...
...
Next Story

ఈవారం ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిన మూవీస్, వెబ్ సిరీస్ ఇవే.. జాన్వీ కపూర్ మూవీ, టాప్ సిరీస్ మూడో సీజన్

ఈవారం ఓటీటీలోకి కొన్ని ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్, మూవీస్ స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. అందులో ఆస్కార్స్ కు ఇండియా నుంచి అధికారిక ఎంట్రీ అయిన జాన్వీ కపూర్ మూవీ నుంచి నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్న వెబ్ సిరీస్ మూడో సీజన్ వరకు ఉన్నాయి.

Published on: Nov 17, 2025, 17:54:49 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

ఓటీటీలోకి ఈవారం అంటే నవంబర్ 17 నుంచి 23 మధ్య స్ట్రీమింగ్ రాబోతున్న వివిధ సినిమాలు, వెబ్ సిరీస్ వివరాలు ఇక్కడ చూడండి. వీటిలో జాన్వీ కపూర్ నటించిన హోమ్‌బౌండ్, ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సీజన్ 3, బెంగాల్ ఫైల్స్ మూవీలాంటివి ఉన్నాయి. మరి అవేంటో చూడండి.

హోమ్‌బౌండ్ - నెట్‌ఫ్లిక్స్

ఈవారం ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిన మూవీస్, వెబ్ సిరీస్ ఇవే.. జాన్వీ కపూర్ మూవీ, టాప్ సిరీస్ మూడో సీజన్ (YouTube/Prime Video)
ఈవారం ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిన మూవీస్, వెబ్ సిరీస్ ఇవే.. జాన్వీ కపూర్ మూవీ, టాప్ సిరీస్ మూడో సీజన్ (YouTube/Prime Video)

జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్ లీడ్ రోల్స్ లో నటించిన మూవీ ఇది. నీరజ్ ఘైవాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్లలో విజయవంతమై, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రశంసలు పొందింది. ఇది ఇద్దరు స్నేహితులు పోలీస్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యేందుకు పడే కష్టం చుట్టూ తిరుగుతుంది. నవంబర్ 21న నెట్‌ఫ్లిక్స్ లోకి రానుంది.

ది బెంగాల్ ఫైల్స్ - జీ5 ఓటీటీ

వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 'డైరెక్ట్ యాక్షన్ డే', 'నౌఖాలీ అల్లర్లు' వంటి చారిత్రక సంఘటనల నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాకు థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాలేదు. అత్యంత వివాదాస్పద మూవీ అయిన ఈ బెంగాల్ ఫైల్స్ ను జీ5 ఓటీటీలో నవంబర్ 21 నుంచి చూడొచ్చు.

జిద్దీ ఇష్క్ - జియోహాట్‌స్టార్

అదితి పోహంకర్, పరమబ్రత ఛటర్జీ నటించిన మూవీ ఈ జిద్దీ ఇష్క్. ఈ సినిమా నవంబర్ 21 నుంచి జియోహాట్‌స్టార్ లోకి రానుంది. ఆన్‌లైన్‌లో చర్చనీయాంశంగా మారిన ఈ షో, ఒక యువతికి తన ట్యూటర్ పట్ల ఉండే అమాయకమైన ప్రేమ, క్రమంగా ఒక రకమైన అబ్సెషన్‌గా మారడం చుట్టూ కథ నడుస్తుంది.

డైనింగ్ విత్ ది కపూర్స్ - నెట్‌ఫ్లిక్స్

నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ కూడా ఈ వారమే రానుంది. నవంబర్ 21 నుంచి ప్రైమ్ వీడియోలో చూడొచ్చు. మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి, షరీబ్ హష్మీ, జైదీప్ అహ్లావత్ లీడ్ రోల్స్ లో నటించారు. మూడో సీజన్ నార్త్ ఈస్ట్ ఇండియా నేపథ్యంలో సాగనుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe