...
...
Next Story

Nayanthara Remuneration: ‘టాక్సిక్’లో కొన్ని నిమిషాల రోల్.. కానీ నయనతార డిమాండ్ చేసిన రెమ్యునరేషన్ తెలిస్తే మైండ్ బ్లాక్

Nayanthara Remuneration: యశ్ లీడ్ రోల్లో వస్తున్న టాక్సిక్ మూవీ కోసం లేడీ సూపర్ స్టార్ నయనతార డిమాండ్ చేసిన రెమ్యునరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కేవలం కొద్ది నిమిషాలు కనిపించే పాత్రే అయినా ఆమె ఏమాత్రం తగ్గలేదట.

Published on: Jul 9, 2026, 19:27:51 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Nayanthara Remuneration: పాన్ ఇండియా సూపర్ స్టార్ యశ్, మలయాళ ఫైర్ బ్రాండ్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ కాంబోలో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'టాక్సిక్' (Toxic). ఈ సినిమా గురించి రోజుకో సెన్సేషనల్ న్యూస్ బయటికొస్తోంది. లేటెస్ట్ గా లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ సినిమాలో పోషిస్తున్న పాత్ర, ఆమె తీసుకుంటున్న భారీ రెమ్యునరేషన్ వ్యవహారం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

నయన్‌కు రూ.12 కోట్లు

Nayanthara Remuneration: ‘టాక్సిక్’లో కొన్ని నిమిషాల రోల్.. కానీ నయనతార డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ తెలిస్తే మైండ్ బ్లాక్
Nayanthara Remuneration: ‘టాక్సిక్’లో కొన్ని నిమిషాల రోల్.. కానీ నయనతార డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ తెలిస్తే మైండ్ బ్లాక్

ఇండస్ట్రీలోని కొన్ని వర్గాల నుంచి అందుతున్న పక్కా సమాచారం ప్రకారం, పాన్ ఇండియా యాక్షన్ డ్రామా టాక్సిక్ కోసం నయనతారకు ఏకంగా రూ. 12 కోట్లు చెల్లిస్తున్నారట. ఆమె కెరీర్ లోనే ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పే చెక్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి మేకర్స్ ఆమెను ఈ మూవీ గురించి అడిగినప్పుడు.. నయన్ తన రోల్ కోసం ఏకంగా రూ. 15 కోట్లు డిమాండ్ చేసిందట.

కానీ ప్రొడక్షన్ హౌస్ మాత్రం మళ్లీ మళ్లీ చర్చలు జరిపి, ఫైనల్ గా రూ. 12 కోట్లకు డీల్ క్లోజ్ చేశారని టాక్. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.. ఈ సినిమాలో నయనతార రోల్ కు అంత పెద్ద స్క్రీన్ టైమ్ ఏమీ ఉండదట. కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే కనిపించే పవర్ ఫుల్ క్యారెక్టర్ కు ఆమెకు ఇంత భారీ అమౌంట్ ఇవ్వడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

నయనతార రేంజ్ ఇదీ

అయినా సరే టాక్సిక్ మేకర్స్ ఎందుకు వెనక్కి తగ్గలేదంటే.. నయనతారకు ఉన్న పాన్ ఇండియా అప్పీల్ అలాంటిది. షారుఖ్ ఖాన్ 'జవాన్' (Jawan) తో బాలీవుడ్ లో కూడా సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చిన నయన్ కు ఇప్పుడు నార్త్ లో మంచి మార్కెట్ ఉంది. పైగా సినిమాలో ఆమె క్యారెక్టర్ చాలా ముఖ్యమైనది అని, యశ్ క్యారెక్టర్ ను ఎలివేట్ చేసే ఒక ఇంటెన్స్ రోల్ లో ఆమె కనిపించబోతోందని క్లియర్ గా అర్థమవుతోంది.

భారీగా పెరిగిన హీరోయిన్ల రెమ్యునరేషన్లు

అందులోనూ లేడీ సూపర్ స్టార్ గా నయనతారకు ఉన్న ఇమేజ్, ఓపెనింగ్స్ స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం తన పేరు మీదే థియేటర్లకు ఆడియన్స్ ను రప్పించగల సత్తా ఆమె సొంతం.

కాంప్రమైజ్ కాని యశ్

కేజీఎఫ్ ఫ్రాంచైజీతో గ్లోబల్ వైడ్ రికార్డులు క్రియేట్ చేసిన యశ్.. తన నెక్స్ట్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు. అందుకే 'టాక్సిక్' కోసం భారీ బడ్జెట్ తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా స్టార్ కాస్టింగ్ ను రంగంలోకి దించుతున్నాడు.

ఇక డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ టేకింగ్ గురించి ఇండస్ట్రీలో ఒక సపరేట్ క్రేజ్ ఉంది. ఆమె యశ్ తో ఎలాంటి డార్క్ అండ్ ఇంటెన్స్ డ్రామా ప్లాన్ చేసిందో అని ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. దానికి తోడు నయనతార లాంటి పవర్ హౌస్ నటి తోడవడంతో ఈ ప్రాజెక్ట్ పై హైప్ నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe