Yami Gautam Nayi Naveli Teaser Released: బాలీవుడ్ విలక్షణ నటి యామీ గౌతమ్ ధర్ సరికొత్త అవతారంలో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఫాంటసీ ఫ్యామిలీ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ 'నయీ నవేలీ' టీజర్‌ను ఇవాళ (సెప్టెంబర్ 10) విడుదల చేశారు మేకర్స్.

ప్రముఖ నిర్మాణ సంస్థలు అమెజాన్ ఎంజీఎమ్ స్టూడియోస్, కలర్ ఎల్లో సంయుక్తంగా నయీ నవేలి సినిమాను నిర్మిస్తున్నాయి. దసరా పండుగ కానుకగా 2026 అక్టోబర్ 16న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకువస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
"మా వదిన మంత్రగత్తె".. ఒకే ఒక్క మాటతో రచ్చ రచ్చ
సాధారణంగా సాగుతున్న ఓ ఉమ్మడి కుటుంబంలోకి కొత్తగా అడుగుపెట్టిన వధువు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అంతా సజావుగా సాగుతోందనుకున్న సమయంలో ఇంటిల్లిపాదికి "మా వదినో మంత్రగత్తె" అని మరిది చెప్పడంతో టీజర్ ప్రారంభం అవుతుంది.
మరిది ఆ ఆరోపణ చేయడం ఆ ఇంటి వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తుంది. కట్ చేస్తే మంత్రగత్తె అయిన హీరోయిన్‌ను చూపిస్తారు. "మంత్రగత్తె.. అంతేనా.. ఇద్దరు మంత్రగత్తెలు, మూడు పిశాచాలను, నాలుగు దెయ్యాలను నేను రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లా తినేస్తాను. లేడీస్ అండ్ జెంటిల్‌మెన్ ఒక చిన్న విన్నపం.. థింక్.. బిగ్" అని యామీ గౌతమ్ చెప్పే డైలాగ్ హైలెట్‌గా ఉంది.
కామెడీ, ఫాంటసీ, హారర్ డ్రామా
ఆ తర్వాత వచ్చే బీజీఎమ్ సినిమాలోని కామెడీ, ఫాంటసీ, హారర్ డ్రామా ఎలిమెంట్స్ ఎలా ఉంటాయో చూపించింది. మరి అలాంటి మంత్రగత్తె ఆ కుటుంబంలోకి వెళ్లగానే ఎలాంటి గందరగోళం నెలకొంది? ఆ ఇల్లు ఎలాంటి విచిత్రమైన, వినోదాత్మక సంఘటనలకు వేదికగా మారింది? అనే అంశాలను టీజర్‌లో ఎంతో సరదాగా చూపించారు.
గతంలో 'ఆర్టికల్ 370' చిత్రంలో సీరియస్ పాత్రలో మెప్పించి జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న యామీ గౌతమ్, ఈ సినిమాలో ఊహించని రీతిలో కామెడీ, ఫాంటసీ కలగలిపిన పాత్రలో కనిపిస్తున్నారు. 'గౌరవం', 'కొరియర్ బాయ్ కళ్యాణ్' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలైన యామీ, ఇందులో సరికొత్త బాడీ లాంగ్వేజ్‌తో నవ్వులు పూయించడానికి వస్తున్నారు.
బలమైన సాంకేతిక బృందం.. జీవీ ప్రకాష్ సంగీతం!
{{/usCountry}}గతంలో 'ఆర్టికల్ 370' చిత్రంలో సీరియస్ పాత్రలో మెప్పించి జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న యామీ గౌతమ్, ఈ సినిమాలో ఊహించని రీతిలో కామెడీ, ఫాంటసీ కలగలిపిన పాత్రలో కనిపిస్తున్నారు. 'గౌరవం', 'కొరియర్ బాయ్ కళ్యాణ్' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలైన యామీ, ఇందులో సరికొత్త బాడీ లాంగ్వేజ్‌తో నవ్వులు పూయించడానికి వస్తున్నారు.
బలమైన సాంకేతిక బృందం.. జీవీ ప్రకాష్ సంగీతం!
{{/usCountry}}తమిళంలో 'మారి', 'లవ్ ఫెయిల్యూర్' వంటి క్రేజీ హిట్స్ అందించిన బాలాజీ మోహన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మతో కలిసి అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించారు. హిమాన్షు శర్మ, దివ్య నిధి శర్మ ఈ కథకు స్క్రీన్‌ప్లే సమకూర్చారు.
దక్షిణాదిలో వరుస మైండ్ బ్లాకింగ్ హిట్లతో దూసుకుపోతున్న ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తుండడం విశేషం. ఫాంటసీ, యాక్షన్, హ్యూమర్, ఫ్యామిలీ డ్రామా మేళవింపుగా రూపొందిన ఈ సినిమాలో అదినాథ్ ఎం కొఠారే, అనురాగ్ ఠాకూర్, సునీతా రాజ్‌వర్, మీతా వశిష్ట్, సుస్మితా ముఖర్జీ వంటి భారీ తారాగణం కీలక పాత్రల్లో నటించారు.
దసరా బరిలో ఫ్యామిలీ మ్యాజిక్!
దసరా సెలవుల సీజన్ సందర్భంగా కుటుంబ సమేతంగా థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు ఈ సినిమా పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. పండుగ వాతావరణంలో అక్టోబర్ 16న రాబోతున్న ఈ ఫాంటసీ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో వేచి చూడాలి.