Nani: ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా క్లాప్ బాయ్‌గా కెరీర్ ప్రారంభించి, నేడు పాన్ ఇండియా లెవల్ కు ఎదిగిన స్టార్ నాని. టాలీవుడ్ లో ‘మినిమమ్ గ్యారెంటీ బ్రాండ్’గా ఎదిగిన నేచురల్ స్టార్ నాని (Nani) చిత్ర పరిశ్రమలో 18 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఆయన ఫస్ట్ మూవీ ‘అష్టాచెమ్మా’ 2028లో సెప్టెంబర్ 5న రిలీజైంది.
నాని ఎమోషనల్ ట్వీట్

సినిమా ఇండస్ట్రీలో హీరోగా 18 ఏళ్లు కంప్లీట్ చేసిన నాని.. ఇవాళ (సెప్టెంబర్ 5) ఎమోషనల్ ట్వీట్ పెట్టారు.
"18 ఏళ్లు.. సినిమాల్లో అఫీషియల్ గా అడల్ట్ (పెద్దవాడిని) అయ్యాను. మీరు నాపై చూపించిన ప్రేమను నేనెప్పుడూ తేలికగా తీసుకోలేదు. ఎప్పటికీ తీసుకోను కూడా’’ అని నాని ఎక్స్ లో పోస్టు పెట్టారు. గాల్లో ఎగురుతున్న తుపాకుల మధ్యలో తాను ఉన్న ది ప్యారడైజ్ వీడియోను షేర్ చేశారు.
క్లాప్ బాయ్ టు లీడ్ హీరో
తెలుగు ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్లు లేకుండా సొంత ప్రతిభతో ఎదిగిన అతికొద్దిమంది హీరోలలో నాని టాప్ లో ఉంటారు. నటుడిగా మారకముందు నాని డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. దిగ్గజ దర్శకుడు బాపు దర్శకత్వంలో వచ్చిన ‘రాధాగోపాలం’ (2005), శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘ఢీ’ (2007) తదితర సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా, క్లాప్ బాయ్‌గా విధులు నిర్వర్తించారు.
ఆ మూవీతో
{{/usCountry}}తెలుగు ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్లు లేకుండా సొంత ప్రతిభతో ఎదిగిన అతికొద్దిమంది హీరోలలో నాని టాప్ లో ఉంటారు. నటుడిగా మారకముందు నాని డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. దిగ్గజ దర్శకుడు బాపు దర్శకత్వంలో వచ్చిన ‘రాధాగోపాలం’ (2005), శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘ఢీ’ (2007) తదితర సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా, క్లాప్ బాయ్‌గా విధులు నిర్వర్తించారు.
ఆ మూవీతో
{{/usCountry}}దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి దృష్టిలో పడటంతో 2008లో వచ్చిన ‘అష్టాచెమ్మా’ సినిమాలో రాంబాబుగా నాని హీరోగా పరిచయమయ్యారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడంతో నాని యాక్టింగ్ కెరీర్‌కు గ్రీన్ సిగ్నల్ పడింది.
కెరీర్ ను టర్న్ చేసిన సినిమాలు
18 ఏళ్ల ప్రయాణంలో నాని కేవలం కమర్షియల్ ఫార్ములాకే పరిమితం కాకుండా, విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్‌ను నిర్మించుకున్నారు.
- అలా మొదలైంది (2011): నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ రోమ్-కామ్ చిత్రం నానిలోని టైమింగ్, ఈజ్, అండ్ చామ్‌ను బయటకు తీసింది. కుర్రకారులో మంచి ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టింది.
- ఈగ (2012): దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందించిన ఈ విజువల్ వండర్‌లో అరగంట మాత్రమే కనిపించినప్పటికీ, ఆ పాత్రతో దేశవ్యాప్తంగా నాని గుర్తింపు పొందారు.
- భలే భలే మగాడివోయ్ (2015): మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నానిని యూఎస్ బాక్సాఫీస్ వద్ద 1 మిలియన్ డాలర్ క్లబ్‌లో నిలబెట్టింది. ఈ సినిమా నుంచే ఆయనకు ‘నేచురల్ స్టార్’ అనే బిరుదు స్థిరపడింది.
- జెర్సీ (2019): గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామాలో అర్జున్‌గా నాని జీవించారు. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు గెలుచుకున్న ఈ సినిమా నాని నటనకు మకుటంలా నిలిచింది.
- దసరా & హాయ్ నాన్న: ‘దసరా’తో రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి అడుగుపెట్టారు నాని. తన రగ్గడ్ మాస్ అవతార్‌ను చూపించారు. వెంటనే ‘హాయ్ నాన్న’తో క్లాస్ ఎమోషన్లతో హృదయాలను గెలుచుకున్నారు.
ప్రొడ్యూసర్‌గా ‘వాల్ పోస్టర్ సినిమా’
కేవలం నటుడిగానే కాకుండా, నిర్మాణం వైపు అడుగులేసి ‘వాల్ పోస్టర్ సినిమా’ (Wall Poster Cinema) అనే బ్యానర్‌ను స్థాపించారు నాని. ‘అః! (Awe!)’ వంటి సరికొత్త కాన్సెప్ట్ చిత్రంతో ప్రొడ్యూసర్‌గా మారి నేషనల్ అవార్డులు సాధించారు.
డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో ‘HIT: The First Case’, ‘HIT: The Second Case’ లతో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లకు టాలీవుడ్‌లో కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు.