The Paradise Breakeven: నాని 'ది పారడైజ్' ప్రీ-రిలీజ్ హంగామా బాక్సాఫీస్ దగ్గర తుఫాన్ సృష్టిస్తోంది. సెప్టెంబర్ 23న యూఎస్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు మొదలవుతుండటంతో ట్రేడ్ వర్గాల్లో కలెక్షన్ల రచ్చ మొదలైంది. నాచురల్ స్టార్ కెరీర్‌లోనే ఆల్‌టైమ్ హైయెస్ట్ బిజినెస్ జరిపిన ఈ పీరియాడిక్ మాస్ డ్రామా క్లీన్ హిట్ అనిపించుకోవాలంటే ఎంత వసూలు చేయాలనే లెక్కలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
100 కోట్ల షేర్ టార్గెట్.. నాని రేంజ్ నెక్స్ట్ లెవెల్

'దసరా' లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెల - నాచురల్ స్టార్ నాని కాంబినేషన్లో వస్తున్న 'ది పారడైజ్' పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీ థియేట్రికల్ రైట్స్ ఊహించని ధరకు అమ్ముడయ్యాయి.
ట్రేడ్ వర్గాల విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ సుమారు రూ. 103.75 కోట్ల నుంచి రూ. 105 కోట్ల వరకు జరిగింది. అంటే థియేటర్లలో 'ది పారడైజ్' క్లీన్ హిట్ అనిపించుకోవాలంటే రూ. 100 కోట్లకు పైగా షేర్ (దాదాపు రూ. 200 కోట్ల గ్రాస్) రాబట్టాల్సి ఉంటుంది.
నైజాంలో రికార్డు బిజినెస్.. ఏరియా వైజ్ వివరాలు ఇవే
సినిమా బ్యాక్‌డ్రాప్ 1980ల నాటి సికింద్రాబాద్ కావడంతో తెలంగాణ ప్రాంతంలో ఈ మూవీపై మాస్ క్రేజ్ నెలకొంది. అందుకే నైజాం థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ. 35 కోట్లకు అమ్ముడుపోయి నాని కెరీర్‌లోనే ఆల్‌టైమ్ రికార్డు క్రియేట్ చేశాయి.
మిగిలిన ఏరియాల్లో కూడా ప్రీ-రిలీజ్ బిజినెస్ గట్టిగానే జరిగింది. సీడెడ్ హక్కులు రూ. 10 కోట్లు పలకగా, ఆంధ్రప్రదేశ్‌తో కలిపి రెండు తెలుగు రాష్ట్రాల మొత్తం బిజినెస్ రూ. 75.70 కోట్లు దాటింది. ఓవర్సీస్ రైట్స్ రూ. 18 కోట్లకు అమ్ముడవ్వగా, కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా హక్కులు రూ. 10 కోట్ల వరకు బిజినెస్ సాధించాయి.
'దసరా', 'హిట్ 3' రికార్డులను తిరగరాస్తుందా?
{{/usCountry}}మిగిలిన ఏరియాల్లో కూడా ప్రీ-రిలీజ్ బిజినెస్ గట్టిగానే జరిగింది. సీడెడ్ హక్కులు రూ. 10 కోట్లు పలకగా, ఆంధ్రప్రదేశ్‌తో కలిపి రెండు తెలుగు రాష్ట్రాల మొత్తం బిజినెస్ రూ. 75.70 కోట్లు దాటింది. ఓవర్సీస్ రైట్స్ రూ. 18 కోట్లకు అమ్ముడవ్వగా, కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా హక్కులు రూ. 10 కోట్ల వరకు బిజినెస్ సాధించాయి.
'దసరా', 'హిట్ 3' రికార్డులను తిరగరాస్తుందా?
{{/usCountry}}గతంలో నాని నటించిన 'దసరా' రూ. 118.5 కోట్ల గ్రాస్, అలాగే 'హిట్: ది థర్డ్ కేస్' రూ. 119.48 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచాయి. 'సరిపోదా శనివారం' కూడా ప్రపంచవ్యాప్తంగా రూ. 98 కోట్ల వరకు రాబట్టింది.
అయితే 'ది పారడైజ్' సినిమా సేఫ్ జోన్‌లోకి వెళ్లాలంటే నాని తన పాత రికార్డులన్నింటినీ దాటుకుని రూ. 200 కోట్ల గ్రాస్ మార్క్‌ను టచ్ చేయాల్సి ఉంటుంది. ఓవర్సీస్‌లో ఇప్పటికే ప్రీ-సేల్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతుండటంతో డాలర్ వేట జోరుగా సాగుతోంది. మొదటి రోజు కలెక్షన్లు వరల్డ్ వైడ్‌గా రూ. 50 కోట్ల గ్రాస్ దాటే అవకాశాలు ఉన్నాయని బాక్సాఫీస్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
శ్రీకాంత్ ఓదెల మ్యాజిక్.. అనిరుధ్ బీజీఎం ప్లస్ అవుతుందా?
ఇంటెన్స్ రా అండ్ రస్టిక్ యాక్షన్‌తో రూపొందిన ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మెయిన్ పిల్లర్‌గా నిలవనున్నాయి. కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, పవర్‌ఫుల్ విలన్‌గా మోహన్ బాబు, కీలక పాత్రల్లో రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి అలరించనున్నారు.
సెన్సార్ బోర్డు ఈ సినిమాకి 'A' సర్టిఫికేట్ ఇచ్చినా, ఈ ఇంటెన్స్ కంటెంట్ ఆడియన్స్ అందరికీ కచ్చితంగా కనెక్ట్ అవుతుందని నాని చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ప్రీమియర్స్ నుంచి డీసెంట్ టాక్ వస్తే మాత్రం రూ. 100 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అవ్వడం నానికి చాలా ఈజీ అని విశ్లేషకులు చెబుతున్నారు.