...
...
Next Story

Mukhesh Khanna: మగతనం చాటేందుకు చాలా మందితో సంబంధాలు సరికాదు-67 ఏళ్ల వయసులోనూ పెళ్లికి రెడీ-ముఖేష్ ఖన్నా సంచలన వ్యాఖ్యలు

Mukhesh Khanna: శక్తిమాన్ సీరియల్‌తో పాపులర్ అయిన ముఖేష్ ఖన్నా పెళ్లి, ప్రేమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 67 ఏళ్ల వయసులోనూ పెళ్లి చేసుకునేందుకు తాను రెడీగా ఉన్నట్లు తెలిపాడు.

Published on: May 04, 2026 09:50 AM IST
Advertisement

Mukhesh Khanna: శక్తిమాన్ సీరియల్‌తో దేశవ్యాప్తంగా సూపర్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు ముఖేష్ ఖన్నా.. తన వ్యక్తిగత జీవితం, పెళ్లి, ప్రేమ గురించి మరోసారి స్పందించారు. 67 ఏళ్ల వయస్సులోనూ ఆయన వివాహం చేసుకోకపోవడానికి గల కారణాలను, జీవితంపై తనకున్న ఆధ్యాత్మిక దృక్పథాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

ముఖేష్ ఖన్నా కామెంట్లు

ముఖేష్ ఖన్నా
ముఖేష్ ఖన్నా

‘ది ఫిల్మీ చర్చా’ పాడ్‌కాస్ట్‌లో ముఖేష్ ఖన్నా.. పెళ్లి, బంధాలు, కమిట్‌మెంట్‌లపై తన మనసులోని మాటలను నిర్మొహమాటంగా చెప్పారు. తాను వివాహ వ్యవస్థను ఎంతగానో నమ్ముతానని ముఖేష్ ఖన్నా స్పష్టం చేశారు. పెళ్లి చేసుకోకపోతే వివాహ వ్యవస్థపై నమ్మకం లేదనుకోవడం పొరపాటు అని ఆయన అన్నారు. సరైన సమయంలో సరైన వ్యక్తిని కలిసినప్పుడు తాను పెళ్లికి సిద్ధమేనని చెప్పారు.

విధి రాత

"నేను చాలా మంది కంటే ఎక్కువగా వివాహ వ్యవస్థను నమ్ముతాను. భార్య అనేది యాదృచ్ఛికంగా జీవితంలోకి రాదు. అది విధి రాత. ఒకవేళ అది జరగాల్సి ఉంటే, ఎప్పుడో జరిగి ఉండేది. నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలని విధి రాసిందో ఆ మహిళ ఎక్కడో ఒకచోట ఉంది. విధి మమ్మల్ని కలిపినప్పుడు వివాహం ఖచ్చితంగా జరుగుతుంది" అని 67 ఏళ్ల ముఖేష్ ఖన్నా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మగతనం అంటే

మగతనాన్ని నిరూపించుకోవడానికి చాలా మందితో సంబంధాలు పెట్టుకోవడం సరికాదని ముఖేష్ ఖన్నా గట్టిగా చెప్పారు. ఒక వ్యక్తి తన మగతనం నిరూపించుకోవడానికి చాలా మంది భాగస్వాములు అవసరం లేదన్నారు. మగతనాన్ని చాటేందుకు అంతకంటే బెటర్ మార్గాలున్నాయని పేర్కొన్నారు. తాను మహిళలకు వ్యతిరేకం కాదని, వారికి ఎల్లప్పుడూ గౌరవం ఇస్తానని ఆయన స్పష్టం చేశారు.

భార్య ఒక్కరే

అలాగే, నిజమైన ప్రేమ జీవితంలో ఒక్కసారి మాత్రమే వస్తుందని, మిగిలినవన్నీ కేవలం ఆకర్షణలు లేదా కోరికలు మాత్రమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక వ్యక్తిని ప్రేమించి, ఆ తర్వాత మరో వ్యక్తి వైపు వెళ్లడం కృతజ్ఞత లేని పని అని ఆయన వ్యాఖ్యానించారు. ముఖేష్ ఇప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోలేదు.

ఒక నటుడిగా, ప్రజా ప్రతినిధిగా ముఖేష్ ఖన్నా చేసిన ఈ వ్యాఖ్యలు యువతకు ఒక కొత్త ఆలోచనను ఇస్తున్నాయి. పెళ్లి, ప్రేమ పట్ల నేటి తరం ఆలోచనలకు భిన్నంగా, ఆయన సంప్రదాయబద్ధమైన ఆలోచనలను వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe