...
...
Next Story

Nandamuri Tejaswini: కొడుకు కాదు కూతురు.. హిస్టరీ క్రియేట్ చేయబోతున్న నందమూరి తేజస్విని.. వైరల్ గా బాలకృష్ణ కుమార్తె!

Nandamuri Tejaswini: నటసింహం నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని హిస్టరీ క్రియేట్ చేయబోతుందా? నందమూరి వంశం నుంచి ఫస్ట్ హీరోయిన్ గా నిలబోతుందా? అంటే.. అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. తేజస్విని హీరోయిన్ గా డెబ్యూకు రంగం రెడీ అవుతుందనే ప్రచారం హాట్ టాపిక్ గా మారింది.

Published on: Aug 1, 2026, 19:40:54 IST
Advertisement

Nandamuri Tejaswini: తెలుగు చిత్రసీమలో నందమూరి కుటుంబానికి ఉన్న క్రేజ్, అభిమానం ప్రత్యేకమైనవి. ఈ ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలు వచ్చారు. కానీ ఇప్పటివరకూ ఒక్క హీరోయిన్ కూడా లేదు. తాజాగా ఆ రికార్డును నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని సొంతం చేసుకోబోతుందనే టాక్ తెగ వైరల్ గా మారింది.

హీరోయిన్ గా నందమూరి తేజస్విని

Nandamuri Tejaswini: కొడుకు కాదు కూతురు.. హిస్టరీ క్రియేట్ చేయబోతున్న నందమూరి తేజస్విని.. వైరల్ గా బాలకృష్ణ కుమార్తె! (x/Tejeswini_M)
Nandamuri Tejaswini: కొడుకు కాదు కూతురు.. హిస్టరీ క్రియేట్ చేయబోతున్న నందమూరి తేజస్విని.. వైరల్ గా బాలకృష్ణ కుమార్తె! (x/Tejeswini_M)

తాజాగా ఫిలిం నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న ఒక వార్త నందమూరి అభిమానులను తీవ్ర ఆశ్చర్యానికి, ఆనందానికి గురిచేస్తోంది. నటసింహం నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని (Nandamuri Tejaswini) త్వరలోనే కథానాయికగా వెండితెరపై అడుగుపెట్టబోతున్నారనే ప్రచారం జోరందుకుంది.

స్పోర్ట్స్ డ్రామాతో

సాధారణ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా, ఒక మంచి సామాజిక సందేశం ఉన్న స్పోర్ట్స్ డ్రామా (Sports Drama) ద్వారా నందమూరి తేజస్విని సినీ ఎంట్రీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కథా చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని అంటున్నారు.

సోషల్ మీడియా స్టార్‌డమ్

గత కొంతకాలంగా తేజస్విని సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్‌గా కనిపిస్తోంది. డాన్స్ రీల్స్, బ్రాండ్ ప్రమోషన్లు, యాడ్స్‌లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన డిజిటల్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. ఆమె డ్యాన్స్ రీల్స్ తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

డెబ్యూపై అంచనాలు

నందమూరి తేజస్విని గ్లామర్, ఫ్యాషన్ సెన్స్, కాన్ఫిడెంట్ స్క్రీన్ ప్రెజెన్స్ చూసిన అభిమానులు.. ఆమె సినిమాలో నటిస్తే బాగుంటుందని చాలా కాలంగా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు రొటీన్ లవ్ స్టోరీ లేదా కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఎంచుకోకుండా, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో కూడిన ఇంటెన్స్ ఎమోషనల్ కథను ఎంచుకోవడం ఆమె డెబ్యూపై అంచనాలను పెంచుతోంది.

మోక్షజ్ఞ కంటే ముందే

అదే గనుక నిజమైతే, నందమూరి తర్వాతి తరం నుంచి మోక్షజ్ఞ కంటే ముందే నటిగా వెండితెరపైకి వచ్చిన మొదటి ఫ్యామిలీ మెంటర్ గా తేజస్విని చరిత్ర సృష్టిస్తుంది. ఇది నందమూరి కాంపౌండ్‌లోనే ఒక వినూత్నమైన మలుపని చెప్పొచ్చు.

చర్చల దశలో

ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ చర్చల దశలోనే ఉందని సమాచారం. అయితే దీనిపై మేకర్స్ నుంచి కానీ, నందమూరి కాంపౌండ్ నుంచి కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. రాబోయే కొద్ది నెలల్లో ఈ చర్చలు కొలిక్కి వస్తే, సినిమాకు సంబంధించిన అధికారిక వివరాలను ప్రకటించే అవకాశం ఉంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks