Nani: నేచురల్ స్టార్ నాని లీడ్ రోల్‌లో వచ్చిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్' (The Paradise) సెప్టెంబర్ 24న గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చింది. తొలిరోజే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన ఈ మూవీకి ఊహించని విధంగా ఆడియన్స్ నుంచి చాలా తీవ్రమైన నెగటివ్ రియాక్షన్లు వచ్చాయి. సోషల్ మీడియాలో ట్రోల్స్, అగ్రెసివ్ ఫీడ్‌బ్యాక్ రావడంపై హీరో నాని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ ప్రాజెక్ట్‌పై రిలీజ్ ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ప్రీమియర్ల నుంచే సినిమాకి డివైడ్ టాక్ స్టార్ట్ కావడంతో మరుసటి రోజు కలెక్షన్లలో డిప్ కనిపించింది.
నా 33 సినిమాల్లో ఇలాంటి రెస్పాన్స్ ఫస్ట్ టైమ్
డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో కలిసి పాల్గొన్న ఇంటర్వ్యూలో నాని తన మనసులోని మాటను ఓపెన్‌గా పంచుకున్నారు. "నా 18 ఏళ్ల కెరీర్‌లో 33 సినిమాలు తీశాను. కానీ ఒక సినిమాకి ఇంతటి ఎక్స్‌ట్రీమ్ రియాక్షన్లు రావడం నా లైఫ్‌లో ఇదే మొదటిసారి" అని నాని స్పష్టం చేశారు.
ఒకవైపు కొందరు సినిమాను నెత్తికెత్తుకుంటుంటే, మరికొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం తనను ఆశ్చర్యపరిచిందని చెప్పారు. అయితే ఈ నెగెటివ్ రియాక్షన్ల వెనుక కూడా ప్రేక్షకుల ప్రేమ, నిజాయతీ ఉందన్నారు. ఒక సినిమా వర్కవుట్ కాలేదని అంత ఇంటెన్సిటీతో చెబుతున్నారంటే, అది కూడా ఒక రకంగా పాజిటివ్ సైన్ అని నాని విశ్లేషించారు.
'దసరా' ఇచ్చిన నమ్మకం.. శ్రీకాంత్ ఓదెల కాంబోపై అంచనాలు
'దసరా' వంటి గ్లోబల్ బ్లాక్‌బస్టర్ తర్వాత నాని - శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన రెండో సినిమా కావడంతో ఆడియన్స్ అంచనాలు పీక్స్‌లో ఉన్నాయని నాని చెప్పారు. "మా కాంబోపై ఆడియన్స్‌కి ఉన్న నమ్మకమే ఆ ఎమోషనల్ రియాక్షన్లకు కారణం. మేం ఏ సీన్‌ని కూడా లైట్‌గా తీసుకోలేదు, హార్ట్ అండ్ సోల్ పెట్టి వర్క్ చేశాం" అని తెలిపారు.
{{/usCountry}}'దసరా' వంటి గ్లోబల్ బ్లాక్‌బస్టర్ తర్వాత నాని - శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన రెండో సినిమా కావడంతో ఆడియన్స్ అంచనాలు పీక్స్‌లో ఉన్నాయని నాని చెప్పారు. "మా కాంబోపై ఆడియన్స్‌కి ఉన్న నమ్మకమే ఆ ఎమోషనల్ రియాక్షన్లకు కారణం. మేం ఏ సీన్‌ని కూడా లైట్‌గా తీసుకోలేదు, హార్ట్ అండ్ సోల్ పెట్టి వర్క్ చేశాం" అని తెలిపారు.
{{/usCountry}}ఈ సినిమా ఫలితం నుంచి నేర్చుకున్న పాఠాలతో, తమ కాంబినేషన్‌లో రాబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను కచ్చితంగా ఒక బిగ్గెస్ట్ ప్లస్‌గా మలుస్తామని నాని కాన్ఫిడెంట్‌గా చెప్పారు. మన నెక్ట్స్ సినిమాకు ఇలాంటి టాక్ రాకూడదని శ్రీకాంత్ తో నాని చెప్పడం గమనార్హం.
బాక్సాఫీస్ కలెక్షన్లు.. ఫస్ట్ డే రికార్డు నుండి ట్రెండ్
సినిమాకి నెగెటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ దగ్గర నాని క్రేజ్ గట్టిగానే వర్కవుట్ అయింది. డే 1 ఇండియన్ నెట్ కలెక్షన్ల రూపంలో ఈ మూవీ ఏకంగా రూ.34.65 కోట్లు రాబట్టి నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ నమోదు చేసింది. ఆ తర్వాత రోజు కలెక్షన్స్ రూ.14 కోట్లకు పడిపోయినా, వీకెండ్‌లో మళ్లీ పికప్ అయింది.
ప్రస్తుతం ఈ చిత్రం ఇండియా వ్యాప్తంగా రూ.97.10 కోట్ల నెట్ వసూలు చేయగా, వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ.144.85 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
1980ల బ్యాక్‌డ్రాప్.. 'సవారీ' తెగ పోరాటం
1980ల కాలంలో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో నివసించే 'సవారీ' అనే గిరిజన తెగ పౌరసత్వం కోసం చేసే పోరాటం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇందులో సమ్మక్క పాత్రలో సోనాలీ కుల్కర్ణి, ఆమె కొడుకు జడల్ పాత్రలో నాని పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. భూస్వామి షికంజా మాలిక్‌గా సీనియర్ నటుడు మోహన్ బాబు, ఆయన కొడుకు విక్రమ్ మాలిక్‌గా రాఘవ్ జుయల్ విలనిజం పండించారు.
అనిరుధ్ రవిచందర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్ అద్భుతంగా ఉన్నప్పటికీ కథనంలో లోపాలు, క్లైమాక్స్ ఎగ్జిక్యూషన్ వీక్‌గా ఉండటం వల్ల డివైడ్ టాక్ వచ్చిందని విమర్శకులు అభిప్రాయపడ్డారు.