...
...
Next Story

OTT Today: 23 రోజుల్లో పెళ్లి.. అమ్మాయి మనసు మారుస్తానని ఛాలెంజ్.. ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ

OTT Today: సండే స్పెషల్ గా ఓ తెలుగు సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. హార్ట్ టచింగ్ ఎలిమెంట్స్ తో ఫీల్ గుడ్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతోంది. పెళ్లి కోసం ఓ అమ్మాయిని అబ్బాయి ఎలా ఒప్పించాడనే కథ చుట్టూ ఈ చిన్న సినిమా తిరుగుతుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూసేయండి.

Published on: Aug 30, 2026, 15:15:20 IST
Advertisement

OTT Today: ప్రతి ఆదివారం ఓ చిన్న సినిమాతో ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్. కథా సుధ వీక్లీ సిరీస్ లో భాగంగా ఇవాళ (ఆగస్టు 30) ‘నందిని’ మూవీని డిజిటల్ స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది. ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీ విశేషాలపై ఓ లుక్కేయండి.

ఈటీవీ విన్ కథాసుధ

23 రోజుల్లో పెళ్లి.. అమ్మాయి మనసు మారుస్తానని ఛాలెంజ్.. ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ
23 రోజుల్లో పెళ్లి.. అమ్మాయి మనసు మారుస్తానని ఛాలెంజ్.. ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ

పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ డిఫరెంట్ కంటెంట్ తో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తూనే ఉంది. ఒరిజినల్ సిరీస్ లు, సినిమాలతో సబ్ స్క్రైబర్స్ ను పెంచుకుంటోంది. అదే క్రమంలో కథాసుధ సిరీస్ లో ప్రతి సండే ఓ షార్ట్ ఫిల్మ్ ను రిలీజ్ చేస్తోంది.

నందిని మూవీ

ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో కథాసుధ వీక్లీ సిరీస్ లో భాగంగా ‘నందిని’ మూవీ ఇవాళ డైరెక్ట్ గా డిజిటల్ డెబ్యూ చేసింది. ఈ సినిమాకు దిగ్గజ దర్శకుడు కె.రాఘవేంద్రరావు సమర్పకుడిగా వ్యవహరించడం విశేషం. ఇందులో ఆకాంక్ష, పవన్ సింగులూరి, మీనా వాసు, శరణ్య, నళిని దేవి, రమా, శరత్ చంద్ర తదితరులు నటించారు.

ఈ నందిని సినిమాకు రామారావు సిరిపురం డైరెక్టర్. కథ కూడా ఆయనే అందించారు. సాయి కార్తీక్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించారు. వెంకట్ తళారి నిర్మించారు.

స్టోరీ ఏంటంటే?

నందిని మూవీ ఓ యూత్ ఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కింది. కాలేజీ రోజుల నుంచి నందినిని శివ ప్రేమిస్తాడు. కానీ ఆ మాటను డైరెక్ట్ గా చెప్పలేకపోతాడు. పెద్దలను ఒప్పించి పెళ్లి చూపులు అరెంజ్ చేస్తాడు. శివ, నందిని పెళ్లికి పెద్దలు ఒప్పుకొంటారు. కానీ నందిని మాత్రం ఈ పెళ్లికి రెడీగా ఉండదు.

నందిని మూవీని సండే ఇంట్లో కూర్చుని ఫ్యామిలీతో హాయిగా చూసేయొచ్చు. పైగా ఇది కేవలం 38 నిమిషాల్లోనే కంప్లీట్ అవుతుంది. సో సండే రోజు కంప్లీట్ ఫ్యామిలీకి ఓటీటీలో ఇది బెస్ట్ స్ట్రీమింగ్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks