OTT Today: ఇవాళ ఓటీటీలోకి నాలుగు క్రేజీ సినిమాలు-రెండు ప్లాట్‌ఫామ్స్‌లో-హార‌ర్ థ్రిల్ల‌ర్ నుంచి స్పోర్ట్స్ డ్రామా వ‌ర‌కు

OTT Today: ఫ్రైడే వచ్చిందంటే ఓటీటీలో సందడి మామూలుగా ఉండదు. కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఇవాళ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ తో డిజిటల్ లవర్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేశాయి. ఇందులో ఈ నాలుగు క్రేజీ సినిమాలు స్పెషల్ గా ఉన్నాయి. 

Published on: May 1, 2026, 10:20:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Today: శుక్రవారం అటు బాక్సాఫీస్, ఇటు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కళకళలాడుతుంటాయి. ఈ రోజు (మే 1) కూడా ఆ సందడి ఉంది. థియేటర్లో కొత్త సినిమాలు రిలీజ్ కాగా.. ఓటీటీలో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ డెబ్యూ చేసేశాయి. ఇందులో ఈ నాలుగు సినిమాలు స్పెషల్ గా ఉన్నాయి. అవే.. రాకాస, బైకర్, ది కేరళ స్టోరీ 2, ఆడు 3.

ఓటీటీలో నాలుగు క్రేజీ సినిమాలు (x)
ఓటీటీలో నాలుగు క్రేజీ సినిమాలు (x)

రెండు ఓటీటీల్లో

శుక్రవారం ఓటీటీలోకి చాలానే సినిమాలు వచ్చాయి. ఇందులో రాకాస, బైకర్, ది కేరళ స్టోరీ 2, ఆడు 3 మాత్రం స్పెషల్ గా ఉన్నాయి. ఈ నాలుగు సినిమాలు రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. తెలుగు సినిమాలైన రాకాస, బైకర్ ఏమో నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యాయి. హిందీ మూవీ ది కేరళ స్టోరీ 2, మలయాళ చిత్రం ఆడు 3 ఏమో జీ5 ఓటీటీలో అడుగుపెట్టాయి. ది కేరళ స్టోరీ 2, ఆడు 3 కూడా తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

బ్లాక్ బస్టర్

తెలుగులో బ్లాక్ బస్టర్ గా నిలిచిన హారర్ థ్రిల్లర్ ‘రాకాస’ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. రూ.15 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.27 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

స్పోర్ట్స్ డ్రామా

శర్వానంద్ హీరోగా వచ్చిన స్పోర్ట్స్ డ్రామా బైకర్ కూడా ఓటీటీ డెబ్యూ చేసింది. ఇండియాలోనే ఫస్ట్ మోటో క్రాస్ మూవీగా ఇది థియేటర్లలో విడుదలైంది. మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ బైకర్ చివరకు మంచి ఫలితాన్నే ఖాతాలో వేసుకుంది. ఇందులో శర్వానంద్ తో పాటు మాళవిక నాయర్, సీనియర్ హీరో రాజశేఖర్ తదితరులు నటించారు.

ది కేరళ స్టోరీ 2

థియేట్రికల్ రిలీజ్ కంటే ముందే కాంట్రవర్సీ క్రియేట్ చేసిన ది కేరళ స్టోరీ 2 మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. లవ్ జిహాద్, బలవంతపు మత మార్పిడి లాంటి విషయాలు చుట్టూ సాగే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కేరళం ప్రతిష్ఠను దిగజార్చేలా ఈ మూవీ ఉందనే విమర్శలు వచ్చాయి.

ఆడు 3

మలయాళం బ్లాక్ బస్టర్ ఫాంటసీ కామెడీ మూవీ ఆడు 3. బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఈ చిత్రం ఈ రోజు డిజిటల్ లవర్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చింది. సూపర్ హిట్ ‘ఆడు’ సిరీస్ లో వచ్చిన మూడో చిత్రం ఇది. ఇందులో జయసూర్య, వినాయకన్ కీలక పాత్రలు పోషించారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More