...
...
Next Story

నేను, ఎన్టీఆర్ ఆయనను నమ్మి మోసపోయాం.. తప్పు జరిగింది.. కాస్త ఎక్కువే చెప్పాను.. దొరికిపోయాను: వార్ 2 ఫలితంపై నాగవంశీ

ప్రొడ్యూసర్ నాగ వంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన తొలి బాలీవుడ్ మూవీ వార్ 2 దారుణంగా బోల్తా పడటంపై అతడు మాస్ జాతర ప్రమోషన్లలో భాగంగా స్పందించాడు. ఆదిత్య చోప్రాను నమ్మి మోసపోయామన్నట్లుగా అతడు మాట్లాడాడు.

Published on: Oct 21, 2025, 18:22:56 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వార్ 2. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా బొక్కబోర్లా పడింది. ఈ సినిమా తెలుగు రైట్స్ తీసుకున్న ప్రొడ్యూసర్ నాగవంశీ మూవీ ఫెయిల్యూర్ పై మొత్తానికి స్పందించాడు. తప్పు చేశాం.. కాస్త ఎక్కువగా ఎగ్జైట్ అయిపోయి దొరికిపోయాను అని అనడం గమనార్హం.

నాగ వంశీతో ఆడుకున్న రవితేజ

నేను, ఎన్టీఆర్ ఆయనను నమ్మి మోసపోయాం.. తప్పు జరిగింది.. కాస్త ఎక్కువే చెప్పాను.. దొరికిపోయాను: వార్ 2 ఫలితంపై నాగవంశీ
నేను, ఎన్టీఆర్ ఆయనను నమ్మి మోసపోయాం.. తప్పు జరిగింది.. కాస్త ఎక్కువే చెప్పాను.. దొరికిపోయాను: వార్ 2 ఫలితంపై నాగవంశీ

రవితేజతో ప్రస్తుతం మాస్ జాతర మూవీని నాగ వంశీ తీసిన విషయం తెలుసు కదా. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇద్దరూ కలిసి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా వార్ 2 మూవీ ప్రస్తావన వచ్చింది. అప్పుడు నాగ వంశీ స్పందించిన తీరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ వార్ 2 ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగిన సందర్భంగా తాను మరీ ఎక్కువ ఎగ్జైట్ అయిపోయి చెప్పిన మాటలను కూడా అతడు గుర్తు చేసుకున్నాడు.

కొంచెం ఎగ్జైట్ అయ్యా నేను అని నాగ వంశీ అనగానే.. బాగా అయ్యావ్.. ఒకరకంగా వార్నింగ్ ఇచ్చినట్లుగా ఉంది అని రవితేజ అనడం విశేషం. నా కొడకల్లారా రాకపోతే చెప్తా మీ పని అని కూడా రవితేజ అన్నాడు. అప్పుడు నాగ వంశీ నవ్వుతూ తాము తప్పు చేసినట్లు అంగీకరించాడు.

ఆయనను నమ్మి మోసపోయాం

ఈ సందర్భంగా నాగ వంశీ మాట్లాడుతూ.. “తప్పులు చేయకుండా ఉండం కదా.. తప్పు జరిగింది ఏం చేద్దాం.. నేనైనా, ఎన్టీఆర్ అయినా ఆదిత్య చోప్రా అనే పెద్ద మనిషిని నమ్మాము.. అందరూ తప్పులు చేస్తారు కదా.. వాళ్లసైడు తప్పు జరిగింది.. మనం దొరికామంతే ఏం చేస్తాం.. వాళ్లను నమ్మాం.. ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ ను నమ్మాం.. మిస్ ఫైర్ అయింది.. ఏసుకున్నారు.. పడ్డాం అంతే.. పోనీలే మనం తీసిన సినిమాతో కాకుండా బయటి వాళ్లు తీసిన సినిమాతో దొరికాం.. హ్యాపీ” అని అన్నాడు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks