The Paradise: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పీరియడ్ యాక్షన్ డ్రామా 'ది పారడైజ్' గ్రాండ్ రిలీజ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాపై సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ ప్రచారం, నెగెటివ్ ట్రోలింగ్‌పై బెంగళూరు కోర్టు గట్టి షాకిచ్చింది. మూవీ రిలీజ్‌కు ముందే హేట్ కంటెంట్, ఫేక్ రివ్యూలను వ్యాప్తి చేయకుండా స్టే విధిస్తూ సంచలన మధ్యంతర ఇంజంక్షన్ ఆర్డర్ జారీ చేసింది.
నెగెటివిటీపై లీగల్ వార్.. కోర్టును ఆశ్రయించిన ప్రొడ్యూసర్స్

'దసరా' లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నాని కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కావడంతో 'ది పారడైజ్' పై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఆగస్టు 6న అఫీషియల్ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి కొందరు కావాలనే సోషల్ మీడియాలో నెగెటివ్ కంటెంట్ ప్రచారం చేస్తున్నారని నిర్మాతలు గుర్తించారు.
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి బెంగళూరులోని సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సినిమా నిర్మాణం, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ కోసం రూ. వందల కోట్లు ఇన్వెస్ట్ చేశామని, ఉద్దేశపూర్వకంగా చేసే ఫేక్ ప్రచారం వల్ల తీవ్ర ఆర్థిక నష్టం జరుగుతుందని కోర్టుకు వివరించారు.
బెంగళూరు కోర్టు సంచలన తీర్పు..
వాదనలు విన్న జడ్జి, నిర్మాతలు చూపించిన ఆధారాలు పరిశీలించి ఫేక్ కంటెంట్ స్ప్రెడ్ చేస్తున్న వారిపై కఠిన ఆంక్షలు విధించారు. అసలైన విమర్శలు వేరు, కావాలని ఒక సినిమాను డౌన్ చేయడానికి చేసే ప్రతిష్టకు భంగం కలిగించే కంటెంట్ వేరు అని కోర్టు స్పష్టం చేసింది.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్, ఎక్స్, యూట్యూబ్ ఛానెల్స్, ఐడీలలో ఈ రకమైన ఫేక్ న్యూస్, ట్రోల్స్, నెగెటివ్ వీడియోలు టెలికాస్ట్ చేయకూడదని బెంగళూరు కోర్టు అల్టిమేటం జారీ చేసింది. గతంలో కన్నడ స్టార్ యశ్ సినిమా 'టాక్సిక్' కు ఎదురైన వివాదాల అనుభవంతోనే 'ది పారడైజ్' టీమ్ ముందుగానే ఈ లీగల్ చర్యలు తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
శ్రీకాంత్ ఓదెల - నాని 'మాస్ సెంటిమెంట్'.. బాక్సాఫీస్ అంచనాలు
గతంలో వచ్చిన 'దసరా' సినిమా రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఆ సినిమా అందించిన మాస్ ఎనర్జీతోనే శ్రీకాంత్ ఓదెల ఈసారి మరింత రా, రస్టిక్ కాన్సెప్ట్‌తో 'ది పారడైజ్' చిత్రాన్ని తెరకెక్కించారు.
{{/usCountry}}గతంలో వచ్చిన 'దసరా' సినిమా రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఆ సినిమా అందించిన మాస్ ఎనర్జీతోనే శ్రీకాంత్ ఓదెల ఈసారి మరింత రా, రస్టిక్ కాన్సెప్ట్‌తో 'ది పారడైజ్' చిత్రాన్ని తెరకెక్కించారు.
{{/usCountry}}ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామాలో నానికి జోడీగా కయాదు లోహర్ నటిస్తుండగా, బాలీవుడ్ యాక్టర్ రాఘవ్ జుయల్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి మేజర్ హైలైట్‌గా నిలవబోతోంది.
రిలీజ్ ఆలస్యమైనా.. ప్రమోషన్స్ అదరగొడుతున్న 'త్రీ క్రోస్'
నిజానికి ఈ సినిమా మార్చి లేదా ఆగస్టులోనే విడుదల కావాల్సి ఉన్నా, గ్రాఫిక్స్, క్వాలిటీ వర్క్ కారణంగా సెప్టెంబర్ 24కి పోస్ట్‌పోన్ అయింది. రీసెంట్‌గా నాని, శ్రీకాంత్ ఓదెల, అనిరుధ్ కలసి 'త్రీ క్రోస్' పేరుతో పోస్టర్ వదిలి ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచారు.
థియేటర్లలో సినిమా రిలీజ్ అయ్యే వరకు ఎలాంటి ఫేక్ నెగెటివిటీ స్ప్రెడ్ కాకుండా లీగల్ ప్రొటెక్షన్ పొందడంతో 'ది పారడైజ్' టీమ్ ఇప్పుడు సేఫ్ జోన్‌లో ఉంది. సెప్టెంబర్ 24న థియేటర్ల ముందుకు వస్తున్న ఈ రా అండ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.