...
...
Next Story

Naagzilla Fraud: 82 కోట్ల బడ్జెట్, 4 కోట్ల ఫ్రాడ్- నకిలీ బిల్లులు, దొంగ లెక్కలు- ఆ ముగ్గురికి ముందస్తు బెయిల్ నిరాకరణ

Naagzilla Fraud Case Anticipatory Bail Denies: బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ హీరోగా నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్న నాగ్‌జిల్లా నిర్మాణంలో సుమారు రూ. 4 కోట్ల నిధుల మళ్లింపు జరిగింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులకు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ముంబై సెషన్స్ కోర్టు కొట్టివేసింది.

Published on: Oct 31, 2026, 08:37:56 IST
Advertisement

Naagzilla Fraud Case Anticipatory Bail Denies: బాలీవుడ్ చిత్రపరిశ్రమలో రూ. 4 కోట్ల భారీ ఆర్థిక మోసం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'నాగ్‌జిల్లా' షూటింగ్ ప్రాసెస్‌లో నిధుల కేటాయింపులకు సంబంధించి అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ముంబైలోని దిండోషి సెషన్స్ కోర్టు కీలక తీర్పునిచ్చింది.

ప్రధాన నిందితులుగా ముగ్గురు

82 కోట్ల బడ్జెట్, 4 కోట్ల ఫ్రాడ్- నకిలీ బిల్లులు, దొంగ లెక్కలు- ఆ ముగ్గురికి ముందస్తు బెయిల్ నిరాకరణ
82 కోట్ల బడ్జెట్, 4 కోట్ల ఫ్రాడ్- నకిలీ బిల్లులు, దొంగ లెక్కలు- ఆ ముగ్గురికి ముందస్తు బెయిల్ నిరాకరణ

ఈ నాగ్‌జిల్లా ఫ్రాడ్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ముగ్గురు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌ల ముందస్తు బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. సినిమా నిర్మాణంలో టెక్నీషియన్ల సరఫరా, వాహనాల ఏర్పాటు, జూనియర్ ఆర్టిస్టుల చెల్లింపుల్లోనూ భారీగా అవకతవకలు జరిగాయని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.

"ఈ వ్యవహారంలో సమగ్ర విచారణ జరగాలంటే నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉంది" అని అడిషనల్ సెషన్స్ జడ్జి ఎం. మొహియుద్దీన్ వ్యాఖ్యానించారు. నిందితులపై ప్రాథమిక ఆధారాలు ఉన్నందున వారికి ముందస్తు బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేశారు.

రూ. 82.50 కోట్ల బడ్జెట్.. రూ. 3.92 కోట్ల గోల్‌మాల్

కరణ్ జోహార్‌కు చెందిన 'ధర్మ ప్రొడక్షన్స్', మహావీర్ జైన్ నేతృత్వంలోని 'మహావీర్ జైన్ ఫిల్మ్స్' సంయుక్తంగా రూ. 82.50 కోట్ల అంచనా వ్యయంతో 'నాగ్‌జిల్లా' చిత్రాన్ని నిర్మించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ నిర్మాణ పనుల బాధ్యతను కన్సల్టెంట్ కుల్దీప్ సింగ్ చంపావత్ (47)కు అప్పగించారు.

ఆయన సిఫార్సుతో తన బంధువైన మహీపాల్ కరణ్ రాథోడ్ (42)ను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, శివకుమార్ తివారి (45)ని లైన్ ప్రొడ్యూసర్‌గా నియమించారు. మహావీర్ జైన్ ఫిల్మ్స్ అకౌంటెంట్ తుకారాం మహదేవ్ సావంత్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ దగా బయటపడింది.

నిధుల మళ్లింపు మాత్రమే కాకుండా, అనేక రకాలుగా ఈ ముగ్గురూ అక్రమాలకు పాల్పడ్డారు. రూ. 85,000 ఉన్న ఒక వెండర్ బిల్లును ఏకంగా రూ. 1.30 లక్షలకు పెంచి వ్యయాన్ని చూపించారు. సినిమా నిర్మాణానికి ఎలాంటి సేవలు అందించని 'ఏఎన్‌ఎమ్ గ్లోబల్' అనే సంస్థకు రూ. 45,000 చెల్లించినట్లు రికార్డుల్లో రాశారు.

ఒక ప్రొడక్షన్ అసిస్టెంట్‌తో కలిసి రూ. 1.50 లక్షలకు పైగా నకిలీ బిల్లులను సృష్టించి సొమ్మును సొంత ఖాతాల్లోకి మళ్లించినట్లు దర్యాప్తు అధికారి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వెండర్లకు కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు, వారి బిల్లులు క్లియర్ చేసేందుకు నిందితులు ముగ్గురూ భారీగా కమిషన్లు తీసుకోవడమే కాకుండా, ఖరీదైన మొబైల్ ఫోన్లను లంచంగా స్వీకరించారని పోలీసులు తేల్చారు.

ఇచ్ఛాధారి నాగుగా కార్తీక్ ఆర్యన్

ఇదిలా ఉంటే, బాలీవుడ్ యంగ్ స్టార్ కార్తీక్ ఆర్యన్ ఇందులో 'ఇచ్ఛాధారి నాగ్' (రూపం మార్చే పాము) పాత్రలో నటిస్తున్నారు. మృగ్‌దీప్ సింగ్ లాంబ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి గౌతమ్ మెహ్రా కథ అందించారు.

ధర్మ ప్రొడక్షన్స్, మహావీర్ జైన్ ఫిల్మ్స్‌లతో పాటు ఆదార్ పూనావాలా, అపూర్వ మెహతా, నీతూ ఎమ్ జైన్ కూడా ఈ సినిమాకు భాగస్వాములుగా ఉన్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ భారీ బడ్జెట్ సినిమా నిర్మాణంలోనే ఇన్ని అక్రమాలు వెలుగులోకి రావడం చిత్రసీమలో కలకలం రేపింది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks