...
...
Next Story

Naga Chaitanya: డైరెక్టర్ నాకు 100 ప్రశ్నలు పంపించాడు.. ఛాన్స్ ఇవ్వమని నేనే అడిగాను.. నా కెరీర్లోనే బెస్ట్: చైతన్య

నాగ చైతన్య (Naga Chaitanya) నటిస్తున్న లేటెస్ట్ మూవీ వృషకర్మ నుంచి గ్లింప్స్ వీడియో వచ్చిన విషయం తెలుసు కదా. ఈ ఈవెంట్లో చైతూ కుర్చీలో నుంచి కిందపడబోయిన వీడియో వైరల్ అవుతోంది. అంతేకాదు ఈ సినిమా గురించి అతడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Published on: Mar 05, 2026 05:13 PM IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య మరోసారి ఓ భిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈసారి మిస్టికల్ థ్రిల్లర్ స్టోరీ లైన్ తో వస్తున్న వృషకర్మ మూవీలో లీడ్ రోల్ పోషిస్తున్నాడు. ఈ సినిమా తన కెరీర్లోనే బెస్ట్ మూవీ అని అతడు అనడం విశేషం. తండేల్ ను మించి ఉంటుందని స్పష్టం చేశాడు.

డైరెక్టర్ 100 ప్రశ్నలు పంపించాడు

Naga Chaitanya: డైరెక్టర్ నాకు 100 ప్రశ్నలు పంపించాడు.. ఛాన్స్ ఇవ్వమని నేనే అడిగాను.. నా కెరీర్లోనే బెస్ట్: చైతన్య
Naga Chaitanya: డైరెక్టర్ నాకు 100 ప్రశ్నలు పంపించాడు.. ఛాన్స్ ఇవ్వమని నేనే అడిగాను.. నా కెరీర్లోనే బెస్ట్: చైతన్య

వృషకర్మ గ్లింప్స్ వీడియో రిలీజ్ ఈవెంట్ లో నాగ చైతన్య పాల్గొన్నాడు. ఈ సినిమాలో తాను అర్జున్ అనే పాత్ర పోషిస్తున్నానని, ఆ పాత్ర గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లోనే డైరెక్టర్ కార్తీక్ దండు తనకు 100 ప్రశ్నలు పంపించాడని చైతూ చెప్పాడు.

ఆ ప్రశ్నలకు తనను సమాధానాలు రాయమన్నాడని, కార్తీక్ కూడా రాశాడని, ఇద్దరి సమాధానాలు చూసి ఈ పాత్రపై ఎంత వరకూ కనెక్ట్ అయి ఉన్నామో చూద్దామని చెప్పినట్లు చైతన్య తెలిపాడు. అంతలా అర్జున్ పాత్ర గురించి తాము వర్క్ చేసినట్లు తెలిపాడు.

70 శాతం వీఎఫ్ఎక్స్ ఉంటుంది

ఇక వృషకర్మ మూవీలో 70 శాతం వరకు వీఎఫ్ఎక్స్ ఉంటుందని, దీనికోసం భారీగా ఖర్చు చేశారని నాగ చైతన్య తెలిపాడు. తండేల్ తో తన కెరీర్ సెకండ్ ఫేజ్ మొదలైందని, అయితే ఈ వృషకర్మ మాత్రం మరో లెవెల్ అని చెప్పాడు. తండేల్ కు మించి ఎన్నో రెట్లు ఉంటుందని అతడు స్పష్టం చేశాడు.

ఛాన్స్ ఇవ్వమని అడిగాను

వృషకర్మ మూవీ తన కెరీర్లోనే బెస్ట్ మూవీ అవుతుందని ఈ సందర్భంగా చైతన్య తెలిపాడు. ఇలాంటి జానర్ సినిమా చేయాలని తాను ఎప్పటి నుంచో అనుకున్నానని చెప్పాడు. తాను తండేల్ మూవీ చేస్తున్నప్పుడే కార్తీక్ ఇలా వృషకర్మ అనే స్క్రిప్ట్ రాస్తున్నాడని తెలిసిందని, అప్పుడు తానే వెళ్లి ఏదైనా ఛాన్స్ ఉంటే చెప్పమని అడిగానని అన్నాడు. కొన్ని రోజుల తర్వాత వాళ్లే తనకు ఆ అవకాశం ఇచ్చారని, అందుకు థ్యాంక్స్ అని కార్తీక్ తో చైతన్య అన్నాడు.

వృషకర్మ గ్లింప్స్ వీడియో

ఇక ఈ వృషకర్మ గ్లింప్స్ వీడియో రిలీజ్ ఈవెంట్ లో నాగ చైతన్య కింద పడిన వీడియో కూడా వైరల్ అవుతోంది. స్టేజ్ పై వేసిన కుర్చీలో చైతూ కూర్చున్న తర్వాత అది కాస్తా వెనక్కి ఒరిగి అతడు కింద పడిపోయాడు. వెంటనే చుట్టూ ఉన్న వాళ్లు వచ్చి అతన్ని పైకి లేపారు. ఫర్వాలేదులే అంటూ దీనిని అతడు లైట్ తీసుకున్నాడు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe