Naga Chaitanya Bigg Boss 10: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ ఫినాలే ఎపిసోడ్ కు దగ్గరవుతుంది. 12వ వారం వీకెండ్ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. శనివారం ఎపిసోడ్ లో టెంపర్ వంశీ ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఆదివారం ఎపిసోడ్ లో నాగార్జున, నాగ చైతన్య కలిసి ఫన్ అందించారు.
బిగ్ బాస్ లో నాగ చైతన్య

బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో ఇవాళ (నవంబర్ 29) నాగ చైతన్య సందడి చేయబోతున్నారు. వృషకర్మ మూవీ ప్రమోషన్స్ కోసం హీరో నాగ చైతన్య, హీరోయిన్ మీనాక్షి చౌదరి, డైరెక్టర్ కార్తీక్ దండు, ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్ ప్రసాద్ బిగ్ బాస్ స్టేజీ పైకి వచ్చారు. వీళ్లతో హోస్ట్ నాగార్జున కలిసి సందడి చేశారు.
శోభితా మేడం
బిగ్ బాస్ లోని హౌస్ మేట్స్ ఒక్కొక్కరిని స్టేజీపైకి వచ్చిన సెలబ్రిటీలకు నాగార్జున పరిచయం చేశారు. ఈ క్రమంలోనే శివ కుమార్ గురించి చెప్తూ అతను అందరినీ, చివరకు ప్రియాంకను కూడా మేడం అని పిలుస్తాడని నాగ్ చెప్తారు. అప్పుడే ఇంట్లో ఉన్న శోభితాను నువ్వు ఎప్పుడైనా మేడం అని పిలిచావా అని నాగ్ అడిగారు.
అప్పుడప్పుడు మేడం అని పిలవాల్సి వచ్చిందని నాగ చైతన్య చెప్పడంతో అందరూ నవ్వేశారు. ఈ ప్రొమో వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
నరేష్ మాటలకు మీనాక్షి ఫిదా
ఇక జబర్దస్త్ నరేష్ మాటలకు హీరోయిన్ మీనాక్షి చౌదరి ఫిదా అయింది. మీనాక్షి కళ్లలోని సముద్రంలో తాను ముగినిపోతున్నానంటూ నరేష్ చెప్పాడు. ఆ మాటలకు తనలో తానే మురిసిపోతూ మీనాక్షి సిగ్గు పడింది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ తమకు ఇష్టమైన ఫుడ్ కావాలంటే దెయ్యాలు ఉన్న హారర్ రూమ్ లోకి వెళ్లి రావాల్సి ఉంటుందని నాగ్ కండీషన్ పెట్టారు. ఈ సెగ్మెంట్ భలే ఫన్ జనరేట్ చేయనుంది.
డబుల్ ఎలిమినేషన్
{{/usCountry}}ఇక జబర్దస్త్ నరేష్ మాటలకు హీరోయిన్ మీనాక్షి చౌదరి ఫిదా అయింది. మీనాక్షి కళ్లలోని సముద్రంలో తాను ముగినిపోతున్నానంటూ నరేష్ చెప్పాడు. ఆ మాటలకు తనలో తానే మురిసిపోతూ మీనాక్షి సిగ్గు పడింది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ తమకు ఇష్టమైన ఫుడ్ కావాలంటే దెయ్యాలు ఉన్న హారర్ రూమ్ లోకి వెళ్లి రావాల్సి ఉంటుందని నాగ్ కండీషన్ పెట్టారు. ఈ సెగ్మెంట్ భలే ఫన్ జనరేట్ చేయనుంది.
డబుల్ ఎలిమినేషన్
{{/usCountry}}ఈ వారం బిగ్ బాస్ తెలుగు 10 హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. ఇప్పటికే టెంపర్ వంశీ ఎలిమినేట్ అయ్యాడు. ఇవాళ వర్షిణి సౌందరరాజన్ బయటకు వెళ్లిపోతుందని తెలిసింది. ఈ వారం ఆడియన్స్ ఓట్ల ప్రకారం టెంపర్ వంశీ, వర్షిణి లాస్ట్ లో నిలిచారని తెలిసిందే. అందుకే ఈ వారం ఈ ఇద్దరూ ఎలిమినేట్ అయ్యారని తెలిసింది. ఇక నెక్స్ట్ వీక్ కూడా హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని సమాచారం.
ABOUT THE AUTHOR
చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.