...
...
Next Story

నాకు ఉన్న అతిపెద్ద భయం అదే.. మా నాన్న లెగసీ నాకు స్ఫూర్తి.. లవ్ స్టోరీ ఓ ఛాలెంజ్.. త్వరలోనే నిర్మాతగా..: నాగ చైతన్య

అక్కినేని నాగ చైతన్య హిందుస్థాన్ టైమ్స్ కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో తన తండ్రి నాగార్జున వారసత్వం (లెగసీ), తనకున్న అతిపెద్ద భయం, భవిష్యత్తులో నిర్మాతగా మారడం.. ఇలా అనేక విషయాలపై మాట్లాడాడు.

Published on: Feb 17, 2026, 22:08:25 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగ చైతన్య.. తన తండ్రి నాగార్జున లెగసీని (వారసత్వాన్ని) తాను ఎలా చూస్తానో వివరించాడు. అది తనకు బరువు కాదని, స్ఫూర్తి మాత్రమేనని తెలిపాడు. అలాగే నటుడిగా తనకు ఉన్న అతి పెద్ద భయం 'రిపిటీషన్' (ఒకే తరహా పాత్రలు చేయడం) అని, అందుకే వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటానని 'హిందుస్తాన్ టైమ్స్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

"నాన్న లెగసీ నాకు బరువు కాదు.."

నాకు ఉన్న అతిపెద్ద భయం అదే.. మా నాన్న లెగసీ నాకు స్ఫూర్తి.. లవ్ స్టోరీ ఓ ఛాలెంజ్.. త్వరలోనే నిర్మాతగా..: నాగ చైతన్య
నాకు ఉన్న అతిపెద్ద భయం అదే.. మా నాన్న లెగసీ నాకు స్ఫూర్తి.. లవ్ స్టోరీ ఓ ఛాలెంజ్.. త్వరలోనే నిర్మాతగా..: నాగ చైతన్య

2009లో 'జోష్' సినిమాతో వెండితెరకు పరిచయమైన నాగ చైతన్య.. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున వంటి దిగ్గజాల వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. 17 ఏళ్ల తన సినీ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన చైతన్య.. తాజాగా 'హిందుస్తాన్ టైమ్స్' (Hindustan Times)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్, తండ్రి వారసత్వం, భవిష్యత్తు ప్రణాళికల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

అక్కినేని నాగార్జున వంటి స్టార్ హీరో వారసత్వాన్ని మోయడం గురించి అడగగా.. చైతన్య చాలా పరిణతితో సమాధానం ఇచ్చాడు. "నేను మా నాన్నగారి లెగసీని ఒక స్ఫూర్తిగా చూస్తాను తప్ప, పోల్చుకోవడానికి ఒక కొలమానంగా భావించను. అది నాపై భారం కాదు. నాకంటూ ఒక సొంత దారిని ఏర్పరచుకోవడం, నాదైన శైలిలో కథలను చెప్పడమే నా లక్ష్యం" అని చైతన్య స్పష్టం చేశాడు.

కెరీర్ బెస్ట్ సినిమాలు..

తన కెరీర్‌ను వెనక్కి తిరిగి చూసుకుంటే.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'లవ్ స్టోరీ' (Love Story) తనకు అత్యంత సవాలుగా నిలిచిన, అదే సమయంలో సంతృప్తినిచ్చిన చిత్రమని చైతన్య తెలిపాడు. ఈ సినిమా తనలో సంబంధాల పట్ల అవగాహనను పెంచిందన్నారు. అలాగే 'మజిలీ', ‘దూత’, 'తండేల్' వంటి సినిమాలు నటుడిగా తనను తాను మలుచుకోవడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయని చెప్పాడు.

నాకు ఉన్న అతి పెద్ద భయం ఇదే!

ఇటీవలే సిద్ధార్థ్ మల్హోత్రా, బాద్‌షాలతో కలిసి 'సీగ్రామ్స్ రాయల్ స్టాగ్' బ్రాండ్ అంబాసిడర్‌గా చైతన్య ఎంపికయ్యాడు.

నిర్మాతగా మారుతున్న చైతన్య

భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడుతూ.. తనకు దర్శకత్వంపై ఇప్పుడే ఆసక్తి లేదని, కానీ నిర్మాతగా మారాలని ఉందని మనసులో మాట చెప్పాడు. "నిర్మాణంపై నాకు ఆసక్తి ఉంది. వాస్తవానికి త్వరలోనే ఒక సినిమాను నిర్మించే దిశగా పనులు చేస్తున్నాను" అని చైతన్య వెల్లడించాడు. శోభిత ధూళిపాళను పెళ్లి చేసుకున్న చైతన్య.. ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుంచుకునే కథల్లో భాగం కావడమే తన నిజమైన విజయమని పేర్కొన్నాడు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe