...
...
Next Story

Nani Comments: తక్కువ బడ్జెట్.. వరల్డ్ క్లాస్ క్వాలిటీ.. మలయాళ ఇండస్ట్రీ నుంచి చాలా నేర్చుకోవాలి: నేచురల్ స్టార్ నాని

Nani Comments: నేచురల్ స్టార్ నాని తాజా కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మలయాళ ఇండస్ట్రీపై నాని ప్రశంసలు కురిపించేశారు. మలయాళ ఇండస్ట్రీని చూసి చాలా నేర్చుకోవాలంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. అసలు నాని అలా ఎందుకు అన్నారో ఇక్కడ చూసేయండి.

Published on: Sep 19, 2026, 18:51:23 IST
Advertisement

Nani Comments: నేచురల్ స్టార్ నాని అప్ కమింగ్ మూవీ ది ప్యారడైజ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా కొచ్చిలో జరిగిన ప్రెస్ మీట్‌లో నాని మలయాళ చిత్రపరిశ్రమపై ప్రశంసల వర్షం కురిపించారు. మలయాళం ఇండస్ట్రీని చూసి చాలా నేర్చుకోవాలంటూ నాని చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

నాని ప్రశంసలు

తక్కువ బడ్జెట్.. వరల్డ్ క్లాస్ క్వాలిటీ.. మలయాళ ఇండస్ట్రీ నుంచి చాలా నేర్చుకోవాలి: నేచురల్ స్టార్ నాని (x/TheParadiseOffl)
తక్కువ బడ్జెట్.. వరల్డ్ క్లాస్ క్వాలిటీ.. మలయాళ ఇండస్ట్రీ నుంచి చాలా నేర్చుకోవాలి: నేచురల్ స్టార్ నాని (x/TheParadiseOffl)

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సెప్టెంబర్ 24, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న 'ది ప్యారడైజ్' సినిమా ప్రమోషన్లలో భాగంగా నేచురల్ స్టార్ నాని కేరళలోని కొచ్చిలో పర్యటించారు. అక్కడ మీడియాతో మాట్లాడారు. మలయాళ చిత్రపరిశ్రమ పనితీరును, వారి ప్రొడక్షన్ ప్లానింగ్‌ను కొనియాడారు.

చాలా నేర్చుకోవాలి

ఎంతటి పరిమిత వనరులు ఉన్నప్పటికీ, వాటిని సమర్థవంతంగా వినియోగించుకుంటూ అద్భుతమైన క్వాలిటీ కంటెంట్‌ను ఎలా అందించవచ్చో మలయాళ చిత్రసీమ నిరూపిస్తోందని చెప్పారు. దేశంలోని ప్రతీ ప్రాంతీయ చిత్రపరిశ్రమ మలయాళ పరిశ్రమ అనుసరిస్తున్న నిర్మాణ సూత్రాల నుంచి విలువైన పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

కంటెంట్ పరంగా

పరిమితమైన బడ్జెట్‌లతో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా, కంటెంట్ పరంగా ప్రపంచస్థాయి ప్రమాణాలను అందుకోవడం ఒక్క మలయాళ ఇండస్ట్రీకే చెల్లిందని నాని పేర్కొన్నారు. సరైన ప్రీ-ప్రొడక్షన్ ప్లానింగ్, షూటింగ్ లో పక్కా టైమింగ్, అనవసరపు వ్యయాన్ని పూర్తిగా అరికట్టే కథన శైలి అక్కడ ప్రధానంగా కనిపిస్తుందని చెప్పారు.

నాని కామెంట్స్ వైరల్

ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు ఇతర ప్రధాన భారతీయ సినీ పరిశ్రమలలో నిర్మాణ వ్యయాలు విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో నాని చేసిన వ్యాఖ్యలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పాన్-ఇండియా సినిమాల పేరుతో కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడం, పక్కా ప్రణాళిక లేకపోవడం వల్ల షూటింగ్ రోజులు పెరిగిపోయి నిర్మాతలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాతావరణం నెలకొంది.

నాని స్వయంగా అగ్ర కథానాయకుడిగానే కాకుండా వాల్ పోస్టర్ సినిమా ద్వారా విజయవంతమైన నిర్మాతగా కూడా కొనసాగుతున్నారు. అందువల్ల ప్రొడక్షన్ వాల్యూస్, బడ్జెట్ రికవరీపై ఆయనకు ఉన్న అవగాహన, ప్రొడ్యూసర్ కష్టాలతో నాని ఈ కామెంట్లు చేశారని చెప్పొచ్చు.

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ కేవలం విజువల్ ఎఫెక్ట్స్, మాస్ ఎలిమెంట్స్ వెనుకే పడకుండా, స్క్రిప్ట్ డిజైన్, ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్‌లో రీ-ఇంజనీరింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని నాని వ్యాఖ్యలు చాటుతున్నాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks