...
...
Next Story

Dhanush Mrunal: క్రేజీ బజ్.. ధనుష్ డైరెక్ష‌న్‌లో మృణాల్ ఠాకూర్ మూవీ.. దేవ‌త‌గా మార‌నున్న బ్యూటీ

Dhanush Mrunal: ధనుష్, మృణాల్ ఠాకూర్.. ఈ జంటపై రూమర్లు ఆగడం లేదు. వీళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారనే వార్తలు వస్తున్నాయి. వీటిని మృణాల్ కొట్టిపారేసింది. తాజాగా ధనుష్, మృణాల్ కు సంబంధించిన క్రేజీ బజ్ ఒకటి తెగ వైరల్ గా మారింది.

Published on: Apr 21, 2026, 12:59:17 IST
Advertisement

Dhanush Mrunal: ధనుష్ కోసం మృణాల్ ఠాకూర్ దేవతగా మారబోతుందంటా.. ధనుష్ డైరెక్షన్ లో ఈ బ్యూటీఫుల్ హీరోయిన్ ఓ సినిమా చేయబోతుందంటూ కోలీవుడ్ కోడై కూస్తోంది. ఇప్పుడీ క్రేజీ బజ్ తెగ వైరల్ గా మారింది. దీంతో మరోసారి ధనుష్, మృణాల్ ఠాకూర్ మధ్య డేటింగ్ రూమర్లు గుప్పుమంటున్నాయి.

ధనుష్ డైరెక్షన్ లో

ధనుష్ డైరెక్షన్ లో మృణాల్ ఠాకూర్?
ధనుష్ డైరెక్షన్ లో మృణాల్ ఠాకూర్?

తమిళ స్టార్ హీరో ధనుష్ ఓ మంచి డైరెక్టర్ కూడా. ఇప్పటికే అతను మెగాఫోన్ పట్టి సినిమాలు తీశాడు. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ మూవీని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడని టాక్. ఇక ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ అనే ప్రచారం మరింత హాట్ టాపిక్ గా మారింది.

దేవతగా మృణాల్

ధనుష్ లేడీ ఓరియెంటెడ్ మూవీ తీయబోతున్నాడని టాక్. ఆ వుమెన్ సెంట్రిక్ ఫిల్మ్ లో మృణాల్ ఠాకూర్ మెయిన్ లీడ్ రోల్ ప్లే చేయబోతుందని సమాచారం. ఈ సినిమాను పీరియాడిక్ డ్రామాగా తీసుకురాబోతున్నారని తెలిసింది. ఇందులో మృణాల్ ఠాకూర్ ఓ దేవతలా కనిపించబోతుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

త్వరలోనే అనౌన్స్ మెంట్

ధనుష్ దర్శకత్వంలో మృణాల్ ఠాకూర్ చేయబోతున్న ఈ సినిమాపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతుందని కోలీవుడ్ వర్గాల టాక్. ఇది 1970ల నాటి బ్యాక్ డ్రాప్ లో నడిచే కథ చుట్టూ సాగే మూవీ అని సమాచారం. దీనికి జీవీ ప్రకాష్ మ్యూజిక్ అందించనున్నాడని తెలిసింది. ఈ సినిమాను తన సొంత బ్యానర్ వండర్ బార్ ఫిల్మ్స్ బ్యానర్ పై ధనుష్ నిర్మించబోతున్నాడని అంటున్నారు.

ధనుష్, మృణాల్ ఠాకూర్

తాజాగా ధనుష్, మృణాల్ ఠాకూర్ పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారమూ వినిపించింది. అయితే దీన్ని మృణాల్ ఠాకూర్ కొట్టిపారేసింది.

డెకాయిట్ తో

రీసెంట్ గా తెలుగు సినిమా డెకాయిట్ తో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసింది మృణాల్ ఠాకూర్. ఇందులో అడివి శేష్ హీరో. ఏప్రిల్ 10న రిలీజైన డెకాయిట్ కు పాజిటివ్ దక్కింది. ఈ మూవీ మంచి వసూళ్లతో సాగిపోతోంది. అడివి శేష్ కెరీర్ లో మరో హిట్ గా నిలిచింది డెకాయిట్.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks