...
...
Next Story

ఈ మాటకు నన్ను పచ్చిబూతులు తిడతారు.. ఆ మలయాళం సినిమాను నేనే తెలుగులో రిలీజ్ చేశా.. తెలుగులో తీస్తే తిట్టేవాళ్లు: నాగవంశీ

మలయాళ బ్లాక్‌బస్టర్ మూవీ లోకా: ఛాప్టర్ 1 చంద్రపై ప్రొడ్యూసర్ నాగ వంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ సినిమాను నేరుగా తెలుగులో తీసి ఉంటే అది బాలేదు, ఇది బాలేదు అని ఏదేదో అనేవాళ్లని అతడు అన్నాడు.

Published on: Oct 22, 2025, 17:02:31 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

టాలీవుడ్ నిర్మాత నాగవంశీ, నటుడు రవితేజ కలిసి తమ రాబోయే మూవీ మాస్ జాతర ప్రమోషనల్ వీడియోను రిలీజ్ చేసిన విషయం తెలుసు కదా. ఈ సందర్భంగా వాళ్లు మలయాళ సూపర్ హీరో మూవీ లోకా: ఛాప్టర్ 1 – చంద్ర విజయం గురించి మాట్లాడారు. ఆ సినిమా నేరుగా తెలుగులో వచ్చి ఉంటే అంత విజయం సాధించేది కాదని షాకింగ్ కామెంట్స్ చేశారు.

పచ్చి బూతులు తిడతారు

ఈ మాటకు నన్ను పచ్చిబూతులు తిడతారు.. ఆ మలయాళం సినిమాను నేనే తెలుగులో రిలీజ్ చేశా.. తెలుగులో తీస్తే తిట్టేవాళ్లు: నాగవంశీ
ఈ మాటకు నన్ను పచ్చిబూతులు తిడతారు.. ఆ మలయాళం సినిమాను నేనే తెలుగులో రిలీజ్ చేశా.. తెలుగులో తీస్తే తిట్టేవాళ్లు: నాగవంశీ

నాగ వంశీ ప్రొడ్యూస్ చేసిన మాస్ జాతర మూవీ అక్టోబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్లలో వాళ్లు బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఇందులో వార్ 2 మూవీ గురించి నాగ వంశీ చేసిన కామెంట్స్ వైరల్ కాగా.. మలయాళ బ్లాక్‌బస్టర్ లోకా గురించి కూడా అతడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

తెలుగు ఇండస్ట్రీలో మలయాళం లేదా తమిళ సినిమాల మాదిరిగా కంటెంట్ డ్రివెన్ మూవీస్ రావడం లేదనే అభిప్రాయంపై నాగవంశీని ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. దానికి అతడు బదులిస్తూ.. "నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఈ మాట చెబితే నన్ను బండ బూతులు తిడతారు. నేనే లోకా సినిమాను తెలుగులో విడుదల చేశాను. కానీ ఒకవేళ లోకా నేరుగా తెలుగులో వచ్చినట్టైతే, ప్రేక్షకులు దాని గురించి ఏదేదో అనేవారు. అది నాసిరకం సినిమా, క్వాలిటీ లేదు అని చెబుతుండేవారు. అలా జరగకపోతే నేను నా పేరు మార్చుకుంటాను" అని నాగవంశీ సవాల్ విసిరాడు.

లిటిల్ హార్ట్స్‌పై ఇలా..

తెలుగు ప్రేక్షకులు దేన్ని ఇష్టపడతారో అంచనా వేయడం కష్టంగా మారిందని ఈ నిర్మాత అన్నాడు. మౌళి నటించిన లిటిల్ హార్ట్స్ సినిమాను ఉదాహరణగా చూపించాడు. "తెలుగు ప్రేక్షకులు ఎలా తయారయ్యారంటే, మనం ఎప్పుడూ ఒక అంచున ఉన్నట్లు అనిపిస్తుంది. లిటిల్ హార్ట్స్ సినిమా చూడండి, దానిలో నటీనటులు, క్రూ ఎవరికీ తెలియదు. కానీ ప్రీమియర్‌లకు మంచి బుకింగ్స్ వచ్చాయి. ఇప్పుడు వారు ఏం చూడాలనుకుంటున్నారో ఎవరూ అంచనా వేయలేరు" అని నాగవంశీ అభిప్రాయపడ్డాడు.

ఈ సినిమా కొత్త లోక పేరుతో తెలుగులో రిలీజైంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లు వసూలు చేసిన మొదటి మలయాళ చిత్రంగా నిలిచింది. తెలుగులోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇండియాలో లోకా మూవీకి రూ.156 కోట్ల నెట్ వసూళ్లు రాగా.. అందులో రూ.122.06 కోట్లు మలయాళ వెర్షన్ నుంచి, రూ.16.51 కోట్లు తమిళం నుంచి, రూ.13.76 కోట్లు తెలుగు నుంచి, రూ.3.75 కోట్లు హిందీ నుంచి వచ్చాయి.

డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన, దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ మూవీ ఒక సినిమాటిక్ యూనివర్స్‌లో మొదటిది. కళ్యాణి ప్రియదర్శన్ ఈ సినిమాలో ఓ సూపర్ హీరో పాత్ర పోషించింది. టోవినో థామస్ అతిథి పాత్రలో కనిపించాడు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe