ఈ ఏడాది సంక్రాంతి బరిలోకి సైలెంట్ గా వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన మూవీ నారీ నారీ నడుమ మురారి. శర్వానంద్ కు చాలా కాలం తర్వాత దక్కిన హిట్ ఇది. బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కావడమే కాదు.. 20 రోజుల్లోనే ప్రైమ్ వీడియోలోకి అడుగుపెట్టి అక్కడా దూసుకుపోతోంది.
నారీ నారీ నడుమ మురారి నంబర్ 1

సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలో రిలీజైంది నారీ నారీ నడుమ మురారి. అయితే బాక్సాఫీస్ హిట్ గా నిలిచినా మూడు వారాల్లోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి అడుగుపెట్టింది. బుధవారం అంటే ఫిబ్రవరి 4 నుంచే స్ట్రీమింగ్ అవుతోంది.
రెండో రోజే ప్రైమ్ వీడియో ఇండియాలో నంబర్ 1 ట్రెండింగ్ మూవీగా రికార్డు క్రియేట్ చేయడం విశేషం. ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను ఓటీటీలో ఎగబడి చూస్తున్నారు. ఇందులోని కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని చూసే సినిమా కావడం కూడా దీనికి కలిసి వస్తోంది.
నారీ నారీ నడుమ మురారి మూవీ విశేషాలు
ఎప్పుడో 35 ఏళ్ల కిందట బాలకృష్ణ లీడ్ రోల్లో ఇదే టైటిల్ తో సినిమా వచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో అది పెద్ద హిట్. ఇప్పుడు శర్వానంద్ లీడ్ రోల్లో సాక్సి వైద్య, సంయుక్తి మీనన్ నటించిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ సాధించింది.
రాబ్ అబ్బరాజు డైరెక్ట్ చేసిన ఈ మూవీలోని కామెడీకి ప్రేక్షకులు పడీపడీ నవ్వుతున్నారు. సంక్రాంతి బరిలో పెద్ద సినిమాల మధ్య నిలిచినా.. ఊహకందని విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.40 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
{{/usCountry}}రాబ్ అబ్బరాజు డైరెక్ట్ చేసిన ఈ మూవీలోని కామెడీకి ప్రేక్షకులు పడీపడీ నవ్వుతున్నారు. సంక్రాంతి బరిలో పెద్ద సినిమాల మధ్య నిలిచినా.. ఊహకందని విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.40 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
{{/usCountry}}ఈ సినిమాలో గౌతమ్ అనే పాత్రలో శర్వా నటించాడు. ప్రేమకు హద్దులు లేవని భావించే అతని పాత్ర తన తండ్రి ప్రేమను అర్థం చేసుకొని అతనికి రెండో పెళ్లి చేస్తాడు. ఆ తండ్రి పాత్రలో నరేష్ నటించాడు. కానీ తన జీవితంలో మాత్రం ఇద్దరు అమ్మాయిలు ఎందుకు ఉన్నారు? మొదటి భార్యతో విడాకులు తీసుకోకపోవడానికి కారణం ఏంటి? ఓ విడాకుల లాయర్ కూతురిని ప్రేమించి అతడు ఎలాంటి చిక్కుల్లో పడ్డాడన్నదే ఈ నారీ నారీ నడుమ మురారి కథ. థియేటర్లలో చూడకపోతే ఇప్పుడు ప్రైమ్ వీడియోలో చూసేయండి.