తమిళం నుంచి మరో వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. అదే ‘నాడు సెంటర్’ సిరీస్. ఇందులో తమిళ అగ్ర నటుడు విజయ్ సేతుపతి వారసుడు సూర్య విజయ్ సేతుపతి కీ రోల్ ప్లే చేశాడు. ఇది బాస్కెట్ బాల్ నేపథ్యంతో స్పోర్ట్స్ డ్రామా సిరీస్ గా తెరకెక్కింది. ఇవాళ (నవంబర్ 20) నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ఈ సిరీస్.
నాడు సెంటర్ ఓటీటీ

తమిళ వెబ్ సిరీస్ ‘నాడు సెంటర్’ ఓటీటీలోకి వచ్చేసింది. జియోహాట్‌స్టార్ స్పెషల్ సిరీస్ గా తెరకెక్కిన ఇది గురువారం నుంచి అదే ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీతో పాటు బెంగాళీ, మరాఠీ భాషల్లోనూ ఈ సిరీస్ అందుబాటులో ఉంది.
యూత్ ఆడియన్స్
పాఠశాలలో ఉండే టీనేజీ అల్లరి, గొడవలు, లవ్ అనే అంశాలు చుట్టూ సాగే సిరీస్ నాడు సెంటర్. ఇందులో బాస్కెట్ బాల్ ను బ్యాక్ డ్రాప్ గా తీసుకున్నారు. ఈ సిరీస్ లో సూర్య ఎస్కే, రెజీనా, జీవా సుబ్రమణియన్, శశికుమార్, సూర్య విజయ్ సేతుపతి తదితరులు నటించారు. దీనికి నారు నారాయణన్ డైరెక్టర్.
నాడు సెంటర్ కథ
టీనేజీ లైఫ్ ను బాస్కెట్ బాల్ తో ముడిపెట్టి చూపించే సిరీస్ నాడు సెంటర్. ఓ పాఠశాలలోని స్టూడెంట్స్ చాలా టఫ్ గా ఉంటారు. అన్ని చెడు అలవాట్లు, గొడవలతో రచ్చ చేస్తుంటారు. మధ్యలో టీనేజీ లవ్ కూడా ఉంటుంది. వీళ్లను దారిలోకి తెచ్చేందుకు, స్కూల్ పరువు కాపాడేందుకు బాస్కెట్ బాల్ టీమ్ రెడీ చేయాలని మేనేజ్ మెంట్ అనుకుంటుంది.
స్కూల్ స్టూడెంట్స్ తో కలిపి ఓ బాస్కెట్ బాల్ టీమ్ తయారు చేస్తారు. ఆటతో వాళ్లలో డిసిప్లేన్ వస్తుంది. అంతే కాకుండా తమల్ని తాము నిరూపించుకోవాలనే కసి మొదలవుతుంది. మరి టీమ్ తయారు చేసుకున్నాక ఏం జరిగింది? గొడవలన్నీ పక్కన పెట్టి జట్టును గెలిపించారా? కోచ్ కథ ఏంటీ? అన్నది సిరీస్ లో చూడాల్సిందే.
ఎందుకు చూడాలంటే?
{{/usCountry}}స్కూల్ స్టూడెంట్స్ తో కలిపి ఓ బాస్కెట్ బాల్ టీమ్ తయారు చేస్తారు. ఆటతో వాళ్లలో డిసిప్లేన్ వస్తుంది. అంతే కాకుండా తమల్ని తాము నిరూపించుకోవాలనే కసి మొదలవుతుంది. మరి టీమ్ తయారు చేసుకున్నాక ఏం జరిగింది? గొడవలన్నీ పక్కన పెట్టి జట్టును గెలిపించారా? కోచ్ కథ ఏంటీ? అన్నది సిరీస్ లో చూడాల్సిందే.
ఎందుకు చూడాలంటే?
{{/usCountry}}ఓటీటీలోకి చాలా సిరీస్ లు, సినిమాలు వస్తూనే ఉన్నాయి. కొత్త కంటెంట్ ను ఆడియన్స్ ఎప్పుడూ ప్రొత్సహిస్తూనే వస్తున్నారు. నాడు సెంటర్ కూడా ఇలా కొత్త కంటెంట్ తో వచ్చిందే. యూత్, తల్లిదండ్రులకు బాగా కనెక్ట్ అవుతుంది ఈ సిరీస్. ఇది ఎమోషనల్, స్పోర్ట్స్ డ్రామా, కమింగ్ ఏజ్ కథాంశాలతో వచ్చిన సిరీస్. స్పోర్ట్స్ తో కుర్రాళ్ల జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తాయని చెప్పడం ప్రధాన ఉద్దేశం.