...
...
Next Story

Naga Chaitanya: ఆహా.. ఏం ట్విస్టులు.. మైండ్ బ్లాక్ అయింది.. ఇప్పటికీ గూస్‌బంప్స్ వస్తున్నాయి: మలయాళ థ్రిల్లర్‌పై చైతన్య

Naga Chaitanya: మలయాళ థ్రిల్లర్ మూవీ బాలన్ ది బాయ్ రివ్యూ ఇచ్చాడు టాలీవుడ్ స్టార్ నాగ చైతన్య. మంజుమ్మెల్ బాయ్స్ రైటర్ జీతూ మాధవన్, డైరెక్టర్ చిదంబరం కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా తనకు గూస్‌బంప్స్ తెప్పిచ్చిందని అతడు అన్నాడు.

Published on: Jun 18, 2026, 22:12:22 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Naga Chaitanya: మలయాళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న మోస్ట్ అవేటెడ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ 'బాలన్: ది బాయ్' (Balan: The Boy)పై ఉన్న అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య ఈ సినిమాపై చూపించిన ఉత్సాహం, ఆయన ఇచ్చిన రివ్యూ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Naga Chaitanya: ఆహా.. ఏం ట్విస్టులు.. మైండ్ బ్లాక్ అయింది.. ఇప్పటికీ గూస్‌బంప్స్ వస్తున్నాయి: మలయాళ థ్రిల్లర్‌పై చైతన్య
Naga Chaitanya: ఆహా.. ఏం ట్విస్టులు.. మైండ్ బ్లాక్ అయింది.. ఇప్పటికీ గూస్‌బంప్స్ వస్తున్నాయి: మలయాళ థ్రిల్లర్‌పై చైతన్య

ఒక స్పెషల్ స్క్రీనింగ్‌లో బాలన్ ది బాయ్ సినిమా చూసిన నాగ చైతన్య.. మూవీ చూస్తున్నంత సేపు తనకు గూస్‌బంప్స్ వచ్చాయని, ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు ఈ థ్రిల్లర్ ఎక్స్‌పీరియన్స్ విపరీతంగా నచ్చేస్తుందని గట్టి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను అక్కినేని వారి హోమ్ బ్యానర్ 'అన్నపూర్ణ స్టూడియోస్' తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్రాండ్ గా విడుదల చేస్తోంది.

చైతూ ఎమోషనల్.. అసలు ఏం చెప్పారంటే?

బాలన్ ది బాయ్ సినిమా చూసిన తర్వాత నాగ చైతన్య ఒక ప్రత్యేక జూమ్ కాల్ ద్వారా మూవీ రైటర్ జీతూ మాధవన్, డైరెక్టర్ చిదంబరంతో తన అభిప్రాయాలను పంచుకున్నారు.

"నిజం చెప్పాలంటే సినిమా చూసి బయటకు వచ్చినా కూడా అది నన్ను వదిలిపెట్టడం లేదు. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా నాకు గూస్‌బంప్స్ వస్తున్నాయి. ఈ సినిమా నిండా ఊహించని సర్ ప్రైజ్ లు ఉన్నాయి. హాయ్ జీతూ మాధవన్.. మొదట నేను ఇదొక తల్లీకొడుకుల సెంటిమెంట్ డ్రామా అనుకున్నాను, ఒక మంచి ఫ్యామిలీ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది. కానీ ఓ మై గాడ్! మొదటి 10-15 నిమిషాల తర్వాత కథ అస్సలు ఊహించని మలుపు తిరిగింది. అక్కడి నుంచి సినిమా ఏ రేంజ్ లో ట్రాక్ మార్చిందో నేను అస్సలు ఊహించలేదు" అంటూ చైతూ చెప్పుకొచ్చారు.

బాలన్: ది బాయ్ మూవీ విశేషాలు

- ప్రెజెంటర్ (తెలుగు): అన్నపూర్ణ స్టూడియోస్

- థియేట్రికల్ రిలీజ్ డేట్: జూన్ 19 (రేపే గ్రాండ్ రిలీజ్)

- మేజర్ హైలైట్: నాగ చైతన్య, ప్రియదర్శన్ లీక్ చేసిన మైండ్ బెండింగ్ స్క్రీన్‌ప్లే

మంజుమ్మెల్ బాయ్స్, ఆవేశం లిస్ట్‌లోకి ఈ సినిమా కూడా..

నాగ చైతన్య డైరెక్టర్‌ చిదంబరంను ప్రశంసిస్తూ.. "ప్రేక్షకులు థియేటర్లకు ఎలాంటి ముందస్తు అంచనాలు లేకుండా క్లీన్ మైండ్‌తో వస్తారు. కానీ లోపల జరిగేది చూసి కచ్చితంగా షాక్ అవుతారు. జీతూ.. నీ పాత సినిమాలు 'మంజుమ్మెల్ బాయ్స్', 'ఆవేశం' తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి సంచలన విజయాలు సాధించి రాక్‌స్టార్స్‌లా నిలిచాయో మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈ 'బాలన్: ది బాయ్' సినిమా కూడా కచ్చితంగా ఆ బ్లాక్‌బస్టర్ లిస్ట్‌లో చేరిపోతుంది. ఇందులో రాసిన కథను ఎవరూ ఊహించలేరు. స్క్రీన్‌ప్లే కారణంగా స్క్రీన్ మీద అస్సలు ఊహించని విచిత్రాలు జరుగుతాయి. రైటింగ్, విజువల్స్, మ్యూజిక్ అన్నీ పర్ఫెక్ట్‌గా కుదిరాయి" అంటూ చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్ తెలియజేశారు.

ఇండస్ట్రీ దిగ్గజాల ప్రశంసలు.. రేపే అసలైన పరీక్ష

కేవలం నాగ చైతన్య మాత్రమే కాదు, ఇండియన్ సినిమా లెజెండరీ డైరెక్టర్ ప్రియదర్శన్ సైతం ఈ సినిమాను రీసెంట్‌గా చూసి.. గత రెండేళ్లలో తాను చూసిన బెస్ట్ ఇండియన్ సినిమాల్లో ఇది ఒకటని కొనియాడారు. ఇటు ప్రియదర్శన్ లాంటి సీనియర్ మేధావి, అటు నాగ చైతన్య లాంటి యూత్ స్టార్ ఇద్దరూ సినిమాలోని ట్విస్టులు, స్టోరీ టెల్లింగ్ విధానాన్ని ఆకాశానికెత్తడంతో ఈ మూవీపై ట్రేడ్ వర్గాల్లో భారీ క్రేజ్ ఏర్పడింది.

ఈ అద్భుతమైన రెస్పాన్స్‌తో అన్నపూర్ణ స్టూడియోస్ వారు రేపు (జూన్ 19న) ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. మరి మలయాళంలో హిస్టరీ క్రియేట్ చేసిన జీతూ మాధవన్, చిదంబరం.. ఈ సరికొత్త మిస్టరీ థ్రిల్లర్‌తో తెలుగు ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పిస్తారో రేపు తేలిపోనుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe