బాలకృష్ణ-నయనతార.. ఈ పెయిర్ ది హిట్ కాంబినేషన్. వీళ్లు ఇప్పటికే మూడు సినిమాల్లో నటించారు. ఇప్పుడు నాలుగో సినిమా రెడీ కానుంది. బాలకృష్ణ, నయనతార హీరోహీరోయిన్లుగా గోపీచంద్ మలినేని ఓ మూవీ తెరకెక్కించనున్నారు. ఎన్బీకే111 వర్కింగ్ టైటిల్ తో రెడీ కాబోతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ అని మేకర్స్ ప్రకటించారు. ఆమె బర్త్ డే సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు.
మహారాణిగా నయనతార

బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కించనున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో మహారాణిగా నయనతార నటించనుంది. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఇవాళ (నవంబర్ 18) నయనతార బర్త్ డే సందర్భంగా వీడియో రిలీజ్ చేశారు. మహారాణి గెటప్ లో వెనక్కి ధైర్యంగా చూస్తూ కనిపించింది నయనతార. గాడ్ ఆఫ్ మాసెస్, క్వీన్ మరోసారి కలిశారని వీడియోలో పేర్కొన్నారు.
సముద్రాల ప్రశాంతత
‘‘సముద్రాల ప్రశాంతతను, తుపానుల బీభత్సాన్ని మోసే రాణిగా ఎన్బీకే111 రాజ్యంలోకి నయనతార అడుగుపెడుతోంది. మా టీమ్ నుంచి ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు. చారిత్రక రోర్ లోడ్ అవుతుంది. త్వరలోనే భారీ అప్ డేట్లు వస్తాయి’’ అని వృద్ధి సినిమాస్ ఎక్స్ లో పోస్టు చేసింది. దర్శకుడు గోపీచంద్ కూడా నయనతారకు వెల్ కమ్ చెప్పాడు.
నాలుగో సినిమా
బాలకృష్ణ-నయనతార పెయిర్ అంటే ఫ్యాన్స్ కు క్రేజీ ఫీలింగ్ ఉంటుంది. వీళ్ల కాంబినేషన్లో వచ్చిన ‘సింహా’, ‘శ్రీరామ రాజ్యం’, ‘జై సింహా’ హిట్లుగా నిలిచాయి. బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. ఇప్పుడు పీరియాడిక్ యాక్షన్ డ్రామా కోసం మరోసారి కలిసింది ఈ జంట. మరోవైపు గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో బాలయ్య ఇప్పటికే ‘వీరసింహారెడ్డి’ సినిమా తీశారు. ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో ఈ కాంబినేషన్ పైనా మంచి అంచనాలున్నాయి.
అఖండ 2
అఖండ అంటూ మరోసారి థియేటర్లను షేక్ చేయడానికి బాలయ్య రెడీ అవుతున్నారు. అఖండకు సీక్వెల్ గా తెరకెక్కిన అఖండ 2 మూవీ డిసెంబర్ 5, 2025న థియేటర్లోల రిలీజ్ కానుంది. దీని తర్వాత గోపీచంద్ మలినేని సినిమా కోసం బాలయ్య రంగంలోకి దిగే అవకాశముంది. మరోవైపు అనిల్ రావిపూడి-చిరంజీవి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది నయనతార.
{{/usCountry}}అఖండ అంటూ మరోసారి థియేటర్లను షేక్ చేయడానికి బాలయ్య రెడీ అవుతున్నారు. అఖండకు సీక్వెల్ గా తెరకెక్కిన అఖండ 2 మూవీ డిసెంబర్ 5, 2025న థియేటర్లోల రిలీజ్ కానుంది. దీని తర్వాత గోపీచంద్ మలినేని సినిమా కోసం బాలయ్య రంగంలోకి దిగే అవకాశముంది. మరోవైపు అనిల్ రావిపూడి-చిరంజీవి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది నయనతార.
{{/usCountry}}గోపీచంద్-బాలకృష్ణ మూవీ పూజ కార్యక్రమాలను నవంబర్ 26న నిర్వహిస్తారని తెలిసింది. ఈ చిత్రాన్ని ఈ వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.