Bhooth Bangla OTT Release Date: ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్.. రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈ మూవీ ఎందుకు చూడాలంటే?

Bhooth Bangla OTT Release Date: ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ వచ్చేస్తోంది. నవ్విస్తూనే భయపెట్టే సూపర్ హిట్ మూవీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. మరి ఈ హారర్ థ్రిల్లర్ ఎప్పుడు డిజిటల్ రిలీజ్ అవుతుంది? అసలు ఈ మూవీని ఎందుకు చూడాలన్నదే ఇక్కడ చదివేయండి.

Published on: Jun 9, 2026, 10:56:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bhooth Bangla OTT Release Date: బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, కామెడీ సినిమాల లెజెండరీ డైరెక్టర్ ప్రియదర్శన్ కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ హారర్ కామెడీ బ్లాక్‌బస్టర్ 'భూత్ బంగ్లా' (Bhooth Bangla). థియేటర్లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ ఫిల్మ్.. ఇక డిజిటల్ స్ట్రీమింగ్ లో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేస్తోంది.

ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్.. రిలీజ్ డేట్ ఫిక్స్
ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్.. రిలీజ్ డేట్ ఫిక్స్

భూత్ బంగ్లా ఓటీటీ రిలీజ్ డేట్

అక్షయ్ కుమార్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ ‘భూత్ బంగ్లా’ ఓటీటీలోకి రాబోతుంది. ఈ మూవీ జూన్ 12 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ క్లీన్ హిట్‌ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఓటీటీలో ఈ వింటేజ్ హారర్ థ్రిల్లర్ ఎందుకు మిస్ కాకూడదో పూర్తి ఎడిటోరియల్ విశ్లేషణ ఇక్కడ చూద్దాం.

14 ఏళ్ల తర్వాత కాంబో మ్యాజిక్

బాలీవుడ్‌లో 'భూల్ భులయ్యా' చిత్రాలతో హారర్ కామెడీ జానర్‌కు ఒక కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసిన డైరెక్టర్ ప్రియదర్శన్. దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ అక్షయ్ కుమార్, పరేష్ రావల్, రాజ్‌పాల్ యాదవ్, అస్రానీలతో కూడిన వింటేజ్ గ్యాంగ్ భూత్ బంగ్లా సినిమా కోసం మళ్లీ చేతులు కలిపింది. గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న అక్షయ్ కుమార్‌కు 'భూత్ బంగ్లా' బాక్సాఫీస్ వద్ద ఊపిరి పోసింది.

సక్సెస్ కారణం

ఈ భూత్ బంగ్లా సినిమా సక్సెస్‌కు ప్రధాన కారణం ‘నోస్టాల్జియా’. 2000ల కాలం నాటి క్లాసిక్ ప్రియదర్శన్ మార్క్ కన్ఫ్యూజన్ కామెడీ, హారర్ ఎలిమెంట్స్ పాత తరం ఆడియన్స్‌తో పాటు ఇప్పటి యూత్‌కు కూడా విపరీతంగా కనెక్ట్ అయ్యాయి. కేవలం ప్రమోషనల్ స్టంట్స్ నమ్ముకోకుండా వింటేజ్ కామెడీ ట్రాక్‌లను నమ్ముకోవడం ఈ చిత్రానికి రూ. 200 కోట్ల కలెక్షన్లను తెచ్చిపెట్టింది.

అక్షయ్ - టబు రేర్ ఫీట్!

ఈ సినిమాలో ఓటీటీ ఆడియన్స్‌ను ఆకర్షించే మరో ప్రధానాంశం.. అక్షయ్ కుమార్, సీనియర్ యాక్ట్రెస్ టబు (Tabu) కాంబినేషన్. గతంలో 'హేరా ఫేరి', 'తూ చోర్ మైన్ సిపాహి' వంటి క్రేజీ చిత్రాల్లో నటించిన ఈ జంట, దాదాపు 25 సంవత్సరాల తర్వాత మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంది. టబు పండించిన సస్పెన్స్, మెచ్యూర్డ్ కామెడీ టైమింగ్ సినిమాకు సెకండాఫ్‌లో మేజర్ హైలైట్‌గా నిలిచాయి.

'భూత్ బంగ్లా' అసలు కథేంటి?

సినిమా కథా నేపథ్యం 2000వ సంవత్సరం ప్రారంభంలో సాగుతుంది. మంగళపూర్ అనే ఒక మారుమూల గ్రామంలో ఉన్న ఒక భయంకరమైన మిస్టరీ చుట్టూ కథ తిరుగుతుంది. పెళ్లి జరిగిన రోజే కొత్త వధువులను 'వధాసురుడు' అనే ఒక దుష్టశక్తి అపహరిస్తుందని ఆ గ్రామ ప్రజలు నమ్ముతుంటారు.

ట్విస్ట్ ఏంటంటే

లండన్‌లో ఉంటూ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన అర్జున్ ఆచార్య (అక్షయ్ కుమార్) తనకు వారసత్వంగా వచ్చిన పాత కోటను అమ్ముకోవడానికి ఇండియా వస్తాడు. తన సోదరి మీరా (మిథిలా పాల్కర్) వివాహం కోసమే ఆ పాత బంగ్లాను సిద్ధం చేయాలని అర్జున్ భావిస్తాడు.

కానీ, అర్జున్ ఆ కోటలోకి అడుగుపెట్టడమే ఆలస్యం.. చాలా కాలంగా నిద్రపోతున్న వధాసురుడి ఆత్మ మళ్లీ మేల్కొంటుంది. ఆ దుష్టశక్తి నుంచి అర్జున్ తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? ఈ క్రమంలో పరేష్ రావల్, రాజ్‌పాల్ యాదవ్ గ్యాంగ్ సృష్టించిన నవ్వుల హంగామా ఏంటి? అనేదే మిగతా కథ.

Peopla Also Ask (తరుచుగా అడిగే ప్రశ్నలు)


1. భూత్ బంగ్లా తెలుగులో అందుబాటులో ఉంటుందా?

జవాబు: నెట్‌ఫ్లిక్స్ సాధారణంగా పెద్ద బాలీవుడ్ చిత్రాలను సౌత్ భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ ఆడియోలతో పాటు స్ట్రీమింగ్ చేస్తుంది. జూన్ 12న నెట్‌ఫ్లిక్స్‌ అధికారిక స్ట్రీమింగ్ లింక్‌లో ఆడియో ఆప్షన్స్ చెక్ చేసుకోవచ్చు.

2. భూత్ బంగ్లా సినిమాను ఫ్యామిలీతో చూడవచ్చా?

జవాబు: అవును, ఇది భయపెడుతూనే విపరీతంగా నవ్వించే పక్కా హారర్ కామెడీ ఎంటర్‌టైనర్. ఇందులో ఎలాంటి అశ్లీలత (vulgarity) లేదు. కాబట్టి వీకెండ్‌లో పిల్లలు, కుటుంబ సభ్యులతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు.

3. భూత్ బంగ్లా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఏదీ?

జవాబు: అక్షయ్ కుమార్-ప్రియదర్శన్ కాంబో మూవీ 'భూత్ బంగ్లా' జూన్ 12 నుంచి ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More