OTT Trending: ఓటీటీని షేక్ చేస్తున్న క్యూట్ దెయ్యం మూవీ.. మూడు భాషల్లో ట్రెండింగ్ నంబర్ వన్ గా మలయాళం హారర్ థ్రిల్లర్

ఓటీటీని ఓ మలయాళ హారర్ థ్రిల్లర్ షేక్ చేస్తోంది. క్యూట్ దెయ్యం కథతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా మూడు భాషల్లో ఇండియాలో ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగుతోంది. ఈ చిత్రం వివరాలేంటో చూసేయండి. 

Published on: Feb 5, 2026, 12:38:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలో మలయాళ హారర్ థ్రిల్లర్ సర్వం మాయ అదరగొడుతోంది. క్యూట్ దెయ్యం కథతో వచ్చిన ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తాచాటుతోంది. ఏకంగా మూడు భాషల్లో ఇండియాలో నంబర్ వన్ ఓటీటీ మూవీగా ట్రెండ్ అవుతోంది. ఇందులో నివిన్ పౌలీ హీరో. ఈ మూవీపై నెట్టింట్లో పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.

ఓటీటీ ట్రెండింగ్ లో మలయాళ హారర్ మూవీ (youtube)
ఓటీటీ ట్రెండింగ్ లో మలయాళ హారర్ మూవీ (youtube)

సర్వం మాయ ఓటీటీ

థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సర్వం మాయ ఓటీటీని షేక్ చేస్తోంది. జనవరి 30, 2026న జియోహాట్‌స్టార్‌లో రిలీజైంది ఈ హారర్ థ్రిల్లర్. డిజిటల్ స్ట్రీమింగ్ లో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. ఈ సినిమాలో నివిన్ పౌలీ, రియా షిబు, అజు వర్గీస్ తదితరులు నటించారు.

మూడు భాషల్లో ట్రెండింగ్

మలయాళ మూవీ సర్వం మాయ ఇప్పుడు ఓటీటీలో మూడు భాషల్లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ సినిమా మలయాళంతో పాటు తమిళం, తెలుగు, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో ఓటీటీలో రిలీజైంది. ఇప్పుడు తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో ఇండియాలో నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది.

రూ.150 కోట్లు

చిన్న సినిమాగా వచ్చిన సర్వం మాయ బాక్సాఫీస్ దగ్గర పెద్ద హిట్ సాధించింది. కేవలం రూ.30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిిన ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.150 కోట్ల గ్రాస్ కలెక్షన్లు ఖాతాలోవేసుకుంది. ఇది మలయాళ హీరో నివిన్ పౌలీ కెరీర్ లో ఫస్ట్ రూ.100 కోట్ల వసూళ్లు సాధించిన సినిమా. అఖిల్ సత్యన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ డిసెంబర్ 25, 2025న థియేటర్లలో రిలీజైంది.

సర్వం మాయ స్టోరీ

ప్రభేందు (నివిన్ పౌలీ) ఓ బ్రహ్మణ కుటుంబంలో జన్మించిన యువకుడు. కానీ నాస్తికుడు. దేవుళ్లంటే పెద్దగా నమ్మడు. పైగా తండ్రితో గొడవలు. దీంతో ఇంటికి దూరంగా ఉంటాడు. గిటారిస్ట్ కావాలని కల కంటాడు. యూరోప్ వెళ్లాలని అనుకుంటాడు. కానీ ఆర్థిక సమస్యల కారణంగా ఇవేమీ సాధ్యం కావు.

వీసా పొందడంలో ఫెయిల్ కావడంతో ప్రభేందు తన కజిన్ రూపేష్ (అజు వర్గీస్) అనే పూజారి దగ్గర అసిస్టెంట్ గా చేరతాడు. వీళ్లు ఒక ఇంట్లో దెయ్యాన్ని వదిలించే పూజ చేయాల్సి వస్తుంది. అక్కడే కథలో మలుపు. మాయ (రియా షిబు) అనే ఆడ దెయ్యం ప్రభేందుకు మాత్రమే కనిపిస్తుంది. ప్రభేందు వెంట పడుతుంది.

గతం మర్చిపోయి

మాయకు తాను ఎలా చనిపోయిందని, తన గతం ఏమీ గుర్తు ఉండదు. అందుకే ప్రభేందు ఈ దెయ్యానికి డెలూలు అని పేరు పెడతాడు. దెయ్యం తన గతం తెలుసుకోవడానికి సాయం చేస్తాడు. మరి మాయకు గతం గుర్తుకొచ్చిందా? ఈ క్రమంలో ప్రభేందు జీవితం ఎలాంటి మలుపులు తీసుకుందన్నది సర్వం మాయ సినిమాలో చూడాల్సిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More