...
...
Next Story

నేను, నా కుటుంబం బతికి ఉండటానికి కారణం ఆయన.. నన్ను ఆదుకున్న దేవుడు, నా కోసం నిలబడిన శక్తి రవితేజ సర్: భీమ్స్ ఎమోషనల్

మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సీసిరిలియో ఎమోషనల్ అయిపోయాడు. మాస్ జాతర మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో రవితేజ గురించి మాట్లాడుతూ.. తనను ఆదుకున్న దేవుడు, తన కోసం నిలబడిన శక్తి రవితేజ సర్ అంటూ భీమ్స్ చాలా భావోద్వేగంతో చెప్పగానే ఆడిటోరియం మార్మోగిపోయింది.

Published on: Oct 29, 2025, 10:18:28 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సీసిరోలియో.. మాస్ జాతర ప్రీరిలీజ్ ఈవెంట్లో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాను ఈరోజు బతికి ఉండటానికి కారణంగా రవితేజ సర్ అని అతడు అనడం గమనార్హం. తనను ఆదుకున్న దేవుడు, తన కోసం నిలబడిన వ్యక్తి, శక్తి, వ్యవస్థ రవితేజ అంటూ చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు.

భీమ్స్ సీసిరోలియో ఏమన్నాడంటే?

నేను, నా కుటుంబం బతికి ఉండటానికి కారణం ఆయన.. నన్ను ఆదుకున్న దేవుడు, నా కోసం నిలబడిన శక్తి రవితేజ సర్: భీమ్స్ ఎమోషనల్
నేను, నా కుటుంబం బతికి ఉండటానికి కారణం ఆయన.. నన్ను ఆదుకున్న దేవుడు, నా కోసం నిలబడిన శక్తి రవితేజ సర్: భీమ్స్ ఎమోషనల్

రవితేజ, శ్రీలీల నటించిన మాస్ జాతర మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ మంగళవారం (అక్టోబర్ 28) రాత్రి జరిగిన విషయం తెలుసు కదా. ఈ ఈవెంట్లో మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సీసిరోలియో చాలా ఎమోషనల్ అయ్యాడు. తాను, తన కుటుంబం ఇవాళ బతికి ఉండటానికి కారణం రవితేజ సర్ అని అతడు చెప్పాడు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొదట రవితేజ చేసిన సాయం గురించి పాట రూపంలో పాడాడు. ఆ తర్వాత మాట్లాడాడు.

“నేను ఇవాళ ఓ వ్యక్తి గురించి చెప్పబోతున్నాను. నేను ధమాకా చేసినప్పటి నుంచి చిరంజీవి సర్ సినిమా చేసే వరకు ప్రతి పాట వెనుక, ప్రతి ప్రోత్సాహం వెనుక ఓ వ్యక్తి ఉన్నారు. నేను ఓ పాట పాడుతూ సెల్ ఫోన్ లో వీడియో తీసుకుంటున్న సమయంలో నా భార్యా పిల్లలకు అది ఎందుకు తీస్తున్నానో తెలియదు. అప్పటికి ఇంటికి కిరాయి ఎలా కట్టాలి.. పిల్లలను ఎలా చదివించాలి అని బాధపడుతున్నాను. అప్పుడే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి నాకు ఫోన్ వచ్చింది.

నాకు భూమి మీద నూకలు చెల్లిపోయాయి.. ఇక నేను, నా భార్యాపిల్లలతో కట్టగట్టుకొని పైకి వెళ్లిపోదామనుకున్నాను. అలాంటి సమయంలో ఓ దేవుడిలాగా, ఓ జీసస్ లాగా, ఓ అల్లాలాగా, రాముడిగా, తిరుపతి వెంకన్న నా జీవితంలో ఓ వ్యక్తి వచ్చారు. నన్ను ఆదుకున్న దేవుడు.. నా కోసం నిలబడిన వ్యక్తి, శక్తి, వ్యవస్థ రవితేజ సర్. ఇవాళ నేను సజీవంగా ఉండటానికి కారణం.. అమ్మా, నాన్నా తెలుసుకోండి.. ఆ వ్యక్తి రవితేజ సర్ ” అని భీమ్స్ సీసిరోలియో అనడంతో ఆడిటోరియం అంతా మార్మోగిపోయింది.

భీమ్స్ సీసిరోలియో గురించి..

ఆ తర్వాత బలగం, రావణాసుర, టిల్లూ స్క్వేర్, సంక్రాంతికి వస్తున్నాం, మ్యాడ్ స్క్వేర్, ఇప్పుడు మాస్ జాతర, తర్వాత చిరంజీవి మూవీ మన శంకర్ వరప్రసాద్ గారులాంటి మూవీస్ తో తిరుగులేకుండా దూసుకెళ్తున్నాడు. అయితే అంతా అయిపోయిందనుకున్న సమయంలో తనకు అవకాశం ఇచ్చిన రవితేజను మాత్రం భీమ్స్ మరచిపోలేదు. తాజాగా అతడు ఇచ్చిన స్పీచ్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe