట్టారు? అనే విషయాలను ఎంతో హాస్యభరితంగా ఈ మిస్టర్ అండ్ మిసెస్ ఆఫీస్ సిరీస్‌లో చూపించారు.
ఈ నటీనటులు
ఈ మిస్టర్ అండ్ మిసెస్ ఆఫీస్ వెబ్ సిరీస్‌లో అరివు పాత్రలో యువ నటుడు ప్రదీప్ ఆంటోనీ నటించగా, ఐశ్వర్య పాత్రలో స్నేహ మణిమేగలై అద్భుతంగా నటించారు. వీరిద్దరి మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తాయి. అలాగే ప్రముఖ నటి సనమ్ శెట్టి కూడా ఈ సిరీస్‌లో ఒక కీలక పాత్ర పోషించి మెప్పించారు. జెగన్ భాస్కరన్ నిర్మాణంలో వచ్చిన ఈ ఒరిజినల్ సిరీస్ తెలుగులోనూ అందుబాటులో ఉంది.
ఎన్ని ఎపిసోడ్స్?
మిస్టర్ అండ్ మిసెస్ ఆఫీస్ వెబ్ సిరీస్ నవంబర్ 18 నుంచి జియో హాట్‌స్టార్ లో (JioHotstar) అధికారికంగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌ను చాలా భారీగా మొత్తం 100 ఎపిసోడ్స్ ఉండేలా ప్లాన్ చేశారని సమాచారం. ప్రతి బుధవారం నాలుగు కొత్త ఎపిసోడ్స్ చొప్పున ఓటీటీలో విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. దీనివల్ల ప్రేక్షకులకు ప్రతి వారం నాన్-స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ఖాయంగా కనిపిస్తోంది.
ఈ సిరీస్ ఎందుకు చూడాలి?
ఆఫీస్ టార్గెట్స్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్, బాస్ తో ఉండే చిరాకులు.. ఇలాంటి విషయాలను నేటి తరం యువత తమ నిజ జీవితంతో సులభంగా రిలేట్ చేసుకుంటారు. సీరియస్ అంశాలకు కడుపుబ్బా నవ్వించే కామెడీని జోడించి రూపొందించిన ఈ సిరీస్ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా బాగా కనెక్ట్ అవుతుంది. మంచి వర్క్ ప్లేస్ కామెడీ డ్రామా చూడాలనుకునేవారికి ఇదొక బెస్ట్ ఆప్షన్.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


