Nani Bloody Romeo: నాని న్యూ లుక్ సెన్సేషన్.. సుజీత్ మోడ్రన్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా బ్లడీ రోమియో.. మేకోవర్ వీడియో వైరల్!

Nani Bloody Romeo: ది ప్యారడైజ్ మూవీతో బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టిన నాని తన నెక్స్ట్ మూవీ కోసం రెడీ అవుతున్నారు. సుజీత్ డైరెక్షన్ లో ఆయన ‘బ్లడీ రోమియో’ అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీ కోసం స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ గా నాని మారిపోయారు. ఆయన లుక్ కు సంబంధించిన మేకోవర్ వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది. 

Published on: Oct 10, 2026, 17:58:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Nani Bloody Romeo Look: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్‌లో అఫీషియల్‌గా అనౌన్స్ అయిన చిత్రం 'బ్లడీ రోమియో' (Bloody Romeo). 'ది ప్యారడైజ్' లాంటి పక్కా రూటెడ్ మాస్ యాక్షన్ మూవీ తర్వాత నాని సరికొత్త మేకోవర్‌తో రాబోతున్నారు. తన కెరీర్‌లో ఇప్పటివరకు ఎప్పుడూ టచ్ చేయని ఒక క్లాసీ, మోడ్రన్ గ్యాంగ్‌స్టర్ జోనర్‌ను ఈ ప్రాజెక్ట్ కోసం ఎంచుకున్నారు.

నాని న్యూ లుక్ సెన్సేషన్.. సుజీత్ మోడ్రన్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా బ్లడీ రోమియో.. మేకోవర్ వీడియో వైరల్! (x)
నాని న్యూ లుక్ సెన్సేషన్.. సుజీత్ మోడ్రన్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా బ్లడీ రోమియో.. మేకోవర్ వీడియో వైరల్! (x)

అల్ట్రా స్టైలిష్ మేకోవర్

దర్శకుడు సుజీత్ తన హీరోలను స్టైలిష్‌గా, సరికొత్త యాటిట్యూడ్‌తో ప్రెజెంట్ చేయడంలో దిట్ట. ఈ బ్లడీ రోమియో గ్యాంగ్‌స్టర్ డ్రామా కోసం నానికి రఫ్ అండ్ ట్రెండీ లుక్‌ను డిజైన్ చేశారు. కొత్త హెయిర్‌స్టైల్, స్టైలిష్ స్పెక్స్‌తో కనిపించనున్న నాని మేకోవర్ గ్లింప్స్ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచేసింది. ఈ మేకోవర్ వీడియోను మేకర్స్ ఇవాళ (అక్టోబర్ 10) రిలీజ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

చెఫ్ టు గ్యాంగ్‌స్టర్ కాన్సెప్ట్

ఈ బ్లడీ రోమియో చిత్రంలో నాని పాత్ర చాలా విభిన్నమైన షేడ్స్‌తో సాగనుంది. ఒక వైపు నైపుణ్యం కలిగిన చెఫ్‌గా కనిపిస్తూనే, మరోవైపు డేంజరస్ గ్యాంగ్‌స్టర్‌గా అలరించబోతున్నారు. 'ఒక వయొలెంట్ వ్యక్తి నాన్-వయొలెంట్ గా మారితే అతని ప్రపంచం ఎలా తలకిందులైంది' అనే క్రేజీ పాయింట్, డార్క్ హ్యూమర్ తో కథ నడుస్తుందని తెలిసింది.

భారీ ప్రొడక్షన్ & షూటింగ్ ప్లాన్స్

ఈ పాన్-ఇండియా బ్లడీ రోమియో మూవీని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ బోయనపల్లి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్‌లో మొదలవుతోందని సమాచారం. హైదరాబాద్, ఢిల్లీలతో పాటు దాదాపు 70 రోజుల పాటు లండన్ పరిసర ప్రాంతాల్లో కీలక షెడ్యూల్ చిత్రీకరించనున్నారని తెలిసింది.

క్రేజీ క్యాస్టింగ్

ఈ బ్లడీ రోమియో మూవీలో హీరోయిన్ గా ప్రీతి ముకుందన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ బ్యూటీఫుల్ హీరోయిన్ ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతోంది. మరోవైపు ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారని సినీ వర్గాలు అంటున్నాయి.

అలాగే బ్లడీ రోమియో మ్యూజిక్ కోసం ముగ్గురు సంగీత దర్శకులను రంగంలోకి దించుతున్నారని టాక్. మరి ఇది ఎంతవరకు నిజమో అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తానే తెలుస్తుంది. బ్లడీ రోమియో మూవీని 2027 సమ్మర్ లో గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More