Balakrishna Koratala Siva: నందమూరి నటసింహం బాలకృష్ణ, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'NBK112' (బాలకృష్ణ 112వ చిత్రం) అఫీషియల్ లాంచ్ ఈవెంట్‌కు ముహూర్తం ఖరారైంది. ఈ ప్రతిష్టాత్మక చిత్ర ప్రారంభోత్సవ వేడుకను జూన్ 25న విజయవాడలో అత్యంత వైభవంగా నిర్వహించడానికి మేకర్స్ సర్వసిద్ధం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరై, సినిమా మొదటి సీన్‌కు క్లాప్ కొట్టబోతున్నారు. ఇక ఆయనతోపాటు మరో మంత్రి కందుల దుర్గేష్ కూడా రాబోతున్నారు. దీనికి సంబంధించిన ఇన్విటేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజధాని ప్రాంతమైన అమరావతి సమీపంలోని వెంకటపాలెంలో ఉన్న టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ వేడుక జరగనుంది.
బాలయ్య మాస్ ఇమేజ్.. కొరటాల సోషల్ మెసేజ్
నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్ మాస్ అప్పీల్, డైరెక్టర్ కొరటాల శివ మార్క్ సామాజిక బాధ్యతతో కూడిన కథల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'మిర్చి', 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్', 'దేవర' లాంటి ఇండస్ట్రీ హిట్లతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న కొరటాల శివ.. మొదటిసారి బాలయ్య బాబును డైరెక్ట్ చేయబోతుండటంతో అంచనాలు అప్పుడే ఆకాశాన్ని తాకాయి.
బాలకృష్ణ పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీకి, కొరటాల రాసే పదునైన సామాజిక సందేశం తోడైతే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే సోషల్ మీడియాలో దీనిపై విపరీతమైన బజ్ నడుస్తోంది.
విజయవాడలో నారా లోకేష్ హంగామా
ఈ సినిమా ముహూర్తపు వేడుకను కేవలం సినీ ప్రముఖుల మధ్యే కాకుండా, రాజకీయ ప్రాధాన్యత ఉన్న విజయవాడ నగరంలో ప్లాన్ చేయడం వెనుక ఒక పెద్ద స్ట్రాటజీ ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్.
{{/usCountry}}ఈ సినిమా ముహూర్తపు వేడుకను కేవలం సినీ ప్రముఖుల మధ్యే కాకుండా, రాజకీయ ప్రాధాన్యత ఉన్న విజయవాడ నగరంలో ప్లాన్ చేయడం వెనుక ఒక పెద్ద స్ట్రాటజీ ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్.
{{/usCountry}}ఏపీ మినిస్టర్, బాలకృష్ణ అల్లుడు నారా లోకేష్ ఈ చిత్ర ప్రారంభోత్సవానికి చీఫ్ గెస్ట్‌గా రానుండటంతో ఈ ఈవెంట్‌కు పొలిటికల్ గా కూడా భారీ గ్లామర్ రాబోతోంది. బాలకృష్ణ కొత్త సినిమాకు లోకేష్ క్లాప్ కొట్టబోయే విజువల్స్ నందమూరి, నారా అభిమానులకు ఒక పండుగలా మారనున్నాయి.
కమర్షియల్ హంగులతో పవర్‌ఫుల్ సబ్జెక్ట్
సినీ వర్గాల లీక్స్ ప్రకారం.. కొరటాల శివ ఈ సినిమా కోసం ఒక బలమైన కమ్యూనిటీ బ్యాక్‌డ్రాప్ ఉన్న సబ్జెక్టును సిద్ధం చేశారట. సమాజంలో జరిగే కొన్ని అన్యాయాలపై ఒక సామాన్యుడు తిరగబడితే ఎలా ఉంటుంది, దానికి బాలయ్య మార్క్ యాక్షన్ ఎలిమెంట్స్ తోడైతే స్క్రీన్ ఏ రేంజ్ లో షేక్ అవుతుంది అనే కాన్సెప్ట్‌తో స్క్రీన్‌ప్లే రాసుకున్నట్లు టాక్.
ఈ చిత్రంలో నటించబోయే హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను జూన్ 25న జరిగే ఓపెనింగ్ రోజునే అధికారికంగా ప్రకటించనున్నారు. బాలకృష్ణ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మాస్ ఓపెనర్ లలో ఒకటి కానుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.