Nag Ashwin:పుష్పక విమానం ముందే కమల్‌కు స్టోరీ-సింగీతం కల- నాగ్ అశ్విన్ కామెంట్లు- వెరైటీగా సింగ్ గీతం డిలీటెడ్ సాంగ్
Nag Ashwin: లెజెండరీ డైైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన కలల మూవీగా తెరకెక్కిస్తున్న మూవీ ‘సింగ్ గీతం’. ఈ మూవీ ప్రమోషన్లను నాగ్ అశ్విన్ డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. డిలీటెడ్ సాంగ్ అంటూ ఈవెంట్ చేశారు. ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు నాగ్ అశ్విన్.
Nag Ashwin: 94 ఏళ్ల వయసులోనూ అలుపెరగని తపనతో తన కలల సినిమాను తెరకెక్కించేందుకు మెగాఫోన్ పట్టారు సింగీతం శ్రీనివాసరావు. ‘సింగ్ గీతం’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీని తీస్తున్నారు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నాడు. తాజాగా డిలీటెడ్ సాంగ్ అంటూ ఓ వెరైటీ ఈవెంట్ నిర్వహించారు.

నాగ్ అశ్విన్ కామెంట్లు
సింగ్ గీతం సినిమా నుంచి ‘హలో బాసు’ అనే డిలీటెడ్ సాంగ్ ను ఇవాళ (మే 16) లాంఛ్ చేశారు. అయితే సినిమాలో ఉండని ఈ పాటను ఇలా ఈవెంట్ పెట్టి మరీ లాంఛ్ చేయడమే ఇక్కడ వెరైటీ. ఈ పాటను కమెడియన్ వంశీ పాడాడు. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.
పుష్పక విమానం కంటే ముందే
సింగీతం శ్రీనివాస రావు లాంటి దిగ్గజ డైరెక్టర్ సినిమాను ప్రొడ్యూస్ చేయడంపై నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఆయన సినిమాకు ఎంతో చేశారు. తిరిగి ఆయనకు ఎంతో కొంత చేయడం కోసమే ఈ మూవీ తీస్తున్నాం’’ అని నాగ్ అశ్విన్ తెలిపాడు.
‘‘పుష్పక విమానం కంటే ముందే కమల్ హాసన్ కు సింగీతం శ్రీనివాసరావు ఈ స్టోరీ చెప్పారు. ఆల్మోస్ట్ 40 ఏళ్లు అయింది. ఇది ఆయన కల’’ అని నాగ్ అశ్విన్ వెల్లడించాడు.
దేవిశ్రీకి చెప్తే
దేవిశ్రీ ప్రసాద్ ఎంతో కష్టపడి కంపోజ్ చేసిన ‘హలో బాసు’ సాంగ్ ను డిలీట్ చేయడంపై రిపోర్టర్ల ప్రశ్నలకు నాగ్ అశ్విన్ సమాధానమిచ్చాడు. ఈ విషయం తెలిసిన తర్వాత సింగ్ గీతం మూవీ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తనతో మాట్లాడటం లేదని, కాల్ లిఫ్ట్ చేయడం లేదని నాగ్ అశ్విన్ చెప్పాడు.
కల్కి 2 ఎప్పుడంటే?
ప్రభాస్ హీరోగా కల్కి 2 మూవీ తీస్తున్నాడు నాగ్ అశ్విన్. అయితే ఈ మూవీ అప్ డేట్ పై మాత్రం అతను ఎలాంటి కామెంట్ చేయలేదు. రిపోర్టర్లు కల్కి 2 గురించి అడిగితే వినపడట్లేదని నాగ్ అశ్విన్ తప్పించుకున్నాడు.
సింగ్ గీతం రిలీజ్
సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో వస్తున్న సింగ్ గీతం మూవీ జూన్ 11న థియేటర్లకు రాబోతుంది. ఇటీవల రిలీజ్ చేసిన ఈ మూవీ టీజర్ కు అదిరే రెస్పాన్స్ వస్తుంది. ఈ వయసులోనూ సింగీతం శ్రీనివాస రావు తనదైన స్టైల్లో ప్రయోగం చేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


