ఇద్దరు మంత్రగత్తెలు, 3 పిశాచాలు, 4 దెయ్యాలను బ్రేక్‌ఫాస్ట్‌లో తినేస్తా- మంత్రగత్తెగా హీరోయిన్- నయీ నవేలీ టీజర్ అదుర్స్
Yami Gautam Nayi Naveli Teaser: హీరోయిన్ యామీ గౌతమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఫాంటసీ ఫ్యామిలీ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ 'నయీ నవేలీ' టీజర్ విడుదలైంది. "మా వదినో మంత్రగత్తె" అని మరిది చెప్పే మాటతో ప్రారంభమైన ఈ టీజర్ అదిరిపోయింది. హారర్, కామెడీ, బీజీఎమ్‌తో ఆకట్టుకుంటోంది నయీ నవేలి టీజర్.
Yami Gautam Nayi Naveli Teaser Released: బాలీవుడ్ విలక్షణ నటి యామీ గౌతమ్ ధర్ సరికొత్త అవతారంలో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఫాంటసీ ఫ్యామిలీ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ 'నయీ నవేలీ' టీజర్‌ను ఇవాళ (సెప్టెంబర్ 10) విడుదల చేశారు మేకర్స్.

ప్రముఖ నిర్మాణ సంస్థలు అమెజాన్ ఎంజీఎమ్ స్టూడియోస్, కలర్ ఎల్లో సంయుక్తంగా నయీ నవేలి సినిమాను నిర్మిస్తున్నాయి. దసరా పండుగ కానుకగా 2026 అక్టోబర్ 16న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకువస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
"మా వదిన మంత్రగత్తె".. ఒకే ఒక్క మాటతో రచ్చ రచ్చ
సాధారణంగా సాగుతున్న ఓ ఉమ్మడి కుటుంబంలోకి కొత్తగా అడుగుపెట్టిన వధువు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అంతా సజావుగా సాగుతోందనుకున్న సమయంలో ఇంటిల్లిపాదికి "మా వదినో మంత్రగత్తె" అని మరిది చెప్పడంతో టీజర్ ప్రారంభం అవుతుంది.
మరిది ఆ ఆరోపణ చేయడం ఆ ఇంటి వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తుంది. కట్ చేస్తే మంత్రగత్తె అయిన హీరోయిన్‌ను చూపిస్తారు. "మంత్రగత్తె.. అంతేనా.. ఇద్దరు మంత్రగత్తెలు, మూడు పిశాచాలను, నాలుగు దెయ్యాలను నేను రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లా తినేస్తాను. లేడీస్ అండ్ జెంటిల్‌మెన్ ఒక చిన్న విన్నపం.. థింక్.. బిగ్" అని యామీ గౌతమ్ చెప్పే డైలాగ్ హైలెట్‌గా ఉంది.
కామెడీ, ఫాంటసీ, హారర్ డ్రామా
ఆ తర్వాత వచ్చే బీజీఎమ్ సినిమాలోని కామెడీ, ఫాంటసీ, హారర్ డ్రామా ఎలిమెంట్స్ ఎలా ఉంటాయో చూపించింది. మరి అలాంటి మంత్రగత్తె ఆ కుటుంబంలోకి వెళ్లగానే ఎలాంటి గందరగోళం నెలకొంది? ఆ ఇల్లు ఎలాంటి విచిత్రమైన, వినోదాత్మక సంఘటనలకు వేదికగా మారింది? అనే అంశాలను టీజర్‌లో ఎంతో సరదాగా చూపించారు.
గతంలో 'ఆర్టికల్ 370' చిత్రంలో సీరియస్ పాత్రలో మెప్పించి జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న యామీ గౌతమ్, ఈ సినిమాలో ఊహించని రీతిలో కామెడీ, ఫాంటసీ కలగలిపిన పాత్రలో కనిపిస్తున్నారు. 'గౌరవం', 'కొరియర్ బాయ్ కళ్యాణ్' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలైన యామీ, ఇందులో సరికొత్త బాడీ లాంగ్వేజ్‌తో నవ్వులు పూయించడానికి వస్తున్నారు.
బలమైన సాంకేతిక బృందం.. జీవీ ప్రకాష్ సంగీతం!
తమిళంలో 'మారి', 'లవ్ ఫెయిల్యూర్' వంటి క్రేజీ హిట్స్ అందించిన బాలాజీ మోహన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మతో కలిసి అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించారు. హిమాన్షు శర్మ, దివ్య నిధి శర్మ ఈ కథకు స్క్రీన్‌ప్లే సమకూర్చారు.
దక్షిణాదిలో వరుస మైండ్ బ్లాకింగ్ హిట్లతో దూసుకుపోతున్న ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తుండడం విశేషం. ఫాంటసీ, యాక్షన్, హ్యూమర్, ఫ్యామిలీ డ్రామా మేళవింపుగా రూపొందిన ఈ సినిమాలో అదినాథ్ ఎం కొఠారే, అనురాగ్ ఠాకూర్, సునీతా రాజ్‌వర్, మీతా వశిష్ట్, సుస్మితా ముఖర్జీ వంటి భారీ తారాగణం కీలక పాత్రల్లో నటించారు.
దసరా బరిలో ఫ్యామిలీ మ్యాజిక్!
దసరా సెలవుల సీజన్ సందర్భంగా కుటుంబ సమేతంగా థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు ఈ సినిమా పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. పండుగ వాతావరణంలో అక్టోబర్ 16న రాబోతున్న ఈ ఫాంటసీ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో వేచి చూడాలి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


