OTT: మూడు నెలల తర్వాత ఇవాళ ఓటీటీలోకి వచ్చిన మలయాళం హారర్ కామెడీ.. ఉర్లో తిరిగే వింత ఆకారం.. మిస్టరీ ఛేదించే గ్రూప్

ఓటీటీలో మలయాళం హారర్ సినిమాల జోరు కొనసాగుతోంది. ఇవాళ మరో మలయాళం హారర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఊర్లో తిరిగే వింత ఆకారం వెనుక ఉన్న మిస్టరీని ఛేదించడం అనే కథ చుట్టూ ఈ సినిమా సాగుతుంది. 

Published on: Feb 6, 2026, 11:35:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఫ్రైడే వచ్చిందంటే చాలు ఓటీటీలో కొత్త సినిమాలు సందడి ఎక్కువగానే ఉంటుంది. డిఫరెంట్ కాన్సెప్ట్, జోనర్లలో తెరకెక్కిన చిత్రాలు డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేస్తుంటాయి. ఈ రోజు (ఫిబ్రవరి 6) అలాగే ఓటీటీలోకి వచ్చిన మలయాళ హారర్ కామెడీ థ్రిల్లర్ సినిమా ‘నెల్లిక్కంపోయిల్ నైట్ రైడర్స్’. ఊర్లో తిరిగే వింత ఆకారాన్ని కనిపెట్టాలనే లక్ష్యంతో ఉండే ఓ గ్యాంగ్ కథ ఇది.

ఓటీటీలోకి మలయాళ హారర్ కామెడీ థ్రిల్లర్ (x)
ఓటీటీలోకి మలయాళ హారర్ కామెడీ థ్రిల్లర్ (x)

నెల్లిక్కంపోయిల్ నైట్ రైడర్స్ ఓటీటీ

ఓటీటీలో మలయాళం సినిమాలకు క్రేజ్ ఎక్కువే. ఇక ఇందులో థ్రిల్లర్, హారర్ థ్రిల్లర్ సినిమాలు అయితే దక్కే ఆదరణ మరో లెవల్ లో ఉంటుంది. తెలుగు ఆడియన్స్ కూడా ఈ తరహా మలయాళం సినిమాలను ఇష్టపడతారు. ఇప్పుడు అలాంటి సినిమా నెల్లిక్కంపోయిల్ నైట్ రైడర్స్ ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

మూడు నెలల తర్వాత

నెల్లిక్కంపోయిల్ నైట్ రైడర్స్ సినిమా మూడు నెలల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ 2025 అక్టోబర్ 24న థియేటర్లలో రిలీజైంది. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీకి అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాలేకపోయాయి. మిక్స్ డ్ టాక్ తో నెల్లిక్కంపోయిల్ నైట్ రైడర్స్ యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది.

కలెక్షన్లు

నెల్లిక్కంపోయిల్ నైట్ రైడర్స్ చిత్రాన్ని రూ.8 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ సినిమా రూ.5 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. మలయాళంలో ఎడిటర్ గా పేరు సంపాదించుకున్న నౌఫల్ అబ్దుల్లా ఈ సినిమాతో డైరెక్టర్ గా అరంగేట్రం చేశాడు. ఇందులో మాథ్యూ థామస్ హీరో. మీనాక్షి, శరత్, రోషన్, మెరిన్, అబూ సలీం తదితరులు నటించారు.

నెల్లిక్కంపోయిల్ నైట్ రైడర్స్ స్టోరీ

కేరళ, తమిళనాడు సరిహద్దుల్లో నెల్లిక్కంపోయిల్ అనే గ్రామం ఉంటుంది. ఇది మారుమూల గ్రామం. ఈ ఊర్లో శ్యామ్ (మాథ్యూ థామస్) తన ఫ్రెండ్స్ గ్యాంగ్ తో కలిసి అల్లరి పనులు చేస్తుంటాడు. గ్రామంలోని మిస్టరీలను ఛేదించడానికి నైట్ రైడర్స్ అనే గ్యాంగ్ ను ఏర్పాటు చేస్తాడు.

అదే ఊర్లో ఓ వింత ఆకారం తిరుగుతూ ఉంటుంది. గుర్రం కాళ్లతో, మనిషి శరీరంతో, విచిత్రమైన ముఖంతో ఉన్న ఆ ఆకారం గ్రామస్తులను భయపెడుతుంది. అసలు అది మనిషేనా? లేకపోతే ఏదైనా వింత జీవా? లేదంటే దెయ్యమా? అని తెలుసుకునేందుకు నైట్ రైడర్స్ గ్యాంగ్ ట్రై చేస్తుంది. మరి ఆ వింత ఆకారం వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలియాలంటే నెల్లిక్కంపోయిల్ నైట్ రైడర్స్ సినిమా చూడాల్సిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More