...
...
Next Story

OTT Climax Twist: మైండ్ బ్లాక్ అయ్యే క్లైమాక్స్ ట్విస్ట్‌లు- వావ్ అన‌కుండా ఉండ‌లేరు- ఓటీటీలో చూడాల్సిన 5 తెలుగు సినిమాలు

OTT Climax Twitst: సినిమా కథ ఎలా ఉన్నా, స్క్రీన్ ప్లే ఎలా సాగినా.. క్లైమాక్స్ అదిరిపోతే మాత్రం ఆ మూవీకి తిరుగుండదు. థియేటర్ నుంచి బయటకొచ్చే ప్రేక్షకులు ఆ క్లైమాక్స్ గురించే మాట్లాడుకుంటారు. అలా వావ్ అనిపించే క్లైమాక్స్ ఉన్న తెలుగు సినిమాలే ఇవి. ఓటీటీలో మస్ట్ వాచ్. ఓ లుక్కేయండి.

Published on: Jun 16, 2026, 13:47:24 IST
Advertisement

OTT Climax Twitst: ఊహించని ట్విస్ట్ తో సినిమా ఎండ్ అయితే వచ్చే కిక్కే వేరు. అలాంటి సినిమా క్లైమాక్స్ లు చాలా కాలం పాటు ఆడియన్స్ ను వెంటాడుతాయి. తెలుగులో ఇలాంటి మైండ్ బ్లాక్ క్లైమాక్స్ ట్విస్ట్ ఉన్న సినిమాలు చాలానే ఉన్నాయి. ఇందులో ఈ అయిదు మూవీస్ కూడా ప్రత్యేకమే. ఓటీటీలో తప్పక చూడాల్సిన సినిమాలు ఇవి.

కేరాఫ్ కంచరపాలెం

మైండ్ బ్లాక్ అయ్యే క్లైమాక్స్ ట్విస్ట్‌లు- వావ్ అన‌కుండా ఉండ‌లేరు- ఓటీటీలో చూడాల్సిన 5 తెలుగు సినిమాలు
మైండ్ బ్లాక్ అయ్యే క్లైమాక్స్ ట్విస్ట్‌లు- వావ్ అన‌కుండా ఉండ‌లేరు- ఓటీటీలో చూడాల్సిన 5 తెలుగు సినిమాలు

స్ట్రీమింగ్: ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్

కేరాఫ్ కంచరపాలెం సినిమా చివరి 15 నిమిషాల్లో దర్శకుడు ఇచ్చే ట్విస్ట్ అద్భుతంగా ఉంటుంది. అప్పటివరకూ సినిమాలో వచ్చిన నాలుగు వేర్వేరు కథలు వేర్వేరు వ్యక్తులవి కావని, అవి ఒకే వ్యక్తి (రాజు)కి చెందినవి అనే ట్విస్ట్ మైండ్ బ్లాక్ చేస్తుంది. అవి ఒకే వ్యక్తి జీవితంలో వివిధ దశల్లో (బాల్యం, యవ్వనం, మధ్య వయసు) జరిగిన యదార్థ సంఘటనలు.

గామి

స్ట్రీమింగ్: జీ5

కేరాఫ్ కంచరపాలెం తరహాలో ఈ సినిమాలో కూడా మూడు వేర్వేరు కథలు (అఘోర, దేవదాసి, ల్యాబ్ లో బందీలు) సమాంతరంగా నడుస్తుంటాయి. క్లైమాక్స్‌లో ఈ మూడు కథలు ఒకే బిందువు వద్ద ఎలా కలుస్తాయి అనేది తెలిశాక ఆడియన్స్ షాక్ అవ్వడం ఖాయం. ఒక ఎమోషనల్ అండ్ 'వావ్' ఫీలింగ్ ఇచ్చే అద్భుతమైన ఎండింగ్ ఇది.

విరూపాక్ష

స్ట్రీమింగ్: నెట్‌ఫ్లిక్స్

సస్పెన్స్, హారర్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా చివరి వరకు ఉత్కంఠగా సాగుతుంది. ఊర్లో వరుస మరణాలకు కారణం ఎవరు, అసలు విలన్ ఎవరు అనేది క్లైమాక్స్‌లో రివీల్ అయినప్పుడు ప్రేక్షకులకు గూస్ బంప్స్ రావడం గ్యారెంటీ. ఆ ట్విస్ట్ ను అసలు ఎవరూ ఊహించలేరు.

కల్కి 2898 ఏడీ

సైన్స్ ఫిక్షన్ కథతో వచ్చిన ఈ సినిమాలో చివరి 20 నిమిషాల క్లైమాక్స్ ఒక ఎపిక్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా హీరో అసలు క్యారెక్టర్ రివీల్ అయ్యే సీన్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించి, ఒక అద్భుతమైన వావ్ ఫీలింగ్ ఇచ్చింది.

మంగళవారం

స్ట్రీమింగ్: జియోహాట్ స్టార్

ఒక ఊరిలో ప్రతి మంగళవారం జరిగే మరణాల వెనుక ఉన్న మిస్టరీ సినిమా ఆసాంతం కట్టిపడేస్తుంది. అసలు ఆ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి, ఆ ముసుగు వ్యక్తి ఎవరు అనేది రివీల్ అయ్యే క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గాను, షాకింగ్ గాను ఉండి సర్ ప్రైజ్ చేస్తుంది. క్లైమాక్స్ ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని మరో లెవల్ కు తీసుకెళ్లింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe