Nee Forever OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న తమిళ రొమాంటిక్ మూవీ.. డేటింగ్ యాప్ ద్వారా ఫేక్ రిలేషన్ షిప్.. తెలుగులోనూ రిలీజ్

Nee Forever OTT: తమిళ రొమాంటిక్ డ్రామా ఫిల్మ్ ఓటీటీలోకి రాబోతుంది. డేటింగ్ యాప్ ద్వారా కలుసుకున్న ఓ జోడీ తమ రిలేషన్ షిప్ ను ఎలా తీసుకెళ్లారన్నదే ఈ సినిమా కథ. 

Published on: Apr 21, 2026, 14:04:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ మూవీ రాబోతుంది. లేటెస్ట్ గా థియేటర్లలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసిన ‘నీ ఫర్ ఎవర్’ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తుంది. నీ ఫర్ ఎవర్ మూవీ స్ట్రీమింగ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. ఈ వారమే సినిమా డిజిటల్ డెబ్యూ చేయనుంది.

ఓటీటీలోకి తమిళ్ రొమాంటిక్ మూవీ (x/Netflix_INSouth)
ఓటీటీలోకి తమిళ్ రొమాంటిక్ మూవీ (x/Netflix_INSouth)

నీ ఫర్ ఎవర్ ఓటీటీ

తమిళ రొమాంటిక్ డ్రామా మూవీ ‘నీ ఫర్ ఎవర్’ ఓటీటీ రిలీజ్ కు ముహూర్తం ఖరారైంది. ఈ యూత్ ఎంటర్ టైనర్ డిజిటల్ స్ట్రీమింగ్ పై ఇవాళ (ఏప్రిల్ 21) అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. ఈ చిత్రం పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో ఏప్రిల్ 24న రిలీజ్ కానుంది.

తెలుగులోనూ

తమిళ మూవీ ‘నీ ఫర్ ఎవర్’ మూవీ తెలుగులోనూ డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో నీ ఫర్ ఎవర్ సినిమా డిజిటల్ డెబ్యూ చేయనుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడించింది.

థియేటర్ రెస్పాన్స్

నీ ఫర్ ఎవర్ మూవీ మార్చి 27, 2026న థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రానికి అశోక్ కుమార్ కళైవాణి డైరెక్టర్. జెన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మించింది. ఇందులో సుదర్శన్ గోవింద్, అర్చనా రవి హీరోహీరోయిన్లుగా నటిించారు. థియేటర్లో ఈ మూవీకి మిక్స్ డ్ రెస్సాన్స్ దక్కింది. యూత్ ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేశారు. ఈ మూవీకి ఐఎండీబీలో 7.6 రేటింగ్ ఉంది.

నీ ఫర్ ఎవర్ స్టోరీ

నీ ఫర్ ఎవర్ సినిమా డిఫరెంట్ స్టోరీ లైన్ తో తెరకెక్కింది. డేటింగ్ యాప్ లో పరిచయమైన ఓ జంటకు ఎలాంటి పరిస్థితి తలెత్తిందనే కథతో నీ ఫర్ ఎవర్ మూవీని తీర్చదిద్దారు.

అజయ్ (సుదర్శన్ గోవింద్), మాతి (అర్చనా రవి) లవ్ కోసం పరితపిస్తుంటారు. వీళ్లు డేటింగ్ యాప్ లో ఓ తోడు కోసం వెతుకుతారు. తమ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకుంటారు. డేటింగ్ యాప్ ద్వారా అజయ్, మాతి కలుసుకుంటారు.

ఫేక్ రిలేషన్ షిప్

అజయ్, మాతి పరిచయంతో కథ మలుపు తీసుకుంటుంది. కానీ వాళ్ల రియల్ క్యారెక్టర్లను, లైఫ్ ను దాచి ఉంచి వీళ్లు ఫేక్ రిలేషన్ షిప్ కొనసాగిస్తారు. వీళ్ల ఇద్దరి మధ్య ఫీలింగ్స్ ఏర్పడతాయి. మరి ఆ తర్వాత ఏం జరిగింది? వీళ్ల మధ్య నిజంగానే లవ్ ఏర్పడిందా? అన్నది నీ ఫర్ ఎవర్ మూవీలో చూడాల్సిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More