...
...
Next Story

Nandini Reddy: పెద్దిలో జాన్వీ వివాదం.. సమంత మా ఇంటి బంగారం కలెక్షన్లు.. నచ్చకపోతే రిజెక్ట్ చేయండన్న నందినీ రెడ్డి

Nandini Reddy: కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రల చుట్టూ తిరిగే వివాదాలు టాలీవుడ్‌లో ఎప్పుడూ హాట్ టాపికే. గత నెల ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ గ్లామర్ షోపై విమర్శలు వచ్చాయి. దానికి భిన్నంగా సమంత ‘మా ఇంటి బంగారం’ రికార్డు వసూళ్లు సాధించింది. ఈ చర్చపై నందినీ రెడ్డి ఏమన్నారో ఇక్కడ చూసేయండి.

Published on: Jul 8, 2026, 10:21:07 IST
Advertisement

Nandini Reddy: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కమర్షియల్ సక్సెస్ వర్సెస్ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల మధ్య ఎప్పుడూ ఒక డిబేట్ నడుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్లను కేవలం గ్లామర్ బొమ్మలుగా చూపించడంపై (Objectification) ఈ మధ్య కాలంలో విమర్శలు ఎక్కువయ్యాయి. హిందూస్థాన్ టైమ్స్‌తో ఇంటర్వ్యూలో దీనిపై డైరెక్టర్ నందనీ రెడ్డి రియాక్టయ్యారు.

జాన్వీ కపూర్ వివాదం

హిందూస్థాన్ టైమ్స్‌తో ఇంటర్వ్యూలో నందినీ రెడ్డి కామెంట్లు
హిందూస్థాన్ టైమ్స్‌తో ఇంటర్వ్యూలో నందినీ రెడ్డి కామెంట్లు

జూన్ 4న విడుదలైన ‘పెద్ది’ (Peddi) సినిమాలో జాన్వీ కపూర్ పాత్రను డిజైన్ చేసిన విధానంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచినప్పటికీ, ఉమెన్ ఆబ్జెక్టిఫికేషన్ వివాదం మాత్రం గట్టిగానే నడిచింది.

మా ఇంటి బంగారం

సరిగ్గా ఈ వివాదం నడుస్తున్న సమయంలోనే జూన్ 19న విడుదలైన సమంత రూత్ ప్రభు యాక్షన్ డ్రామా ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaaram) బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. కేవలం లేడీ ఓరియెంటెడ్ కంటెంట్‌తోనే ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ.95 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

ఈ పెద్ది, మా ఇంటి బంగారం సినిమాల కంటెంట్, కమర్షియల్ ఈక్వేషన్లపై టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ నందినీ రెడ్డి హిందూస్థాన్ టైమ్స్‌ ఇంటర్వ్యూలో మాట్లాడింది.

మార్పు రావాల్సింది ఆడియన్స్‌లోనే

"ప్రేక్షకులు ఏ సినిమాను చూస్తున్నారు, థియేటర్లకు వెళ్లి ఏ తరహా కథలను సక్సెస్ చేస్తున్నారనే దానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది. సినిమా అనేది అల్టిమేట్‌గా ఒక బిజినెస్. ఇక్కడ మేకర్స్ ఎప్పుడూ కస్టమర్ (ఆడియన్స్) మాటనే వింటారు’’ అని నందినీ రెడ్డి చెప్పారు.

రిజెక్ట్ చేయండి

‘‘మీకు స్క్రీన్ పై చూసే కంటెంట్ లేదా మహిళల పాత్రల ఆబ్జెక్టిఫికేషన్ నచ్చకపోతే, అలాంటి సినిమాలను రిజెక్ట్ చేయండి. అదే సమయంలో మీకు నచ్చిన ఉమెన్-ఓరియెంటెడ్ సినిమాలు వస్తే.. కచ్చితంగా థియేటర్లకు వెళ్లి చూడండి. అప్పుడే ఇండస్ట్రీ రూట్ మారుస్తుంది" అని నందినీ రెడ్డి పేర్కొన్నారు.

హాలీవుడ్ ‘బార్బీ’ సెంటిమెంట్

ఫ్యామిలీ ఆడియన్స్, ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు థియేటర్ల నుంచి దూరం అవుతున్నారనే ఇండస్ట్రీ అపోహను ‘మా ఇంటి బంగారం’ పటాపంచలు చేసిందని నందినీ రెడ్డి విశ్లేషించారు. గ్లోబల్ బ్లాక్‌బస్టర్ ‘బార్బీ’ విజయాన్ని ఉదాహరణగా చూపిస్తూ.. మహిళలు కనుక నమ్మి థియేటర్లకు వస్తే బాక్సాఫీస్ నంబర్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో సమంత ముందే ఊహించిందని ఆమె గుర్తు చేశారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks