OTT Telugu Today: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు లవ్ డ్రామా- విడిపోయిన ప్రేమ జంట, 35 ఏళ్ల తర్వాత పెళ్లి- ఇక్కడ చూసేయండి!
OTT Telugu Release Today Movie Aaradhana Streaming: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు లవ్ డ్రామా చిత్రమే ఆరాధన. యువకులుగా ఉన్నప్పుడు విడిపోయిన ప్రేమ జంట 35 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో తెరకెక్కింది ఈ మూవీ. మరి ఈ ఆరాధన ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసుకుందాం.
Today OTT Release Telugu Movie Aaradhana: ఓటీటీలో ఎప్పటికప్పుడు డిఫరెంట్ తెలుగు సినిమాలు స్ట్రీమింగ్‌కు వస్తూనే ఉన్నాయి. అలా ఈ వారం కూడా ఎన్నో సినిమాలు ఓటీటీ రిలీజ్ కాగా ఇవాళ (మే 3) తెలుగు లవ్ డ్రామా చిత్రం ఒకటి డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఆ సినిమానే 'ఆరాధన'.

సీనియర్ హీరోయిన్ ఆమనితో సమీర్
ప్రేమకు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తూ, మనసును హత్తుకునే భావోద్వేగాలతో తెరకెక్కిన చిత్రమే ఈ 'ఆరాధన'. సీనియర్ హీరోయిన్ ఆమని, నటుడు సమీర్ జోడీగా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా యువకులుగా విడిపోయిన ప్రేమ జంట 35 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో తెరకెక్కింది.
కథా నేపథ్యం: దశాబ్దాల తర్వాత కలిసిన జంట
ప్రేమ అన్నది కేవలం యవ్వనానికే పరిమితం కాదు, అది జీవితాంతం తోడుండే ఒక అనుభూతి అని 'ఆరాధన' కథ చెబుతుంది. ఒకప్పుడు ప్రాణప్రదంగా ప్రేమించుకున్న కృష్ణ, రాధ కొన్ని అనివార్య కారణాల వల్ల విడిపోతారు. సిటీకి వెళ్లి పెళ్లి చేసుకుందామని రాధతో కృష్ణ చెబుతాడు. రాధ సరే అంటుంది. రాధ కోసం కృష్ణ ఎంతగా ఎదురుచూసిన రాధ రాదు.
అలా కాలచక్రం తిరుగుతుంది, దశాబ్దాలు గడిచిపోతాయి. 35 ఏళ్ల తర్వాత మళ్లలీ కృష్ణ, రాధ అనుకోకుండా కలుసుకుంటారు. వృద్ధాప్యానికి దగ్గరగా ఉన్న సమయంలో ఒంటరితనంతో ఆ ఇద్దరు పాత ప్రేమికులు, సమాజం ఏమనుకుంటుందో అన్న భయం కంటే.. మిగిలిన జీవితాన్ని కలిసి గడపడాలనే నిర్ణయించుకుంటారు. ధైర్యంగా తమ రెండో ఇన్నింగ్స్‌ను ప్రేమతో ఎలా మొదలుపెట్టారనేదే ఈ చిత్ర సారాంశం.
ప్రతిభావంతులైన నటీనటులు
ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ ఆమని తనదైన నటనతో రాధ పాత్రకు ప్రాణం పోశారు. గతంలో ఎన్నో కుటుంబ కథా చిత్రాల్లో మెప్పించిన ఆమె, ఈ సినిమాలో ఒక పరిణతి చెందిన ప్రేమికురాలిగా కనిపిస్తారు. ఇక సీరియల్, సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన సమీర్ తన సహజ సిద్ధమైన నటనతో కృష్ణ పాత్రలో ఒదిగిపోయారు.
ఆరాధన సినిమాలో ఆమని, సమీర్‌తోపాటు శివ ప్రసన్న, మదన్, ఐశ్వర్య జ్యోతి, వేణు జెట్టి, శివ గడ్డం, అమూల్య వీరబత్తిని, సోమేశ్వర ప్రసాద్, రామ్ వెంకట్, కృష్ణ తేజ, సాయి ధనుష్, రిషిత రెడ్డి, నిఖిల్, రికిత చౌదరి, షాహిద్, ప్రవీణ్, వీరేష్, కావేరి, పీవీ నాగార్జున శర్మ, శ్రీకాంత్ దేవరకొండ ఇతర పాత్రలు పోషించారు.
ఆరాధన ఓటీటీలోకి
ఈ ఓటీటీ సినిమాకు అందులో నటించిన శ్రీకాంత్ దేవరకొండ కథ, దర్శకత్వం వహించారు. మౌర్య ఇలా సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టగా.. రాకేష్ వెంకటాపురం సంగీతం అందించారు. మనసుకు హత్తుకునే సన్నివేశాలు, డైలాగ్స్‌తో తెరకెక్కిన ఆరాధన ఓటీటీలోకి ఇవాళ వచ్చేసింది.
ఈటీవీ విన్ ఓటీటీలో
ప్రముఖ తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో ఆరాధన ఓటీటీ రిలీజ్ అయింది. కేవలం 39 నిమిషాలతో ఆరాధన ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రతి వారం ఈటీవీ విన్ ఓటీటీ సిరీస్ కథా సుధలో భాగంగా నేడు ఓటీటీలోకి వచ్చేసింది తెలుగు లవ్ డ్రామా చిత్రం ఆరాధన. ఇలాంటి ప్రేమకథలు ఇష్టపడేవారికి ఈటీవీ విన్ ఓటీటీలోని ఆరాధన మంచి ఛాయిస్.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


