...
...
Next Story

ఒక్క యాక్సిడెంట్, చిట్లిపోయిన మెదడు నరాలు, ఏడేళ్లపాటు నరకం- హీరోయిన్ ముమైత్ ఖాన్ దీనగాథ- కానీ, ఇప్పుడు మాత్రం!

ఒకప్పుడు తన డ్యాన్స్‌తో వెండితెరను ఊపేసిన ముమైత్ ఖాన హఠాత్తుగా ఇండస్ట్రీకి ఎందుకు దూరమైందో తాజాగా వెల్లడించారు. మెదడు సంబంధిత గాయం వల్ల 15 రోజులు కోమాలోకి వెళ్లిన ముమైత్ ఖాన్ ఏడేళ్ల పాటు నరకయాతన అనుభవించానని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ముమైత్ ఖాన్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Published on: Feb 8, 2026, 13:24:06 IST
Advertisement

2000వ దశకం ఆరంభంలో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న డ్యాన్సర్‌గా, ఐటమ్ సాంగ్స్ హీరోయిన్‌గా ముమైత్ ఖాన్ ఒక వెలుగు వెలిగారు. హిందీలో ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’లోని ‘దేఖ్ లే’ పాటతో మొదలైన ఆమె ప్రయాణం.. తెలుగులో మహేశ్ బాబు ‘పోకిరి’లో ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే’ వరకు అప్రతిహతంగా సాగింది.

ఒక్క యాక్సిడెంట్, చిట్లిపోయిన మెదడు నరాలు, ఏడేళ్లపాటు నరకం- హీరోయిన్ ముమైత్ ఖాన్ దీనగాథ- కానీ, ఇప్పుడు మాత్రం!
ఒక్క యాక్సిడెంట్, చిట్లిపోయిన మెదడు నరాలు, ఏడేళ్లపాటు నరకం- హీరోయిన్ ముమైత్ ఖాన్ దీనగాథ- కానీ, ఇప్పుడు మాత్రం!

అయితే, కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే ముమైత్ ఖాన్ హఠాత్తుగా తెరమరుగయ్యారు. చాలామంది ఆమెకు అవకాశాలు తగ్గడం వల్లే వెళ్లిపోయిందని భావించారు. కానీ, అసలు కారణం తెలిస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోవాల్సిందే.

చావు అంచు దాకా వెళ్లొచ్చాను

తాజాగా 'ఐ డ్రీమ్ మీడియా' (iDream Media)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముమైత్ తన జీవితాన్ని మార్చేసిన ఆ చీకటి రోజులను గుర్తుచేసుకున్నారు. 2016లో తనకు ఒక ఘోర ప్రమాదం జరిగిందని, దానివల్ల మెదడులోని ఐదు నరాలు చిట్లిపోయాయని ముమైత్ ఖాన్ వెల్లడించారు.

"నేను ఇండస్ట్రీని వదిలి వెళ్లలేదు.. దేవుడే నా కెరీర్‌కు ఫుల్ స్టాప్ పెట్టాడు. ఆ ప్రమాదం తర్వాత నేను 15 రోజుల పాటు కోమాలోకి వెళ్లిపోయాను. కనీసం ఐదు కేజీల బరువు కూడా ఎత్తకూడదని, ఏడేళ్ల పాటు పని చేయవద్దని డాక్టర్లు కచ్చితంగా చెప్పారు. చివరకు ఫిట్స్ రాకుండా ఉండేందుకు మందులు వాడాల్సి వచ్చింది. దానివల్ల నా బరువు కూడా విపరీతంగా పెరిగింది" అని ముమైత్ భావోద్వేగానికి లోనయ్యారు.

ఏడేళ్ల మౌనం.. కొత్త జీవితం

ఆ ఏడేళ్ల కాలంలో తాను ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని ముమైత్ ఖాన్ తెలిపారు. ఆర్థికంగా తన తల్లి అండగా నిలిచిందని, ఆ ఖాళీ సమయాన్ని తనను తాను మార్చుకోవడానికి (Self-study) ఉపయోగించుకున్నానని చెప్పారు. "మనం ఎంత ఎత్తుకు ఎదిగినా దేవుడు ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు. నాకు జరిగిన దాన్ని నేను భగవంతుడి నిర్ణయంగా స్వీకరించాను" అని పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో బిజినెస్ ఉమెన్‌గా..

ప్రస్తుతం హైదరాబాద్‌లో 'విలైక్' (WeLyke) అనే మేకప్ అండ్ హెయిర్ అకాడమీని నడుపుతున్నారు. ఈ రంగంలో తనదైన ముద్ర వేయడమే కాకుండా, ఎంతోమందికి శిక్షణ ఇస్తూ తన రెండో ఇన్నింగ్స్‌ను ఎంతో సంతోషంగా సాగిస్తున్నారు ముమైత్ ఖాన్.

కొత్త జీవితం తృప్తినిస్తోంది

ప్రస్తుతం 40 ఏళ్ల వయసున్న ముమైత్ ఖాన్ తన గతం గురించి ఎలాంటి విచారం లేదని చెబుతున్నారు. జరిగిన ప్రతిదీ తన మంచికేనని, ఈ కొత్త జీవితం తనకు ఎంతో తృప్తిని ఇస్తోందని స్పష్టం చేశారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe